Joe Biden On Afghan: బలగాల ఉపసంహరణపై బాధ్యత నాదే.. అనుకున్నదానికంటే ఎక్కువగా అఫ్గాన్ పతనం: జో బైడెన్
అఫ్గాన్ లో పరిస్థితులు చాలా బాధకరంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత.. ఆ దేశ పరిస్థితులపై బైడెన్ మాట్లాడారు.
అఫ్గానిస్తాన్ లో అమెరికా బలగాల ఉపసంహరణ నిర్ణయానికి పూర్తి బాధ్యత తనదేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. కానీ అఫ్గాన్ పతనం అనుకున్నదానికంటే ఎక్కువగా ఉందన్నారు. ఆ దేశంలో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే బాధకరంగా ఉందని వ్యాఖ్యానించారు. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత జో బైడెన్ ఆ దేశ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. బలగాల ఉపసంహరణకు ఎలాంటి సమస్యలు చేయోద్దని.. తాలిబన్లను హెచ్చరించారు. అవసరమైతే మళ్లీ బలగాలను రంగంలోకి దించుతామని చెప్పారు.
అఫ్టాన్ నుంచి బలగాల ఉపసంహరణ నిర్ణయం సరైందనేనని పేర్కొన్నారు. అయితే అఫ్గాన్ నుంచి అమెరికా సేనలను స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి తగిన సమయం అంటూ ఏదీ లేదని జో బైడెన్ వ్యాఖ్యానించారు. అమెరికా ముందు ప్రస్తుతం రెండు మార్గాలు ఉన్నాయని చెప్పారు. అమెరికా సైనిక బలగాలను అఫ్గాన్ నుంచి పూర్తిగా వెనక్కి రప్పించడం ఒక మార్గమని... సాధ్యమైనంత సైన్యాన్ని అఫ్గాన్‌కు పంపించి పరిస్థితులు చక్కదిద్దేందుకు వరుసగా మూడో దశాబ్దంలో సైతం తాలిబన్లు, ఉగ్రవాద శక్తులతో పోరాటం కొనసాగించడం రెండో మార్గమని అమెరికా అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. అయితే తాము ఊహించిన దానికంటే చాలా రెట్లు వేగంగా తాలిబన్లు ఆ దేశ ప్రభుత్వాన్ని కూలద్రోసి అఫ్గానిస్థాన్‌ను తమ హస్తగతం చేసుకున్నారని చెప్పారు.
Also Read: Afghanistan Taliban Crisis: అఫ్గానిస్థాన్ ను అంత ఈజీగా తాలిబన్లు ఎలా చేతిలోకి తెచ్చుకున్నారు? అసలు తాలిబన్ అంటే ఏంటి?