Kavitha: కేటీఆర్‌తో ఎందుకు చెడింది? కేసీఆర్ ఫ్యామిలీలో కోవర్టు ఎవరు? కవిత సోదరితో ABP Desam సంచలన ఇంటర్వ్యూ!
Kavitha: బీఆర్‌లోనే కాకుండా కేసీఆర్ ప్యామిలీలో కూడా కవిత కామెంట్స్ అగ్గిరాజేశాయి. దీంతో తెలంగాణ రాజకీయాల్లో సెగలు పుడుతున్నాయి. ఇంతకీ ఆ పార్టీలో, కుటుంబంలో ఏం జరుగుతుందో చెప్పారు కవిత సోదరి రమ్యారావు.

Kavitha: చిన్నప్పటి నుంచి చూస్తున్న కవిత వేరని ఇప్పుడు చూస్తున్న వ్యక్తి వేరని కేసీఆర్ అన్న కూతురు రమ్యరావు అన్నారు. చిన్నప్పటి నుంచి పప్పు అని పిలిచే వ్యక్తి నిప్పులా ఎలా మారిపోయారో అర్థంకావడం లేదని ఆశ్చర్యపోయారు. దీనంతటికీ సంతోష్ కారణమని ఆరోపించారు. ఇలా చాలా సంచలన విషయాలను రమ్యారావు ఏబీపీ దేశం ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
ABP దేశం: కవిత వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలకు కారాణాలేంటి..? ఆస్తి వివాదాలా లేక తండ్రి తర్వాత తనకే పార్టీపై అధికారం దక్కాలని కవిత కోరుకుంటున్నారా..?
కల్వకుంట్ల రమ్యారావు (కేసీఆర్ అన్నకూతురు, కవిత సోదరి): కవిత గత వారం రోజుల నుంచి చేస్తున్న వ్యాఖ్యల కారణంగా కుటుంబ సభ్యుల మధ్య గ్యాప్ వచ్చిందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ గ్యాప్ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. మొన్నటి వరకూ బీఆర్‌ఎస్ అధికారంలో ఉంది కాబట్టి, కుటుంబ సభ్యల మధ్య విభేధాలు బయటపడలేదు. ఇప్పడు అధికారం లేదు కాబట్టి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేసీఆర్ పార్టీ పెట్టడానికి ప్రధాన జెండా, అజెండా ..ఆంధ్రోళ్ల నుంచి తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతోందని, నీళ్లు నిధులు నియామకాలలో తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో బీఆర్ ఎస్ ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ప్రక్కకు వెళ్లి, కుటుంబం, అధికారం, ఆధిపత్యం, విభేదాలు తెరపైకి వచ్చాయి. ఆస్తులలో వాట, అధికారం కోసమే ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో విభేదాలు తారా స్థాయికి చేరాయి.
ABP దేశం: కవిత మనస్తత్వం ఎలా ఉంటుంది. ఇప్పుడెందుకు పార్టీలో అంతర్గత వ్యవహరాలు, కుటుంబ సభ్యులపై ఇంత దూకుడుగా ఎందుకు వెళుతోంది.? కవితకు కేటీఆర్‌కు మధ్య బాండింగ్ ఎలా ఉంది.?
రమ్యారావు: సందర్బాన్ని బట్టి మనిషి రకరకాలుగా మారొచ్చు. చిన్నప్పుడు కవిత వేరు, రాజకీయాల్లోకి రాకముందు కవిత వేరు. రాజకీయాల్లోకి వచ్చాక, బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక, ఇప్పుడు అధికారం లేనప్పుడు నేను చూస్తున్న కవిత వేరు. అధికారం ఉన్నప్పుడు ఒకరకంగా, అధికారం లేనప్పుడు ఒకరకంగా , ప్రజాసంక్షేమం కంటే నా క్షేమమే ముఖ్యం అన్నట్లుగా కవిత తీరు కనిపిస్తోంది. కవిత కేటీఆర్‌ను రామన్నా అని పిలిచేది. కేటీఆర్ చాలా ప్రేమగా చెల్లిని పప్పు, పప్పు అని పిలిచేవాడు. ఇప్పుడు ఆ పప్పు నిప్పైంది. కేవలం రాజకీయాల కోసం ఆప్యాయతలు, అనుబంధాలు మారిపోయాయి. నేనూ కవిత సొంత అక్కచెల్లెలుగా ఉండేవాళ్లం. కేసీఆర్‌నే ప్రశ్నించే స్దాయికి కవిత వచ్చింది. అందులోనూ పార్టీ అధికారంలో లేనప్పుడు ఇలా చేస్తోందంటే ఏం ఆశించిందో తెలంగాణ ప్రజలే గ్రహించాలి. కవిత అడిగిన వర్కింగ్ ప్రెసిండెంట్ ఇవ్వకపోతే పార్టీ నుంచి వెళ్తేందుకు సిద్దమవుతున్నట్లు సమచారం. అయితే ఆమె పార్టీ వీడి బయటకుళ్లి మరో పార్టీ పెడితే, ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు నలిగిపోతారు. కొత్తపార్టీలో మళ్లీ కొత్తగా ప్రయాణం మొదలుపెట్టడం వల్ల నష్టపోయేది ఇన్నాళ్లు బీఆర్ ఎస్ ను నమ్ముకున్న కార్యకర్తలే.
ABP దేశం: ఈ మొత్తం వ్యవహారంలో సంతోష్ ప్రమేయం ఉందా.. ఉంటే సంతోష్ ఎవరిని ప్రభావితం చేస్తున్నారు. కవిత, కేటీఆర్ మధ్య గ్యాప్ కు కారణమైన కోర్టు ఎవరు..?
రమ్యారావు: కేసీఆర్ కుటుంబంలో ఉంటూ శకునిలా మొత్తం చేస్తున్నదే సంతోష్. కేసీఆర్ కుటుంబంలో గొడవలు పెట్టి, ఇప్పుడు యూరప్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నారు. బిలోపావర్టీ కింద 200 గజాల ల్యాండ్ తీసుకున్న సంతోష్ తరువాత లక్షల కోట్లు ఎలా సంపాదించారు. మూడు ఫామ్ హౌస్‌లు ,కోట్లాది రూపాయల డబ్బు ఎలా వచ్చింది. ఇంత వేగంగా సంపాదించడం అదానీకి, అంబానీకే సాధ్యం కాదు. పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో సంతోష్ మొత్తం బ్రష్టు పట్టించారు. ఎవరనీ కేసీఆర్ ను కలవనీయకుండా మెంటల్ మ్యాకప్ చేశారు. ఐఏఎస్ అధికారులను సైతం గంటలు గంటలు వేయిట్ చేయించి కేసీఆర్ పై వ్యతిరేకత వచ్చేలా చేశారు. బీఆర్ ఎస్ లో నాకు తెలిసన కోవర్టు సంతోష్. పార్టీలో కోవర్టు ఎవరు అనేది కవిత చెప్పాలి. టీవీ సీరియల్ సాగదీసినట్లుగా కాకుండా కవిత ఇప్పటికైనా ఆ కోవర్టుల పేర్లు బయటపెట్టాలి. కవిత, కేటీఆర్ కు మాత్రమే కాదు పార్టీలో కేసీఆర్ తో ఎంతో మందికి గ్యాప్ రావడానికి కారణం ఎంపీ సంతోష్.





















