అన్వేషించండి

Hydra Ranganath: హైడ్రా సైలెంట్‌గా లేదు- మల్లారెడ్డి, ఒవైసీల కాలేజీలు కూల్చివేతపై రంగనాథ్ క్లారిటీ

Hydra Commissioner Ranganath | ఒవైసీ కాలేజీలు, మల్లారెడ్డి కాలేజీలు బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయని, విద్యార్థుల భవిష్యత్ కోసం ఇప్పుడే చర్యలు తీసుకోవడం లేదని రంగనాథ్ తెలిపారు.

Hyderabad News | హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు, నాలాలు, జలాశయాల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో కూల్చివేతలు అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేనివే అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు. హైడ్రాపై మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియానే ఎక్కువగా హైడ్రాపై ప్రచారం చేస్తుందన్నారు. సామాన్యుల ఇండ్లనే హైడ్రా కూల్చివేస్తోందని, ఒవైసీ బ్రదర్స్ కాలేజీలు, మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీలు, పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలను టచ్ చేయాలంటే ప్రభుత్వం, హైడ్రా భయపడుతున్నా అని మీడియా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ప్రశ్నించింది. 

గ్రౌండ్ లెవల్‌లో పేపర్ వర్క్ చేస్తున్న హైడ్రా

హైడ్రా ప్రస్తుతం గ్రౌండ్ లెవల్ లో వర్క్ చేస్తోందని, సైలెంట్ గా లేదన్నారు. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఒవైసీల కాలేజీలు కూల్చివేతపై రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తామన్న ధీమాతో కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూములను ఆక్రమించారని పేర్కొన్నారు. పేద వాళ్లను ఇబ్బందులు గురిచేయడం హైడ్రా పనికాదు. హైడ్రా ఇప్పటివరకు కూల్చింది ఖాళీగా ఉన్న అక్రమ నిర్మాణాలు మాత్రమే అన్నారు. మల్లారెడ్డి కాలేజీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఒవైసీ కాలేజీలు బఫర్ జోన్ లో ఉన్నాయని మాకు ఫిర్యాదులు వచ్చాయి. అయితే విద్యార్థులు అకడమిక్ సంవత్సరం నష్టపోతారని ఆలోచిస్తున్నాం అన్నారు. హైడ్రా పేదల పట్ల ఒకలాగ, బడా వ్యక్తుల పట్ల మరోలా వ్యవహరించదని స్పష్టం చేశారు. అయితే అక్రమంగా నిర్మించిన పెద్ద వాళ్లే మా టార్గెట్. హైడ్రా సైలెంట్ గా ఏమి లేదు. అందుకోసం బ్యాక్ గ్రౌండ్ లో అన్ని వివరాలు పరిశీలిస్తున్నాం. న్యాయపరమైన సమస్యల గురించి ఓ అవగాహనకు వచ్చాక కూల్చివేతలు కన్ఫామ్ అని స్పష్టం చేశారు.

నటుడు నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ కూల్చివేసిన సమయంలో ఆ పక్కన ఉన్నటువంటి గుడిసెలను మేం తొలగించలేదు. హైడ్రా వచ్చినప్పుడు కొందరు కిరోసిన్, పెట్రోల్ పోసుకుని ఆందోళన చేస్తున్నారు. కూకట్ పల్లి చెరువు దగ్గర ఉన్నవారికి ముందుగానే హైడ్రా సమాచారం ఇచ్చింది. కానీ కొందరు సిరియస్ తీసుకోలేదు. వారిని ఖాళీ చేపించిన తరువాతే కూల్చివేతలు మొదలుపెట్టాం. హైడ్రాను బూచిగా చూపించి బుచ్చమ్మను భయబ్రాంతులకు గురి చేశారు. మీకు చెప్పేది ఒక్కటే. హైడ్రా అంటే భరోసా. కొందరు హైడ్రాను చూపించి సామాన్యులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. - హైడ్రా కమిషనర్ రంగనాథ్

Also Read: HYDRA Demolitions: ఆ విల్లాలకు ఎలాంటి పర్మిషన్ లేదు, అయినా భారీ నిర్మాణాలు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget