US Plane Inside Pics: ఆ విమానంలో 640 మంది తరలింపు... వైరల్ పిక్ పై క్లారిటీ ఇచ్చిన యూఎస్ రక్షణ అధికారులు
సీ-17 సైనిక విమానం ద్వారా 640 మంది అఫ్గాన్లను ఖతర్ కు తరలించామని అమెరికా రక్షణ అధికారులు తెలిపారు. 800 మందిని తరలించినట్లు ఓ సైనిక అధికారి ఆడియో వైరల్ అవ్వడంతో యూఎస్ రక్షణ అధికారులు వివరణ ఇచ్చారు.
యూఎస్ ఎయిర్ ఫోర్స్ సి -17 గ్లోబ్‌మాస్టర్ III సైనిక విమానం ద్వారా ఆదివారం 640 మంది అఫ్గాన్లలను కాబుల్ నుండి ఖతర్ కు సురక్షితంగా తరలించినట్లు అమెరికా రక్షణ అధికారులు తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాలుగా యూఎస్, దాని మిత్ర దేశాలకు కార్గో సేవలు అందిస్తున్న సి-17లో అత్యంత ఎక్కువ మందిని తరలించాలని అధికారులు తెలిపారు. ఈ విమానం పూర్తి సామర్థ్యం 871 అని స్పష్టం చేశారు.
Also Read: Imran Khan Endorses Taliban: పాక్ ప్రధాని రూటే సెపరేటు.. బానిస సంకెళ్లు తెంచేశారట!
విమానాలు కిక్కిరిసిపోయాయి
అఫ్గనిస్థాన్ తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత దేశంలో పరిస్థితులు దిగజారాయి. తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు వేల మంది దేశం విడిచి వెళ్లేందుకు విమానాశ్రయాల వైపు పరుగులు తీశారు. విమానాలు రెక్కలపై వేలాడుతూ ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలు హృదయాల్ని కలిచివేశాయి. కాబుల్ విమానాశ్రయంలో సోమవారం పరిస్థితులు దయనీయంగా మారాయి. విమానాల్లో కిక్కిరిసిపోయి ప్రయాణిస్తున్న దృశ్యాలు కనిపించాయి.
Also Read: Kabul Airport: కాబుల్ ఎయిర్ పోర్టులో కిక్కిరిసిన ప్రయాణికులు... ఎయిర్ పోర్టులో తొక్కిసలాట
800 మందిని తరలించినట్లు వైరల్
'సీ-17 విమానం పూర్తిగా నిండిపోయింది. ఇంకా కొంత మంది విమానం ఎక్కేందుకు హాఫ్-ఓపెన్ ర్యాంపు లాగారు. చివరకి అందర్ని తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. శరణార్థులందర్నీ విమానంలో ఎక్కించుకున్నాం' అని రక్షణ అధికారి తెలిపారు. ఈ విమానంలో 800 మందిని తరలించినట్లు మొదటి వార్తలు వచ్చాయి. విమానంలో కిక్కిరిసిన జనంతో ఉన్న పిక్ వైరల్ అయ్యింది. ముందు 800 మందిని తీసుకెళ్తున్నట్లు మొదట అంచనా వేసిన...640 మంది మాత్రమే తరలించామని యూఎస్ రక్షణ అధికారులు వివరణ ఇచ్చారు.
గతంలో 670 మంది తరలింపు
విమానంలో వందలాది మందితో ప్రయాణిస్తున్న ఫొటో వైరల్ గా మారింది. గతంలో ఇలాంటి భారీ తరలింపు చోటుచేసుకుంది. 2013లో ఫిలిప్పీన్స్‌లో తుపాను బాధితుల్ని రక్షించి క్రమంలో సీ-17 విమానం ద్వారా 670 మందిని తరలించారు. ఇదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ కాబుల్ నుంచి ఖతార్‌లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్‌కు ఈ విమానం ప్రయాణించింది.
Also Read: Joe Biden On Afghan: బలగాల ఉపసంహరణపై బాధ్యత నాదే.. అనుకున్నదానికంటే ఎక్కువగా అఫ్గాన్ పతనం: జో బైడెన్