Tamilisai Mother Passed Away: గవర్నర్ తమిళిసైకి మాతృవియోగం.. సీఎం కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్య సమస్యతో కొద్ది రోజులుగా గవర్నర్ తల్లి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం ఆమె చనిపోయారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మాతృ వియోగం కలిగింది. ఆమె తల్లి కృష్ణ కుమారి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 77 ఏళ్లు. ఇటీవల కృష్ణ కుమారి అస్వస్థతకు గురి కాగా.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కొద్ది రోజులుగా ఆమె అక్కడే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం ఆమె చనిపోయారు. దీంతో గవర్నర్ తమిళిసై కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. కృష్ణ కుమారి భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి రాజ్ భన్కు తరలించనున్నారు. అక్కడ కాసేపు ఉంచి హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలించనున్నారు. చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాజీ ఎంపీ కుమారి నందన్ భార్య అయిన కృష్ణకుమారి పెద్ద కుమార్తె గవర్నర్ తమిళిసై.
కేసీఆర్ సంతాపం
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తల్లి కృష్ణ కుమారి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు గవర్నర్ తల్లి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తల్లి మరణంతో శోక సముద్రంలో ఉన్న గవర్నర్ కుటుంబానికి హరీశ్ రావు సానుభూతి వ్యక్తం చేశారు. కృష్ణ కుమారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి శ్రీమతి కృష్ణ కుమారి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) August 18, 2021
ఏపీ గవర్నర్ సంతాపం
తమిళిసై సౌందరరాజన్ తల్లి కృష్ణ కుమారి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని ఏపీ గవర్నర్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
I express my grief and sadness over the passing away of Smt. Krishna Kumari, mother of @TelanganaGuv @DrTamilisaiGuv.
— Biswa Bhusan Harichandan (@BiswabhusanHC) August 18, 2021
I pray for the rest to her soul & offer my heartfelt condolences to bereaved family members.
బండి సంజయ్ ప్రగాఢ సానుభూతి
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తల్లి కృష్ణ కుమారి మరణం పట్ల బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. గవర్నర్ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు. కృష్ణకుమారి ఆత్మకు శాంతి చేకూరాలని బండి సంజయ్ ప్రార్థించారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ గారి మాతృమూర్తి శ్రీమతి కృష్ణ కుమారి గారు అనారోగ్యంతో మృతి చెందడం పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. గవర్నర్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.@DrTamilisaiGuv pic.twitter.com/ixyYBMXFoU
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 18, 2021
Also Read: MP Bandi Sanjay: కామన్ మ్యాన్ లా గుడారాల్లో బండి సంజయ్.. కనీసం టీవీ కూడా లేదట