By: ABP Desam | Updated at : 18 Aug 2021 06:59 AM (IST)
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం (ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఇవాళ (ఆగస్టు 18న) కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఈ జిల్లాల్లోనే అతిభారీ వర్షాలు
హైదరాబాద్ వాతావరణ విభాగం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. ఆగస్టు 18న తెలంగాణలో ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగామ, జయశంకర్ భూపాల్ పల్లి, జోగులాంబ గద్వాల, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, వనపర్తి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, నారాయణ పేట జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని అధికారులు తెలిపారు.
Also Read: Minister KTR: 'నాన్న నన్ను ఐఏఎస్ చేయాలనుకున్నారు'.. 'ఆ పని చేసే వరకూ కేసీఆర్ వదిలిపెట్టరు'
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా..
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో రాగల 5 రోజులకు సంబంధించిన వాతావరణ అంచనాలను అమరావతిలోని వాతావరణ కేంద్రం ట్వీట్ చేసింది. ఆగస్టు 18న రాయలసీమ మినహా ఉత్తర, మధ్య, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలన్నింటికీ వర్ష హెచ్చరిక జారీ చేశారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, క్రిష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవనున్నట్లు అంచనా వేశారు. రాయలసీమ జిల్లాలకు మాత్రం ఎలాంటి హెచ్చరిక జారీ చేయలేదు. మరో 5 రోజులకు కూడా ఏపీలో వాతావరణం ఇలాగే ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. దీనివల్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
Also Read: MP Bandi Sanjay: కామన్ మ్యాన్ లా గుడారాల్లో బండి సంజయ్.. కనీసం టీవీ కూడా లేదట
Breaking News Live Updates : వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి 5గురు మృతి
Revanth Reddy On CM KCR : మరో శ్రీలంకలా తెలంగాణ, రాజపక్స పరిస్థితే కేసీఆర్ కు వస్తుంది : రేవంత్ రెడ్డి
Hyderabad Crime : గర్ల్ ఫ్రెండ్ కి హాయ్ చెప్పాడని కత్తితో దాడిచేసిన బాలుడు, రక్తం కారుతుంటే సెల్ఫీ!
Vanajeevi Ramaiah : వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం, ఐసీయూలో చికిత్స
MLC Kavita On Congress : కాంగ్రెస్ ఓ తోక పార్టీ, ప్రాంతీయ పార్టీలదే అధికారం- ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
Wall Collapse in Gujarat: ఉప్పు ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం- గోడ కూలి 12 మంది మృతి!
Urvashi Rautela: కేన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్ - వైట్ గౌన్ లో ఊర్వశి రౌతేలా
Anil Ravipudi: ఎన్టీఆర్ తో సినిమా - అనిల్ రావిపూడి ఏమన్నారంటే?
Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం సంచలన తీర్పు- 31 ఏళ్ల తర్వాత పెరరివలన్ రిలీజ్