News
News
X

Penna Case: మంత్రి సబితాకు సీబీఐ షాక్.. కీలక ఆధారాలున్నాయని కౌంటర్ దాఖలు.. కేసు కొట్టేయాలని మంత్రి పిటిషన్

జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. పెన్నా గ్రూపు గనుల లీజుపై మంత్రి కీలకంగా వ్యవహరించారని కోర్టుకు తెలిపింది.

FOLLOW US: 
 
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ షాక్ ఇచ్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో భాగంగా పెన్నా సిమెంట్స్‌కు గనుల లీజు కేటాయింపుల్లో మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించారని సీబీఐ సోమవారం కోర్టులో కౌంటరు దాఖలు చేసింది. తాండూరుకు చెందిన గనుల లీజు పునరుద్ధరణ వ్యవహారంలో సబితా ఇంద్రారెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ కోర్టుకు తెలిపింది. అభియోగాల నమోదు దశలో ఉన్నప్పుడు నిందితులను డిశ్ఛార్జి చేయవద్దని తెలిపింది. పెన్నా కేసులో పెన్నా గ్రూపు అధినేత ప్రతాప్‌రెడ్డి డిశ్ఛార్జి పిటిషన్‌పై సోమవారం సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు విన్న కోర్టు పిటిషన్‌లపై తదుపరి విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది. 

Also Read: Banjara Hills: ఇంట్లో నుంచి వెళ్లిపో.. లేదంటే రేప్ చేయిస్తా..! కూతురుకి కన్న తండ్రి బెదిరింపులు..

మంత్రి పాత్రపై కీలక ఆధారాలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో మంత్రిగా చేసిన సబితా ఇంద్రారెడ్డి పెన్నా సిమెంట్స్‌కు గనుల కేటాయింపుల్లో కీలక పాత్ర పోషించారనడానికి తమ వద్ద కీలక ఆధారాలు ఉన్నాయని సీబీఐ కోర్టుకు తెలిపింది. లేపాక్షికి అనంతపురంలో భూముల కేటాయింపు కేసులో డిశ్ఛార్జి పిటిషన్‌లు దాఖలు చేయడానికి వారి తరఫు న్యాయవాది గడువు కోరారు. గడువుకు అనుమతించిన కోర్టు ఆ విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. ఈలోగా పిటిషన్‌లు దాఖలు చేయాలని తెలిపింది. పిటిషన్లు దాఖలు చేయని పక్షంలో వాదనలకు సిద్ధం కావాలని సీబీఐ కోర్టు సోమవారం ఆదేశించింది. 

News Reels

Also Read: KCR Starts Dalitha Bandhu: రూ. 10 లక్షలు ఇస్తున్నాం.. రాబోయే ఏడాదిలో రూ. 20 లక్షలు చేసి చూపించాలే.. దళిత బంధు సభలో కేసీఆర్

ఆ కేసు కొట్టేయండి

ఓబుళాపురం అక్రమ మైనింగ్‌కు సంబంధించిన కేసులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. నిబంధనల ప్రకారమే ఓఎంసీకి లీజు మంజూరు చేసినట్లు ఆమె కోర్టుకు చెప్పారు. ఇందులో తనపై అసత్య ఆరోపణలు చేశారన్నారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ కొనసాగనుంది. 

Also Read: ED Chargesheets On Jagan : జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈడీ మరో 2 చార్జిషీట్లు..!

Also Read: Taliban: తాలిబన్లు అంత రిచ్ ఆ! ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

Published at : 17 Aug 2021 10:37 AM (IST) Tags: cbi AP News TS News CBI Court Sabita Indra reddy Jagan case Penna cements case

సంబంధిత కథనాలు

Hyderabad News: ఫ్రీలాంచ్ ఆఫర్ల పేరుతో సాహితీ ఇన్ ఫ్రా మోసాలు - వెయ్యి కోట్లు దొచేయడంతో ఈడీ కన్ను

Hyderabad News: ఫ్రీలాంచ్ ఆఫర్ల పేరుతో సాహితీ ఇన్ ఫ్రా మోసాలు - వెయ్యి కోట్లు దొచేయడంతో ఈడీ కన్ను

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో ట్విస్ట్- ఆరో తేదీన విచారణకు హాజరుకాలేనని కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో ట్విస్ట్- ఆరో తేదీన విచారణకు హాజరుకాలేనని కవిత లేఖ

స్వచ్ఛ సర్వేక్షన్‌లో దూసుకెళ్తున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా - జాతీయస్థాయిలో సిరిసిల్లకి అగ్రస్థానం

స్వచ్ఛ సర్వేక్షన్‌లో దూసుకెళ్తున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా - జాతీయస్థాయిలో సిరిసిల్లకి అగ్రస్థానం

TS News Developments Today: తెలంగాణలో టాప్‌ న్యూస్ డెవలప్‌మెంట్‌ న్యూస్‌ ఇదే!

TS News Developments Today: తెలంగాణలో టాప్‌ న్యూస్ డెవలప్‌మెంట్‌ న్యూస్‌ ఇదే!

వార్డెన్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి- పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన

వార్డెన్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి- పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన

టాప్ స్టోరీస్

Gujarat Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన ప్రధాని మోదీ

Gujarat Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన ప్రధాని మోదీ

Bapatla Road Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు అయ్యప్ప భక్తులు మృతి, 15 మందికి గాయాలు

Bapatla Road Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు అయ్యప్ప భక్తులు మృతి, 15 మందికి గాయాలు

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

పుంగనూరులో జనసేన నేత ఇంటిపై అర్థరాత్రి దాడి - తాగుబోతులంటున్న పోలీసులు

పుంగనూరులో జనసేన నేత ఇంటిపై అర్థరాత్రి దాడి - తాగుబోతులంటున్న పోలీసులు