TSRTC: రేపటి నుంచి ప్రతి గురువారం టీఎస్ఆర్టీసీ ‘బస్ డే’.. ఆ రోజు అందరూ ఏం చేస్తారంటే..
ప్రతి గురువారం ‘బస్ డే’ నిర్వహించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. ఈ నెల 9 గురువారం నుంచి ప్రతి వారం కచ్చితంగా విధిగా దీన్ని అమలు చేయాలని సూచించారు.
![TSRTC: రేపటి నుంచి ప్రతి గురువారం టీఎస్ఆర్టీసీ ‘బస్ డే’.. ఆ రోజు అందరూ ఏం చేస్తారంటే.. TSRTC MD Sajjanar orders to Conduct 'RTC Day' on Every thusday TSRTC: రేపటి నుంచి ప్రతి గురువారం టీఎస్ఆర్టీసీ ‘బస్ డే’.. ఆ రోజు అందరూ ఏం చేస్తారంటే..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/29/a3d5a39b2d5134c9fcbdb5f6704b9252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో సంస్థను లాభాల బాట పట్టించే వ్యూహాలు తయారవుతున్నాయి. బస్సుల్ని మరింత లాభదాయక రీతిలో ఎలా నడపాలో అధికారులు మేథోమథనం చేస్తున్నారు. ఇందుకోసం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కొత్త ఆదేశాలిచ్చారు. ప్రతి గురువారం ‘బస్ డే’ నిర్వహించాలని సజ్జనార్ ఆదేశించారు. ఈ నెల 9 గురువారం నుంచి ప్రతి వారం కచ్చితంగా విధిగా దీన్ని అమలు చేయాలని సజ్జనార్ ఆదేశించారు.
బస్ డే ఉద్దేశం ఏంటంటే..
మామూలుగా ఆర్టీసీ అధికారులకు మంచి జీతాలు ఉంటాయి. కాబట్టి, వారు కార్యాలయాలకు చాలా మంది సొంత వాహనాల్లోనే వస్తుంటారు. ఒక్కరోజు కూడా బస్కెక్కే ప్రయత్నం చేయరు. ఆఫీసుకు ఇంటికి ఫీల్డ్‌కు కార్లలోనే తిరుగుతారు. ఇలా అయితే క్షేత్ర స్థాయిలో ప్రయాణికులు ఏం కోరుకుంటున్నారో తెలిసే అవకాశమే ఉండదు. ఈ సందేహం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు వచ్చింది. ఈ మధ్య ఆయన బస్సుల్లోనే తిరుగుతూ ప్రయాణికులు, సిబ్బంది సాదకబాధకాలు తెలుసుకుంటున్నారు. తాజాగా ఇక నుంచి అధికారులూ బస్సుల్లో ప్రయాణించి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సజ్జనార్ నిర్ణయించారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ప్రతి గురువారం బస్సుల్లోనే తిరగాలని ఆదేశాలు ఇచ్చారు. దీన్ని ప్రతి గురువారం విధిగా పాటించాలని ఆ వారాన్ని ‘బస్ డే’గా నామకరణం చేయాలని సూచించారు.
మాస్కు లేకపోతే బస్సులోకి నో ఎంట్రీ
ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లో కూడా అడుగుపెట్టిన వేళ వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు ఆర్టీసీ కూడా నిబంధనలు పెట్టింది. ఇప్పటి వరకూ భారత్‌లో 23 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే తెలంగాణ సర్కార్ మాస్క్‌ల వినియోగంపై కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎవరైనా మాస్క్ లేకుండా బయట తిరిగినట్టయితే వారికి రూ.వెయ్యి వరకు జరిమానా విధించనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కూడా ముందస్తు చర్యలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఒమిక్రాన్ నేపథ్యంలో ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నిబంధనల ప్రకారం.. బస్సులో ప్రయాణించే ప్యాసింజర్లకు మాస్క్ తప్పనిసరి చేశారు. మాస్స్ ఉంటేనే బస్సులోకి అనుమతించాలని ఆదేశించారు. కండక్టర్‌తో పాటు డ్రైవర్ కూడా తప్పని సరిగా మాస్క్ ధరించాలి. అలాగే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా.. అన్ని బస్సులను శానిటైజ్ చేయాలని, ప్రతిరోజు.. డిపో నుండి బయటకు వెళ్లే ప్రతి సబ్బును శానిటైజ్ చేయాలని ఆదేశించారు. అంతేకాక, కరోనా కొత్త వేరియంట్‌పై అవగాహాన కలిగించేలా.. అన్నిబస్టాండ్‌లలో మైకుల్లో ప్రకటనలు చేయాలని ఆదేశించారు.
Also Read: రెయిన్ అలర్ట్.. ఏపీలో మరో నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణలో చిరు జల్లులకు ఛాన్స్
Also Read: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఇప్పుడు డబ్బులు ఎందుకు కట్టాలి?
Also Read: Gold-Silver Price: రెండోరోజూ మారని బంగారం ధరలు.. వెండి నేల చూపులు.. మీ ప్రాంతంలో ఇవాల్టి ధరలు ఇలా..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)