Suryapet Crime News: యువతిపై చిన్నాన్న అత్యాచారం... సోదరుడు కూడా లైంగిక వేధింపులు... తట్టుకోలేక ఆత్మహత్య

బంధువులే రాబందులయ్యారు. చిన్నాన్న, పెద్దనాన్న కుమారుడే మృగాళ్లల మారి పాడుపని చేశారు. వావివరసలు మరిచి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

FOLLOW US: 

భారతదేశంలో కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టమైంది. బాంధవ్యాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. కానీ ఆధునిక పోకగల సమాజంలో వింత చేష్టలు పెరిగిపోతున్నాయి. వావివరసలు మరిచిపోతున్నారు. నిన్న ఒకడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకపోతే అత్యాచారం చేయిస్తానని కన్న కూతుర్నే బెదిరించాడో ప్రబుద్ధుడు. నేడు మరో ఇద్దరు మృగాళ్లు కూతురు వరస యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. తల్లిదండ్రులు లేని ఆ యువతికి అండగా నిలవాల్సిన బంధువులే కిరాతుకులయ్యారు. 

Also Read:  Ramya Murder: రమ్య మృతదేహం తరలింపు అడ్డగింత.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు, ఫ్యామిలీకి నగదు చెక్కు అందించిన హోంమంత్రి

వావివరసలు మరిచి

రెండేళ్ల వయసులోనే తల్లిదండ్రులు చనిపోయి అనాథ అయిన ఆమెను పెదనాన్న, పెద్దమ్మ పెంచి పెద్ద చేశారు. తల్లిదండ్రులు లేకపోయినా బంధువులు ఉన్నారన్న మనోధైర్యంతో ఉన్న యువతిపై బంధువులే  అఘాయిత్యానికి పాల్పడ్డారు. వావివరసలు మరిచి సొంత చిన్నాన్న, పెదనాన్న కొడుకు యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ బాధను తట్టుకోలేక బాధితురాలు ప్రాణం తీసుకుంది. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఫత్తేపురంలో సోమవారం వెలుగు చూసింది.

Also Read: Guntur Girl Murder: ఆరు నెలల పరిచయం, బీటెక్ విద్యార్థిని ఆయువు తీసింది... రమ్య హత్య కేసులో షాకింగ్ నిజాలు

చిన్నాన్న, పెద్దనాన్న కుమారుడే కీచకులు

నేరేడుచర్ల ఎస్సై విజయ్‌ప్రకాశ్‌ తెలిపిన వివరాల ప్రకారం నేరేడుచర్ల మండలం ఫత్తేపురానికి చెందిన ఓ యువతి(21)కి రెండేళ్ల వయసులోనే ఆమె తల్లిదండ్రులు మరణించారు. వారికి ఇద్దరు కూతుళ్లు. ఒకరు పెదనాన్న, పెద్దమ్మలు వద్ద పెరిగారు. మరో అమ్మాయిని నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. పెద్దమ్మ, పెదనాన్నల వద్ద ఉన్న యువతిని వాళ్లు పదో తరగతి వరకు చదివించారు. ఆ తర్వాత ఇంటి పనులు, కూలి పనులు చేయిస్తూ వేధించడం మొదలుపెట్టారు. సొంత చిన్నాన్న యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. గర్భం దాల్చటంతో ఎవరికీ తెలయకుండా గర్భస్రావం చేయించాడు.

Also Read: Is People Culprits : నడిరోడ్డుపై హత్యలు ! రక్షించని ప్రజలదే నేరమా..?

పురుగుల ముందు తాగి ఆత్మహత్య

ఆ తర్వాత పెదనాన్న కుమారుడు కూడా యువతిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీన్ని భరించలేక ఆ యువతి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను ముందు మిర్యాలగూడకు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఆమె చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. తన సోదరిని లైంగికంగా వేధించడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలు సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: Viral Video: నారీ నారీ నడుమ మురారి...వామ్మో…నడిరోడ్డుపై ఏం జరిగిందంటే.....

Tags: TS News Crime News Suryapet Rape Case Rape TS Crime News

సంబంధిత కథనాలు

TRS Rajyasabha Mandava :  టీఆర్ఎస్ రాజ్యసభ రేస్‌లో మండవ - కేసీఆర్ డిసైడయ్యారా ?

TRS Rajyasabha Mandava : టీఆర్ఎస్ రాజ్యసభ రేస్‌లో మండవ - కేసీఆర్ డిసైడయ్యారా ?

Teenmar Mallanna Vs Puvvada : మిస్టర్ మల్లన్న క్షమాపణలు చెప్పు లేదా రూ. పది కోట్లు కట్టు - మినిస్టర్ వార్నింగ్

Teenmar Mallanna Vs Puvvada :  మిస్టర్ మల్లన్న  క్షమాపణలు చెప్పు లేదా రూ. పది కోట్లు కట్టు   - మినిస్టర్ వార్నింగ్

Cabs Bundh: అలర్ట్! ఈ నెల 19న క్యాబ్స్ బంద్, ఆటోలు కూడా - పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు

Cabs Bundh: అలర్ట్! ఈ నెల 19న క్యాబ్స్ బంద్, ఆటోలు కూడా - పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు

Nalgonda: ‘పైసలియ్యి, లేకుంటే చావు’ పెళ్లి కాకముందే కట్నం కోసం వరుడి మెసేజ్‌లు - యువతి ఆత్మహత్య

Nalgonda: ‘పైసలియ్యి, లేకుంటే చావు’ పెళ్లి కాకముందే కట్నం కోసం వరుడి మెసేజ్‌లు - యువతి ఆత్మహత్య

Beer Sales In Hyderabad: ఎండల వేళ బీర్లతోనే ఎంజాయ్‌మెంట్! ఈ నెల అమ్మకాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

Beer Sales In Hyderabad: ఎండల వేళ బీర్లతోనే ఎంజాయ్‌మెంట్! ఈ నెల అమ్మకాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!

Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!

Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై 

Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై 

AP PCC New Chief Kiran : వైఎస్ఆర్‌సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం !?

AP PCC New Chief Kiran :   వైఎస్ఆర్‌సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం !?

Viral video: అంతరిక్ష కేంద్రం నుంచి రాత్రి వేళ భూమిని చూస్తే ఆ కిక్కే వేరప్పా

Viral video: అంతరిక్ష కేంద్రం నుంచి రాత్రి వేళ భూమిని చూస్తే ఆ కిక్కే వేరప్పా