అన్వేషించండి

Medak: చికెన్‌ కర్రీతో అన్నం తిని పడుకున్న చిన్నారులు.. పొద్దునే లేచి చూస్తే షాక్! తీవ్ర విషాదం..

రాత్రి కోడి కూరతో అన్నం తిన్నాక ఉదయం లేచి ఆస్పత్రికి వెళ్లేలోపే ఇద్దరు పిల్లలు చనిపోయారు. వారి తల్లి ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

మెదక్ జిల్లాలో ఇద్దరు అక్కా తమ్ముళ్లు చికెన్ కూర తిన్నాక చనిపోవడం కలకలం రేపింది. ఈ ఘటన మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రాత్రి కోడి కూరతో అన్నం తిన్నాక ఉదయం లేచి ఆస్పత్రికి వెళ్లేలోపే ఇద్దరు పిల్లలు చనిపోయారు. వారి తల్లి ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. తూప్రాన్‌ మండలం వెంకటాయపల్లికి చెందిన బుల్లే మల్లేశ్‌, బాలమణి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో కుమార్తె మనీష (13), కుమారుడు కుమార్‌(10). మనోహరాబాద్‌ పట్టణ శివారులో ఉండే కోళ్ల ఫారాల్లో ఈ ఇద్దరు భార్యాభర్తలు పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అక్కడ తరచూ కోళ్లను కోసి ఇంటికి తీసుకొచ్చి వండుకుంటూ ఉండడం వాళ్లకు అలవాటు. ఈ క్రమంలోనే సోమవారం కూడా ఓ కోడిని తెచ్చుకున్నారు.

Also Read: Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర.. స్వల్పంగా పెరిగిన వెండి.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలివే..

రెండు రోజుల క్రితం కోళ్ల ఫారంలో పెరిగిన కోళ్లను కాంట్రాక్టర్ తీసుకెళ్లాడు. అనారోగ్యంతో బాగా లేని కోళ్లను అక్కడే వదిలేశాడు. దీంతో బాలామణి ఆ కోళ్లను ఇంటికి తీసుకొచ్చింది. సోమవారం రాత్రి వాటిని కోసి కూర వండి పిల్లలకు పెట్టింది. అనంతరం తాను కూడా తిన్నది. అదే రోజు ఆమె భర్త మల్లేశ్‌ ఇంట్లో భోజనం చేయలేదు. ఆ రాత్రి భోజనం చేసి అందరూ పడుకున్నారు. మంగళవారం ఉదయం నిద్ర లేచేసరికి ఇద్దరు పిల్లలు మనీష, కుమార్‌లు కడుపులో నొప్పిగా ఉందని ఏడ్చారు. కొద్దిసేపటికే వాంతులు కూడా చేసుకున్నారు. 

Also Read: Case On Punch Prabhakr : ఉపరాష్ట్రపతి, స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పంచ్ ప్రభాకర్‌రెడ్డిపై ఢిల్లీలో కేసులు..!

దీంతో తండ్రి మల్లేశ్‌ వారిని తూప్రాన్‌‌లోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మేడ్చల్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా.. అప్పటికే పరిస్థితి విషమించడంతో వారు చికిత్సకు నిరాకరించారు. దీంతో మళ్లీ తిరిగి తూప్రాన్‌ ప్రభుత్వ ఆసుపత్రికే తీసుకొచ్చారు. అయితే, పిల్లలిద్దరూ అప్పటికే వారు చనిపోయారని అక్కడి డాక్టర్లు ధ్రువీకరించారు. మరోవైపు, ఇంటివద్ద భార్య బాలామణి కూడా అస్వస్థతకు గురైంది. విషయం తెలుసుకున్న భర్త ఆమెను తూప్రాన్‌ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి, అనంతరం కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో వారు తిన్న ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకొని పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపారు. తండ్రి మల్లేశ్‌ను పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Also Read: Minister KTR: 'నాన్న నన్ను ఐఏఎస్ చేయాలనుకున్నారు'.. 'ఆ పని చేసే వరకూ కేసీఆర్ వదిలిపెట్టరు'

Also Read: Weather Updates: ఈ జిల్లాలకు అలర్ట్.. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీలో ఈ ప్రాంతాల్లో కుంభవృష్టి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget