Gandhi Hospital Case: మిస్టరీగా గాంధీ హాస్పిటల్ గ్యాంగ్ రేప్ వ్యవహారం.. కేసులో మరో ట్విస్ట్
కిడ్నీల సమస్యతో బాధపడుతున్న తన భర్తను, తన చెల్లిని వెంటబెట్టుకొని ఓ మహిళ గాంధీ ఆసుపత్రికి వచ్చింది. అక్కడ ఈ అక్కా చెల్లెళ్లపై ఐదుగురు వ్యక్తులు సాముహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు పేర్కొంది.
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లుగా భావిస్తున్న ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఇంకా మిస్టరీగానే ఉంది. మరోవైపు, గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న మరో సెక్యూరిటీ గార్డు రాము అనే వ్యక్తి అదృశ్యం కావడం కూడా అనుమానాలకు తావిస్తోంది. సెక్యూరిటీ గార్డు రాము ఈనెల 14 నుంచి కనిపించడం లేదని గాంధీ ఆస్పత్రిలోని పర్యవేక్షకులు చెబుతున్నారు. రాము కనిపించకుండా పోవడంతో ఆ సామూహిక అత్యాచార ఘటనలో సెక్యూరిటీ గార్డు రాము పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇంకోవైపు, బాధిత మహిళల్లో ఒకరి ఆచూకీ ఇంకా దొరకలేదు.
Also Read: Tamilisai Mother Passed Away: గవర్నర్ తమిళిసైకి మాతృవియోగం.. సీఎం కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం
ఇప్పటివరకూ ఈ కేసులో అనుమానితులుగా అరెస్టు చేసిన నిందితులు ఉమామహేశ్వర్, సెక్యూరిటీ గార్డును పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. అయినా, ఈ కేసులో ఫిర్యాదు దారుగా ఉన్న బాధితురాలు చెప్పిన దాని ప్రకారం గాంధీ ఆసుపత్రి నుంచి అక్కా చెల్లెళ్లు ఈ నెల 8న మిస్ అయ్యారు. ఆ తర్వాతే వీరిపై సామూహిక అత్యాచారం జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించిన ప్రత్యేక టీమ్.. గాంధీ ఆసుపత్రి, ఆ చుట్టు పక్కల ప్రాంతాలు, రోడ్లపై ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన వీడియోలను క్షుణ్నంగా పరిశీలించింది. ఇలా వాటి ఆధారంగా ఇప్పటి వరకూ ఆచూకీ లేని మహిళ ఈ నెల 11న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒంటరిగా గాంధీ ఆసుపత్రి నుంచి బయటికి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాక, మరికొందరు ప్రత్యక్ష సాక్షుల్ని కూడా పోలీసులు విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో బాధితురాలు కూడా 14వ తేదీన గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్నట్లు గుర్తించారు.
Also Read: MP Bandi Sanjay: కామన్ మ్యాన్ లా గుడారాల్లో బండి సంజయ్.. కనీసం టీవీ కూడా లేదట
కేసు వివరాలేంటంటే..
మహబూబ్‌నగర్ జిల్లాకి చెందిన ఓ మహిళ కిడ్నీల సమస్యతో బాధపడుతున్న తన భర్త నర్సింహులును, తన చెల్లిని వెంటబెట్టుకొని కొద్ది రోజుల క్రితం గాంధీ ఆసుపత్రికి వచ్చింది. అక్కడ ఈ అక్కా చెల్లె్ళ్లపై ఐదుగురు వ్యక్తులు సాముహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సింహులును ఈ నెల 4న గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. గాంధీ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన ఉమామహేశ్వర్ అనే వ్యక్తిది కూడా నర్సింహులు సొంత ఊరే. అయితే, అతను ఉన్నాడన్న భరోసాతో నర్సింహులు కుటుంబంతో ట్రీట్‌మెంట్ కోసం వచ్చాడు. ఈ నెల 11వ తేదీన అతనికి కిడ్నీ సంబంధిత చికిత్స నిర్వహించారు. చివరికి అతను డిశ్చార్జ్ అయ్యే సమయానికి తన భార్య, చెల్లెలు కనిపించకుండా పోయారు.
ఇలా హైదరాబాద్‌లో మిస్ అయిన అక్కాచెల్లెళ్లలో నర్సింహులు మరదలు.. మహబూబ్‌నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ప్రత్యక్షమైంది. ఆమెను పోలీసులు ప్రశ్నించగా.. తన అక్కను, తనను కిడ్నాప్ చేశారని, కొందరు లైంగికంగా వేధించారని, రేప్ చేశారని ఆమె చెప్పుకొచ్చింది. తాను మాత్రం వాళ్ల కళ్లుగప్పి ఏదోలా తప్పించుకున్నానని వివరించింది. తప్పిపోయిన ఆమె అక్క ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు. బాధితురాలి ఫిర్యాదుతో మహబూబ్ నగర్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దాన్ని హైదరాబాద్‌లోని చిలకలగూడ పీఎస్‌కు మార్చారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించగా, ఉమామహేశ్వర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఇతనితోపాటు మిగతా నలుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకూ అక్కాచెల్లెళ్లు ఎక్కడెక్కడ తిరిగారన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐదు రోజులుగా ఉమామహేశ్వర్ డ్యూటీకి సరిగ్గా హాజరు కాలేదని, వచ్చినా రెండు, మూడుగంటలు పనిచేసి తొందర తొందరగా వెళ్లిపోతున్నా