Hyderabad Gang Rape: హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్.. యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఆటోడ్రైవర్లు..
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. 20 ఏళ్ల యువతిని ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు.
భాగ్యనగరంలో గ్యాంగ్ రేప్ కలకలం సృష్టించింది. పట్టపగలే యువతిని కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్లు, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన పహాడి షరీఫ్ ప్రాంతంలో జరిగింది. 20 ఏళ్ల యువతిని ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. సంతోష్ నగర్‌లో ఆటోలో కిడ్నాప్ చేసి పహాడీ షరీఫ్‌లో అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. బాధితురాలు సంతోష్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
Also Read: Hero Surya IT Shock : వడ్డీతో సహా పన్ను కట్టాల్సిందే..సూర్యకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు !
CBI Caged Parrot : సీబీఐని రాజకీయ పంజరం నుంచి వదిలి పెట్టాలన్న మద్రాస్ హైకోర్ట్..!
యువతి.. ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తోంది. సంతోష్ నగర్‌లో ఆటో ఎక్కింది. రోజు వెళ్లే దారేగా అని అనుకుంది. కానీ పహాడీ షరీఫ్ తీసుకువెళ్లిన తరువాత సీన్ మారింది. డ్రైవర్ మరో యువకుడిని ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆటో వెళ్తుండగా.. ఆ యువకుడు యువతిని అరవకుండా నోరు మూశాడు. ఆటో డ్రైవర్ ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఈ ఘటనతో యువతి షాక్ కు గురైంది. అక్కడ ఇద్దరూ కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి చేశారు. ఆ తర్వాత యువతిని అక్కడే వదిలేసి పరారయ్యారు.
Also Read: Gandhi Hospital Case: మిస్టరీగా గాంధీ హాస్పిటల్ గ్యాంగ్ రేప్ వ్యవహారం.. కేసులో మరో ట్విస్ట్
Medak: చికెన్ కర్రీతో అన్నం తిని పడుకున్న చిన్నారులు.. పొద్దునే లేచి చూస్తే షాక్! తీవ్ర విషాదం..
యువతి నేరుగా సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఆటో డ్రైవర్లు చేసిన అఘాయిత్యాన్ని పోలీసులు తెలిపి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేస్తున్నారు. బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించి.. వివరాలు సేకరిస్తున్నారు. యువతి ఆటో ఎక్కినప్పటి నుంచి.. ఎక్కడెక్కడ సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయో వాటిని పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
Suryapet Crime News: యువతిపై చిన్నాన్న అత్యాచారం... సోదరుడు కూడా లైంగిక వేధింపులు... తట్టుకోలేక ఆత్మహత్య