Gold-Silver Price: రెండోరోజూ మారని బంగారం ధరలు.. వెండి నేల చూపులు.. మీ ప్రాంతంలో ఇవాల్టి ధరలు ఇలా..
రెండో రోజూ బంగారం ధర నిలకడగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,760 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.48,830 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా రెండో రోజూ నిలకడగా ఉంది. వెండి ధరలో మాత్రం స్వల్ప తగ్గుదల కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,760 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.48,830 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.65,000గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,760 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,830గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,000 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,760 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,830గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,000గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లో మాత్రం బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,820 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,820గా ఉంది.
ప్లాటినం ధరలో పెరుగుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు గ్రాముకు రూ.19 పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,500 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Airtel vs Jio vs VI Plans: జియో, ఎయిర్‌టెల్, విలో ఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే!
Also Read: LIC Policy: రోజుకు 73 పెట్టుబడితో మెచ్యూరిటీకి రూ.10 లక్షలు పొందొచ్చు!
Also Read: Work From Home: WFH చేస్తున్నారా! కేంద్రం కొత్త రూల్స్ తీసుకొస్తోంది తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి