By: ABP Desam | Updated at : 16 Aug 2021 11:40 AM (IST)
కన్న కూతురికి తండ్రి బెదిరింపులు (ప్రతీకాత్మక చిత్రం)
కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వారే కాల యముడి తరహాలో ప్రవర్తిస్తున్నారు. పిల్లలను చిత్ర హింసలకు గురి చేయడం లేదా కామంతో లైంగిక దాడి చేసిన ఘటనలు, కేసులు గతంలో ఎన్నో వెలుగు చూశాయి. చివరికి కనీస మానవత్వం లేకుండా కామంతో కళ్లు మూసుకుపోయిన ఇద్దరు వ్యక్తులు పశువులపై కూడా అత్యాచారానికి పాల్పడ్డ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉండగా తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో మరో వ్యవహారం తెరపైకి వచ్చింది.
ఓ తండ్రి తన కన్న కూతురిపైనే బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమెను రేప్ చేయిస్తానంటూ హెచ్చరించడంతో గతి లేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ యువతి తన తండ్రిపైనే ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబరు 10లో ఓ యువతి తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. అయితే, ఇల్లు వదిలి ఎటైనా వెళ్లిపోవాలంటూ ఆమె తండ్రి యువతిపై కొంత కాలంగా ఒత్తిడి చేస్తున్నాడు. లేదంటే అత్యాచారం చేయిస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఇంటికి వచ్చిన తండ్రి.. తన భార్య, కుమార్తెతో గొడవకు దిగాడు.
Also Read: Dalit Bandhu Scheme: దళిత బంధుపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. కౌంటర్ ఇవ్వబోయి అంతమాట అనేశారే..!
తన తల్లి పేరుతో హైదరాబాద్‌లోనే కొంత ఆస్తి ఉండగా దానికి సంబంధించి నెల నెలా అద్దె వస్తుంటుంది. అయితే, ఆ అద్దెను కూడా తన తండ్రే వసూలు చేసుకొని వినియోగించుకుంటున్నాడు. తమ డబ్బులు వాడుకుంటూ తమపై దాడికి దిగుతున్నాడని, ఇదేంటని ప్రశ్నిస్తే అత్యాచారం చేయిస్తానంటూ బెదిరింపులు చేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు. తన తండ్రి ఇలా ప్రవర్తించేందుకు గల కారణాలపై తాము ఆరా తీస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
Also Read: Telangana News: వీళ్లందరికీ కేసీఆర్ శుభవార్త, ఉద్యమంలా తీసుకుపోదామని గోల్కొండ వేదికగా సీఎం వెల్లడి
ఆటోను ఢీకొన్న కారు.. ఒకరి పరిస్థితి విషమం
బంజారాహిల్స్‌లో ఫార్మసీ విద్యార్థులు అడ్డగోలుగా కారు నడపడం ఓ ఆటో డ్రైవరు ప్రాణాల మీదకు తెచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నంబరు 2లో తెల్లవారుజామున 3.30గంటల ప్రాంతంలో కర్మాన్‌ఘట్‌కు చెందిన ఆటోడ్రైవరు ఆంగోతు రాజు(33) ఆటో ఆపి ప్రయాణికుల కోసం చూస్తుండగా.. అదే సమయంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి వేగంగా వెళుతున్న కారు ఆటోను బలంగా ఢీకొంది. ఆటోలో ఉన్న రాజు ఒక్కసారిగా ఎగిరి బయట పడటంతో అతడి తలకు తీవ్రగాయమైంది. దీంతో అతడిని యశోదా ఆసుపత్రికి తరలించారు. 22 నుంచి 24 ఏళ్ల లోపు వయసున్న ఫార్మసీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాత్రివేళ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న రాజు ప్రమాదానికి గురికావడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.
Also Read: In Pics: అడుగడుగునా కేసీఆర్, అంబేడ్కర్ కటౌట్లు.. కానీ, ఈ ఫ్లెక్సీ పొరపాటా లేక.. అసలేం జరిగిందో..!
ASI Attacks Dhaba Staff: మద్యం మత్తులో ఏఎస్ఐ వీరంగం - బిర్యానీ పెట్టలేదని హోటల్ సిబ్బందిపై బూతులు, దాడి
Nellore Pistol: నెల్లూరులో రెండు ప్రాణాలు తీసిన పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టిన పోలీసులు, కీలక విషయాలు
ప్రేమ పేరుతో నమ్మించి, రెండుసార్లు గర్భవతిని చేసి అబార్షన్ - ప్రియుడిని నిలదీస్తే ఏమన్నాడంటే !
Hyderabad news : ప్రియుడితో భార్య రాసలీలలు, రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్న భర్త
Guntur Crime : గుంటూరు జిల్లాలో దారుణం, తొమ్మిదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్పై బెంగళూరు ఘనవిజయం!
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
KTR UK Tour: లండన్లోని కింగ్స్ కాలేజ్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!