అన్వేషించండి

KTR On BJP Application Movement: బీజేపీ అప్లికేషన్ల ఉద్యమంపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు.. ఖాతాల్లోకి రూ.15 లక్షలు ధనాధన్!

బీజేపీ దరఖాస్తుల ఉద్యమంపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. మీ వివరాలు బీజేపీకి ఇస్తే దరఖాస్తుదారుల ఖాతాల్లో రూ.15 లక్షలు ధనాధన్ అని సెటైర్ వేశారు.

తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చాయంటే చాలు అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ నేతలకు.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు కొనసాగుతున్నాయి. దళిత బంధు పథకాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన రోజు నుంచి విపక్షాలు ఈ పథకంపై తమదైన రీతిలో విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసిన ట్వీట్, బీజేపీ విధానాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో వంగ్యాస్త్రాన్ని సంధించారు.

తెలంగాణ బీజేపీ నేతలు మొదలుపెట్టిన ప్రభుత్వ పథకాలకు అర్హుల దరఖాస్తు ఉద్యమాన్ని మంత్రి కేటీఆర్ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. బీజేపీ తలపెట్టిన దరఖాస్తుల ఉద్యమాన్ని స్వాగతిస్తున్నాను అంటూనే చురకలు అంటించారు. ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన రూ.15 లక్షల కోసం రాష్ట్ర ప్రజలు బీజేపీ నేతలకు తమ దరఖాస్తులు పంపాలని పిలుపునిచ్చారు. దాంతో మీ జన్‌ధన్ ఖాతాల్లో ధనాధన్ డబ్బులు వెంటనే పడిపోతాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 
Also Read: రూ. 10 లక్షలు ఇస్తున్నాం.. రాబోయే ఏడాదిలో రూ. 20 లక్షలు చేసి చూపించాలే.. దళిత బంధు సభలో కేసీఆర్

అంతకుముందు ఏం జరిగిందంటే...
తెలంగాణ ప్రభుత్వం దళితబంధు చెక్కులను హుజూరాబాద్ నియోజకవర్గంలో  పంపిణీ చేసింది. తద్వారా దళితబంధు పథకాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి తాము దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఆ దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వానికి పంపేందుకుగానూ దరఖాస్తుల ఉద్యమాన్ని ప్రారంభించామని బండి సంజయ్ పేర్కొన్నారు.
Also Read: Bandi Sanjay: దళిత బంధు ప్రారంభించడం కంటే ముందు బండి సంజయ్ ప్రెస్ మీట్.. ఏం అడిగారో తెలుసా?

తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ నేతలు ఇచ్చిన హామీలు అమలయ్యేలా చేయాలంటే వారిపై ఒత్తిడి తీసుకురావడమే మార్గమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ‘బీజేపీ దరఖాస్తుల ఉద్యమం’ చేపట్టిందని.. ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారులంతా దరఖాస్తు చేసుకోవాలని సీఎం కేసీఆర్ దళిత బంధు చెక్కుల పంపిణీకి కొంత సమయం ముందు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ‘బీసీ బంధు’, ‘గిరిజన బంధు’ పథకాల ద్వారా ఆ కటుంబాలకు సైతం రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Also Read: US Plane Inside Pics: ఆ విమానంలో 640 మంది తరలింపు... వైరల్ పిక్ పై క్లారిటీ ఇచ్చిన యూఎస్ రక్షణ అధికారులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget