Minister KTR: 'నాన్న నన్ను ఐఏఎస్ చేయాలనుకున్నారు'.. 'ఆ పని చేసే వరకూ కేసీఆర్ వదిలిపెట్టరు'
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఏడేళ్లలో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కరెంట్ సమస్యలను అధిగమించామని, శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.
![Minister KTR: 'నాన్న నన్ను ఐఏఎస్ చేయాలనుకున్నారు'.. 'ఆ పని చేసే వరకూ కేసీఆర్ వదిలిపెట్టరు' Minister KTR On Dalita Bandhu And Other Schemes Minister KTR: 'నాన్న నన్ను ఐఏఎస్ చేయాలనుకున్నారు'.. 'ఆ పని చేసే వరకూ కేసీఆర్ వదిలిపెట్టరు'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/17/d0dd1798747ee9fc173378f74e0cc6b9_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రైతు బంధు వచ్చాక రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేటీఆర్ అన్నారు. దళిత బంధుతో ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు. ఇప్పటివరకు 1.39 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కదురదని చెప్పారు. ‘నాన్న నన్ను ఐఏఎస్ చేయాలనుకున్నారు. తెలియకుండానే నేను రాజకీయాల్లోకి వచ్చా..’ అని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.
Also Read: Owaisi Advice : తాలిబన్లతో చర్చలు జరపాలని కేంద్రానికి ఒవైసీ సలహా..!
సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెర్వు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో జరుగుతున్న ’కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ’ ఓరియంటేషన్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన సమయంలో చాలా అనుమానాలుండేవని చెప్పారు. రాష్ట్రం వచ్చిన ఏడేళ్లకాలంలో కేసీఆర్ నాయకత్వంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. తెలంగాణలో 17శాతం దళితులు ఉన్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రంలో దళితులు వివక్షకు గురవుతున్నారని, వారి జీవితాల్లో మార్పు రాలేదన్నారు. దళితబంధుతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు. పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
దశలవారీగా దళితులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడం లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. దళిత కుటుంబాలకు లాభం చేకూర్చే వరకు సీఎం కేసీఆర్ వదలన్నారు. రాజకీయ నాయకత్వం సరిగా పని చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణ ఏర్పడితే కరెంట్ ఉండదని అన్నారని.. సీఎం కేసీఆర్ ఆరు నెలల్లో కరెంటు సమస్యను పరిష్కరించారని అన్నారు.
రైతుబంధు పథకం అమలు చేసిన సమయంలో అనుమానాలు వ్యక్తం చేశారని, ఇప్పుడు 11 రాష్టాల్రు పథకం పేరు మార్చి అమలు చేస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. గతంలో వ్యవసాయం వర్షాలు, బోర్లమీద ఆధారపడి ఉండేదని.. ప్రపంచంలోనే అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంతో నీరు అందుతుందన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీలో కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించాను. ప్రస్తుతం మంత్రి స్థాయికి ఎదిగా. మా నాన్న నన్ను ఐఏఎస్ చేయాలనుకున్నారు. కేసీఆర్ నాయకత్వంలో కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని.. పార్టీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి నేడు మంత్రిగా పని చేస్తున్నాను.
- కేటీఆర్, తెలంగాణ మంత్రి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)