Viral Video: నారీ నారీ నడుమ మురారి...వామ్మో…నడిరోడ్డుపై ఏం జరిగిందంటే.....
ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం చూసే ఉంటారు…కానీ ఇక్కడ ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్నారు. ఏ రేంజ్ లో అంటే…నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే జుట్టుపట్టుకుని మరీ గొడవకు దిగారు. జార్ఖండ్ జరాయ్‌కేలాకి చెందిన ఓ యువకుడు ఓ యువతి ప్రేమించుకున్నారు. అయితే యువకుడు మరో యువతితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం చూసి మొదటి గర్ల్ ఫ్రెండ్ ఆవేశంతో ఊగిపోయింది. నా బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతావా అంటూ ఆమె చెంపలు వాయించింది. అక్కడితో ఆగలేదు…జుట్టు పట్టుకుని రోడ్డుపైనే కొట్టేసుకున్నారు. వారిద్దరినీ వారించేందుకు ప్రియుడు ఎంత ప్రయత్నించినా ఇద్దరూ పట్టించుకోలేదు. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో మొదటి గర్ల్ ఫ్రెండ్ ఆమె స్నేహితురాలు పరారయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
![ఫిలడెల్ఫియాలో ఆసక్తికర సంఘటన...ఆటోపైలెట్ కారులో ప్రసవం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/21/3f98c5433c1575fb81df8f4abc566add_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)