By: ABP Desam | Updated at : 18 Aug 2021 07:38 AM (IST)
పెరిగిన బంగారం, వెండి ధరలు (ప్రతీకాత్మక చిత్రం)
బులియన్ మార్కెట్‌లో బుధవారం నాడు (ఆగస్టు 18) పసిడి ధర పెరిగింది. ఆగస్టు 18న బంగారం ధరలో గ్రాముకు రూ.45 చొప్పున భారీ పెరుగుదల కనిపించింది. దీంతో భారత మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ రూ.46,430 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.47,430గా ఉంది. మొత్తానికి గత వారం రోజులతో పోలిస్తే బంగారం ధర బాగానే పెరిగింది.
భారత మార్కెట్‌లో బంగారం ధరలు బాగా పెరగ్గా వెండి ధర మాత్రం స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. గ్రాముకు రూ.0.90 పైసలు పెరిగింది. తాజాగా భారత్‌లో కిలో వెండి ధర రూ.63,600 గా ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధర గ్రాముకు రూ.0.40 పైసలు మాత్రమే పెరగ్గా.. ఇక్కడ కిలో వెండి ధర కాస్త ఎక్కువగా రూ.68,600గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో ఆగస్టు 18న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర గ్రాముకు రూ.19 చొప్పున పెరిగింది. దీంతో 24 క్యారెట్ల మేలిమి బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,220 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6 స్వచ్ఛత) ధర రూ.44,200 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.68,600గా పలికింది.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ఆగస్టు 18న రూ.44,200 కు పెరిగింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,220గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,200గా స్థిరంగానే ఉంది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,010 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,010గా ఉంది. ఇక్కడ వెండి ధర కిలో రూ.68,600 గానే కొనసాగుతోంది.
Also Read: MP Bandi Sanjay: కామన్ మ్యాన్ లా గుడారాల్లో బండి సంజయ్.. కనీసం టీవీ కూడా లేదట
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఆగస్టు 18న ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,430ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,430గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,580 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,630గా ఉంది.
ప్లాటినం ధరలో స్వల్ప తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర మాత్రం ఆగస్టు 18న కాస్త పెరిగింది. గ్రాముకు రూ.25 వరకూ పెరిగి ధర రూ.2,425గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,250 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అంతే ఉంది.
అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Petrol-Diesel Price, 10 August: వాహనదారులకు షాక్! నేడు ఎగబాకిన ఇంధన ధరలు - మీ నగరంలో ఈరోజు ఇలా
Gold-Silver Price: బంగారం నేడు భారీ షాక్! ఊహించని రీతిలో పైకి - వెండి కూడా పైపైకి
India Rankings In Various Indices: 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత వివిధ సూచికల్లో భారత్ స్థానం ఇది!
Petrol-Diesel Price, 9 August: నేడు చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు పైకి - మీ నగరంలో ఇవాళ ఇలా
Gold-Silver Price: బంగారం కొంటున్నారా? మీ నగరంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఇలా
Karthi Confirms Kaithi 2 : 'ఖైదీ' సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన కార్తీ - విజయ్ సినిమాతో ముడి పడిన మేటర్ మరి
Warangal: ‘లాహిరి లాహిరిలో’ మూవీ సీన్ రిపీట్! ఎదురుపడ్డ ప్రత్యర్థులు - చివరికి ఎవరు నెగ్గారంటే?
KTR Tweet: నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతే: కేటీఆర్ సెటైర్లు
Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి - రెండో ప్రమాద హెచ్చరిక జారీ