Mancherial: అఫ్గానిస్థాన్‌లో తెలుగువాళ్లు.. చిక్కుకుపోయిన మంచిర్యాల వాసి, ప్రభుత్వాన్ని వేడుకుంటున్న ఫ్యామిలీ
అఫ్గానిస్థాన్‌లో తెలంగాణ వాసులు ఇద్దరు చిక్కుకుపోయారు. వీరితో పాటు మరో 14 మంది భారతీయులు కూడా ఉన్నారని కాబుల్‌లో చిక్కున్న మంచిర్యాలకు చెందిన ఓ వ్యక్తి ఫోన్‌లో చెప్పారు.
అఫ్గానిస్థాన్ తాలిబన్ల వశం కావడంతో అక్కడ జనం భయాందోళనల మధ్య బతుకున్నారు. అక్కడ ఉంటున్న విదేశీయులకు మరింత భయం పట్టుకుంది. ఎలాగైనా స్వదేశానికి వెళ్లిపోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దేశం దాటడానికి ఉన్న ఏకైక మార్గం అక్కడ కాబుల్ ఎయిర్ పోర్టు కావడంతో అందరూ అక్కడికే పరుగులు తీస్తున్నారు. ఎవరికి వారు ఎర్రబస్సు ఎక్కిన చందంగా విమానాలు పరిగెత్తుతూ ఎక్కుతున్న వీడియోలు అక్కడి పరిస్థితిని చాటుతున్నాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో తెలంగాణకు చెందిన వ్యక్తులు కూడా అఫ్గానిస్థాన్‌లో చిక్కుకుపోవడం ఆ కుటుంబాల వారిని ఆందోళనకు గురి చేస్తోంది.
విమాన టికెట్లు ఖరారై, కొద్ది రోజుల్లోనే ఇంటికి వస్తాడనుకున్న తమ వ్యక్తి అఫ్గానిస్థాన్‌లోని పరిస్థితుల వల్ల అక్కడే చిక్కుకుపోవటంతో తెలంగాణలో ఓ కుటుంబం భయాందోళనలకు గురవుతోంది. ఎలాగైనా ఆయన్ను క్షేమంగా ఇంటికి రప్పించాలని కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన బొమ్మెన రాజన్న అనే వ్యక్తి ఎనిమిదేళ్ల నుంచి అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో ఏసీసీఎల్ అనే అఫ్గానీ సంస్థలో పనిచేస్తున్నారు. తరచూ సెలవులు పెట్టుకొని ఇంటికి వస్తుంటారు. గత జూన్ 28న చివరిసారి అక్కడి నుంచి వచ్చారు. మళ్లీ ఈ నెల 7న అక్కడకు వెళ్లారు. తమ ఇంటిపెద్ద అఫ్గానిస్థాన్‌లో ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్నట్లు తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. రాజన్నను సురక్షితంగా తమ దగ్గరికి చేర్చాలని ఆయన భార్య వసంత, కుమార్తె రమ్య ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Also Read: Petrol-Diesel Price, 18 August: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వివిధ ప్రాంతాల్లో తాజా ధరలివీ..
ఈలోగా కాబుల్ సహా దేశమంతా తాలిబాన్ల వశమైన వేళ అక్కడి నుంచి వచ్చేసేందుకు దారులన్నీ మూసుకుపోయాయని ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్‌లో తెలిపారు. ప్రస్తుతం తనతో పాటు కరీంనగర్ జిల్లా ఒడ్డారానికి చెందిన వెంకన్న అనే వ్యక్తి కూడా విధుల్లోనే ఉన్నారని, ఈ నెల 18న భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నించినా విమానాలు అందుబాటులో లేవని మంగళవారం రాత్రి రాజన్న ఫోన్‌లో తెలిపారు. తనని సురక్షితంగా భారత్‌కు తరలించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. తమతో మొత్తం 14 మంది భారతీయులు కూడా ఉన్నట్లు చెప్పారు.
Also Read: Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర.. స్వల్పంగా పెరిగిన వెండి.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలివే..
కేబినెట్ భేటీ
మరోవైపు, అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న వేళ అక్కడ ఉన్న భారత దౌత్యవేత్తలను, అధికారులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి రప్పించింది. మొత్తం 150 మందిని మిలిటరీ విమానంలో ఢిల్లీకి చేర్చింది. సోమవారం 40 మంది సిబ్బంది భారత్‌కు రాగా.. మంగళవారం మరికొంత మందిని తరలించారు. దీంతో కాబూల్ ఎంబసీ నుంచి సిబ్బంది తరలింపు ప్రక్రియ పూర్తయినట్టు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇక కాబూల్‌లో ఉంటున్న భారతీయుల వివరాలను సేకరించే పనిలో ప్రభుత్వ ఉంది. దీనిపై ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. ఇందలో అఫ్గాన్ పరిస్థితులు, అక్కడ చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించే ప్రయత్నాలపై చర్చించనున్నారు.
Also Read: Medak: చికెన్ కర్రీతో అన్నం తిని పడుకున్న చిన్నారులు.. పొద్దునే లేచి చూస్తే షాక్! తీవ్ర విషాదం..
Also Read: Minister KTR: 'నాన్న నన్ను ఐఏఎస్ చేయాలనుకున్నారు'.. 'ఆ పని చేసే వరకూ కేసీఆర్ వదిలిపెట్టరు'