Bigg Boss Telugu: యాంకర్ రవి ఎలిమినేన్ రచ్చ.. ఏం జరిగిందో చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్.. బ్యాన్ కోసం అమిత్ షాకి లేఖ రాస్తా
బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలంటూ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. ‘‘తెలంగాణలో బిగ్ బాస్ గేమ్ షోను బ్యాన్ చేయాలి.. అసలు ఆ షోలో ఏం జరుగుతుందో అర్ధంకావడంలేదు’’ అని అన్నారు.
బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభమైన ప్రతిసారి లేదా మధ్యలో కంటెస్టెంట్స్ విషయంలో విమర్శలు వస్తూ ఉండడం సహజమే. మొదటి సీజన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పుడు ఐదో సీజన్ వరకూ ప్రతి సీజన్ మొదలవుతుందంటే చాలు.. దాన్ని బ్యాన్ చేసేయాలని పలువురు డిమాండ్ చేస్తుంటారు. ఇంకొందరు కోర్టుకు కూడా వెళ్తుంటారు. షో జరుగుతుండగా.. ఏదైనా వివాదాస్పద సన్నివేశాలు జరిగితే ఈ విమర్శలు మళ్లీ ఊపందుకుంటాయి. తాజాగా మరోసారి బిగ్ బాస్ షోపై విమర్శలు తెరపైకి వచ్చాయి.
ఆదివారం నాటి ఎపిసోడ్‌లో యాంకర్ రవి ఎలిమినేట్ కావడం బిగ్ బాస్‌పై వ్యతిరేకతకు దారి తీసింది. యాంకర్ రవి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించగానే.. కొంత మంది ఆయన అభిమానులు బిగ్ బాస్ సెట్ ఉండే అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట నిరసన చేశారు. ప్రాంతీయ అభిమానం జోడించి తెలంగాణ వ్యక్తిని ఏ కారణం లేకుండా ఎలా ఎలిమినేట్ చేస్తారని వారు ప్రశ్నించారు. తాజాగా దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా స్పందించారు.
తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ‘‘తెలంగాణలో బిగ్ బాస్ గేమ్ షోను బ్యాన్ చేయాలి.. అసలు ఆ షోలో ఏం జరుగుతుందో అర్ధంకావడంలేదు’’ అని అన్నారు. యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యి బయటకు రావడంలో ఎదో జరిగిందని రాజా సింగ్ అన్నారు. రవి విషయంలో ఏం జరిగిందో బయటకు రావాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్స్ తెచ్చి రెచ్చగొడ్తున్నారని రాజా సింగ్ ఆరోపించారు.
Also Read: కొత్త వేరియంట్‌పై కేంద్రం కీలక సూచనలు.. సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు లేఖ
‘‘గత రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర కొంత మంది రచ్చరచ్చ చేశారు.. అసలు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి ప్రజలకు ఏం మేసెజ్‌లు ఇస్తున్నారు? చిన్న పిల్లలు, మహిళలు బిగ్ బాస్ కంటెంట్ చూడలేకపోతున్నారు. బిగ్ బాస్ షోకి సైతం సెన్సార్ ఉండాల్సిందే. అన్నీ భాషలు ఉన్న బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి లేఖ రాస్తా. హిందూ దేవుళ్లను సైతం బిగ్ బాస్‌లో కించపరుస్తున్నారు’’ అని రాజా సింగ్ మండి పడ్డారు.
Also Read: దేవుడా.. ఓ మంచి దేవుడా.. దయచేసి కొత్త వేరియంట్‌ను నా రాష్ట్రానికి రానివ్వకు'
Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి