IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

KTR Comments on AP: నరకంలాగా ఏపీ, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు - ‘నేనేం డబ్బా కొట్టట్లేదు, అన్నీ నిజాలే’నంటూ కామెంట్స్

Hyderabad: హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 11వ ఎడిషన్ క్రెడాయ్ ప్రాపర్టీ షో శుక్రవారం జరిగింది. ఈ ప్రాపర్టీ షోకి మంత్రి కేటీఆర్ హాజరై మాట్లాడారు.

FOLLOW US: 

KTR Comments on Andhrapradesh: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఏపీలో మౌలిక వసతులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు, నీళ్లు లేవని, రోడ్ల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉందని చెప్పారు. ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టే ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో రోడ్ల పరిస్థితిపై అక్కడి ప్రజలు మండిపడుతున్నారని అన్నారు. స్వయంగా ఏపీలో సొంతూర్లకు వెళ్లిన తన స్నేహితులే ఈ విషయాలు చెబుతున్నారని అన్నారు. తెలంగాణలో ప్రశాంతమైన వాతావరణం సహా చక్కటి మౌలిక సదుపాయాలు ఉన్నాయని అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 11వ ఎడిషన్ క్రెడాయ్ ప్రాపర్టీ షో శుక్రవారం జరిగింది. ఈ ప్రాపర్టీ షోకి మంత్రి కేటీఆర్ హాజరై మాట్లాడారు.

‘‘ఏపీలో ఉన్న పరిస్థితిని సంక్రాంతికి ఇంటికి వెళ్లొచ్చిన నా స్నేహితుడు ఒకరు నాకు ఫోన్ చేసి చెప్పారు. అక్కడ కరెంటు, నీళ్లు లేవట.. రోడ్లు అధ్వానంగా ఉన్నాయట. ఇక్కడి నుంచి కొంత మంది జనాల్ని బస్సులు వేసి ఏపీకి పంపాలని కోరాడు. ఎందుకంటే.. ఇక్కడ ఉన్న మెరుగైన పాలన విలువ జనాలకి తెలుస్తుందని చెప్పాడు. నేను చెప్పేది అతిశయోక్తి అనిపిస్తే మీరు కూడా వెళ్లి చూసి రండి. నేనేదో తెలంగాణ రాష్ట్రం గురించి డబ్బా కొట్టడం లేదు. ఇవి వాస్తవాలు.’’ అని మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

దేశంలోకెల్లా హైదరాబాద్‌ ఉత్తమ నగరం అని కేటీఆర్ అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రోడ్లు, మౌలిక సదుపాయాలు బాగున్నాయని చెప్పారు. నగరంలో రోడ్ల అభివృద్ధిని చూసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా మెచ్చుకున్నారని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పక్క రాష్ట్రాల నుంచి బిల్డర్లు వస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తాగు నీటి కోసం జంట జలాశయాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పారు. భవిష్యత్తులో హైదరాబాద్‌లో ప్రతి రోజు తాగునీరు ఇస్తామని ప్రకటించారు. డిసెంబర్‌లోపు వంద శాతం ఎస్‌టీపీ పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు.

జీవో 111 గురించి మాట్లాడుతూ.. దాన్ని తన కోసమే ఎత్తివేశారని ఒక పిచ్చోడు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. 111 జీవో పరిధిలో లక్షా 30 వేల ఎకరాలు ఉన్నాయని, అవన్నీ తనవేనా అని నిలదీశారు. జీవో ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్‌ గతంలోనే హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ జీవో పరిధిలో అద్భుతమైన అధునాతన నగరాన్ని సృష్టించవచ్చని తెలిపారు.

Published at : 29 Apr 2022 01:14 PM (IST) Tags: minister ktr Andhrapradesh news KTR Speech in Credai Credai Hyderabad Property Show AP Power issues KTR On Andhrapradesh Hyderabad Property Show

సంబంధిత కథనాలు

Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్

Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్

Malla Reddy About Revanth Reddy: టార్గెట్ రేవంత్ రెడ్డి, మరోసారి రెచ్చిపోయిన మంత్రి మల్లారెడ్డి - మధ్యలో రేవంత్ పెళ్లి ప్రస్తావన

Malla Reddy About Revanth Reddy: టార్గెట్ రేవంత్ రెడ్డి, మరోసారి రెచ్చిపోయిన మంత్రి మల్లారెడ్డి - మధ్యలో రేవంత్ పెళ్లి ప్రస్తావన

Modi Hyderabad Tour: ఎల్లుండే హైదరాబాద్‌కు ప్రధాని మోదీ - ఈ పోస్టులు పెడితే నో ఎంట్రీ, కేసీఆర్ గైర్హాజరు!

Modi Hyderabad Tour: ఎల్లుండే హైదరాబాద్‌కు ప్రధాని మోదీ - ఈ పోస్టులు పెడితే నో ఎంట్రీ, కేసీఆర్ గైర్హాజరు!

Hyderabad: ఏడాదిగా సహజీవనం, రెండ్రోజుల్లోనే పెళ్లి - ఇంతలో వరుడు మృతి! వధువు ఏం చేసిందంటే

Hyderabad: ఏడాదిగా సహజీవనం, రెండ్రోజుల్లోనే పెళ్లి - ఇంతలో వరుడు మృతి! వధువు ఏం చేసిందంటే

Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం

Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి

Rajya Sabha Elections 2022: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, తెలంగాణలో రెండు స్థానాలకు ఎలక్షన్

Rajya Sabha Elections 2022: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, తెలంగాణలో రెండు స్థానాలకు ఎలక్షన్

In Pics: వ్యాపార దిగ్గజాలతో కేటీఆర్ వరుస భేటీలు - తెలంగాణకు రానున్న కంపెనీలు ఇవే, ఫోటోలు

In Pics: వ్యాపార దిగ్గజాలతో కేటీఆర్ వరుస భేటీలు - తెలంగాణకు రానున్న కంపెనీలు ఇవే, ఫోటోలు

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?