X

Konijeti Rosaiah : వైఎస్‌ను కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించాలన్న రోశయ్య..ఆ వైఎస్‌కే ఆత్మబంధువు ఎలా అయ్యారు !?

కాంగ్రెస్ రాజకీయాల్లో ఒకప్పుడు వైఎస్ వ్యతిరేకిగా పేరు పడిన రోశయ్య.. తర్వాత ఆయనకు ఆత్మబంధువు అయ్యారు. ఎలా సాధ్యమయింది ?

FOLLOW US: 

రోశయ్యకు దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర రెడ్డితో ఉన్న బంధం ప్రత్యకమైంది. కాంగ్రెస్ లో ఎన్ని గ్రూపు తగాదాలు ఉన్న , ఎన్ని వర్గాలు ఉన్న ఆ ప్రభావం వై.యస్.ఆర్ , రోశయ్య మధ్య ఉన్న బంధంపై పడలేదు. నిజానికి వై.ఎస్.ఆర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఓ సారి పీవీ నరసింహారావుకు రోశయ్య ఫిర్యాదు కూడా చేశారు. ఆ ఘటనను వై.ఎస్ పెద్దగా పట్టించుకోలేదు. రోశయ్య స్వభావం తెలిసిన వై.ఎస్ ఎప్పుడూ ఆయనను దూరం పెట్టలేదు. కోట్ల విజయభాస్కర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ అసమ్మతినేతగా గుర్తింపు పొందారు. దీంతో విజయభాస్కరరెడ్డి ప్రోత్సాహంతో రోశయ్య పీవీకి .. వైఎస్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు. అప్పట్లోఆ విషయం సంచలనాత్మకమమయింది. కానీ తర్వాత కాలంలో రోశయ్య వైఎస్‌కు అత్యంత ఆత్మీయుడయ్యారు. 

Also Read : మాటల మాంత్రికుడు రోశయ్య .. ఆ పంచ్‌లకు ఎవరి దగ్గరా ఆన్సర్ ఉండదు !

1999లో ప్రతిపక్షనేత గా ఉన్నప్పుడు శాసన సభలో చర్చించాల్సిన అనేక అంశాలపై రోశయ్యపైనే ఎక్కువగా ఆధారపడేవారు వైఎస్.  2004లో వై.ఎస్ పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో చీరాల నుండి పోటీ చేసి విజయం సాధించిన రోశయ్య వై.ఎస్ కేబినెట్ లో ఆర్ధిక మంత్రిగా  మాత్రమే కాదు శాసనసభా వ్యవహారాలు కూడా చూసుకునేవారు. శాసన సభలో నెంబర్ 2గా వ్యవహరించారు. తన వాగ్దాటితో ప్రతిపక్షానికి చమటలు పట్టించిన నేర్పరిగా గుర్తింపు పొందారు.

Also Read : తరలిపోయిన ఉమ్మడి రాష్ట్ర దిగ్గజ నేత.. మాజీ సీఎం రోశయ్య కన్నుమూత !

2009లో రోశయ్య అసెంబ్లీకి పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడంతో మంత్రి పదవికి శాసన సభకు రాజీనామా చేయించి మండలికి ఎంపిక చేశారు. ఆ తరువాత 2009లో ఎన్నికలలో విజయం సాదించాక రోశయ్యను వై.యస్ యదావిధిగా ఆర్ధిక మంత్రిగా కొనసాగించారు వైఎస్.  చాలా సందర్భాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనా శైలిని పొగిడేవారు. అదే సమయంలో సుతిమెత్తగా హెచ్చరికలు కూడా జారీ చేసేవారు. 

Also Read: Konijeti Rosaiah Death: మాజీ గవర్నర్‌ రోశయ్య కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పథకాలు ప్రవేశ పెట్టడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ క్రమంమలో ఆయన ఎక్కడ సభలో మాట్లాడినా ఆయన పథకాలు ప్రవేశపెడుతూంటారు. అయితే ఆర్థిక మంత్రిగా వాటికి నిధులు సర్దుబాటు చేయాల్సింది రోశయ్యనే. అందుకే  ఆయన ఎప్పుడు పథకాలు ప్రకటిస్తారోనని ఆందోళనతో కంట్రోల్ చేసేందుకు .. ప్రయత్నించేవాడినని చెప్పేవారు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో ఎలా ఉన్నా... చివరి వరకూ ఆత్మీయంగా ఉన్నది రోశయ్యనే. చివరికి వైఎస్ మరణవార్తను అధికారికంగా చెప్పింది కేబినెట్‌లోఅత్యంత సీనియర్‌గా ఉన్న రోశయ్యనే. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: AP News Konijeti Rosaiah Rosayya rosayya dead Rosayya no more Formor CM Rosayya Rosaiah

సంబంధిత కథనాలు

Student Suicide: ఇంజినీరింగ్ మ్యాథ్స్‌ పరీక్ష లెక్క తప్పింది.. నిండు ప్రాణం పోయింది

Student Suicide: ఇంజినీరింగ్ మ్యాథ్స్‌ పరీక్ష లెక్క తప్పింది.. నిండు ప్రాణం పోయింది

Breaking News Live: హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం బంద్‌కు పిలుపు

Breaking News Live: హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం బంద్‌కు పిలుపు

Tirumala Sarva Darshan Tickets: నిన్న ప్రత్యేక దర్శనం టికెట్లు మిస్సయ్యారా.. నేడు సర్వ దర్శనం టికెట్లు విడుదల

Tirumala Sarva Darshan Tickets: నిన్న ప్రత్యేక దర్శనం టికెట్లు మిస్సయ్యారా.. నేడు సర్వ దర్శనం టికెట్లు విడుదల

First Newspaper in India: దేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఎలా పుట్టిందో తెలుసా.. ధర చాలా ఎక్కువే

First Newspaper in India: దేశంలో మొట్టమొదటి న్యూస్ పేపర్ ఎలా పుట్టిందో తెలుసా.. ధర చాలా ఎక్కువే

Petrol-Diesel Price 29 January 2022: వాహనదారులకు స్వల్ప ఊరట.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ భారీగా పెరిగింది.. లేటెస్ట్ రేట్లు ఇవీ

Petrol-Diesel Price 29 January 2022: వాహనదారులకు స్వల్ప ఊరట.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ భారీగా పెరిగింది.. లేటెస్ట్ రేట్లు ఇవీ
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Samantha: సమంత సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది!

Samantha: సమంత సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది!

Naga Chaitanya Web Series Title: అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్.. ఆసక్తి కలిగిస్తున్న టైటిల్

Naga Chaitanya Web Series Title: అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్.. ఆసక్తి కలిగిస్తున్న టైటిల్

Malavika Mohanan: బికినీలు... బీచ్‌లు... సరదాలు... మాళవిక కొత్త ఫొటోలు!

Malavika Mohanan: బికినీలు... బీచ్‌లు... సరదాలు... మాళవిక కొత్త ఫొటోలు!

Cough and Cold: దగ్గు, జలుబు వేదిస్తున్నాయా? ఈ ఆహారానికి దూరంగా ఉండండి

Cough and Cold: దగ్గు, జలుబు వేదిస్తున్నాయా? ఈ ఆహారానికి దూరంగా ఉండండి