అన్వేషించండి

Telangana Sports: తెలంగాణ క్రీడాపాలసీలో సమూలమైన మార్పు - ఏ పోటీలకైనా ఆతిథ్యం ఇచ్చేందుకు రెడీ !

Telangana Sports Hub: ఒలింపిక్స్ సహా ఏ పోటీలకైనా ఆతిథ్యం ఇచ్చేలా తెలంగాణ సిద్ధమని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ హ‌బ్ మొదటి సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చలు నిర్వహించారు.

Olympics in Telangana: ఖేలో ఇండియా, కామ‌న్ వెల్త్‌, ఒలింపిక్స్ ఇలా ఏ పోటీలు నిర్వ‌హించినా వాటిలో తెలంగాణ‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని తెలంగాణ స్పోర్ట్స్ హ‌బ్ తీర్మానం చేసింది. రాష్ట్రంలో స్టేడియాల నిర్వ‌హ‌ణ‌, వ‌స‌తులు మెరుగుప‌ర్చ‌డం, కోచ్‌లు, ట్రైన‌ర్‌ల‌కు శిక్ష‌ణ‌, క్రీడా పాల‌సీలో వివిధ అంశాల‌పై ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌, అమ‌లుకు స‌బ్ క‌మిటీల ఏర్పాటుకు బోర్డు తీర్మానాలు చేసింది. తెలంగాణ స్పోర్ట్స్ హ‌బ్ బోర్డు మొద‌టి స‌మావేశం హైద‌రాబాద్‌లో గురువారం జ‌రిగింది. 

తెలంగాణలో క్రీడా సంస్కృతి రావాలి ! 

జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో క్రీడా విధానం, క్రీడ‌ల ప్రోత్సాహం  విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ హైద‌రాబాద్ గురించి మాట్లాడుకోవాల‌నేదే  త‌న ల‌క్ష్య‌మ‌ని సీఎం రేవంత్ అన్నారు. క్రీడా ప్ర‌పంచానికి హైద‌రాబాద్ వేదిక‌గా మారాల‌ని ముఖ్య‌మంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ‌కు ఐటీ సంస్కృతి ఉంద‌ని... రాష్ట్రంలోని ప్ర‌తి కుటుంబం త‌మ పిల్ల‌లు ఐటీ రంగంలో ఉండాల‌ని కోరుకుంటున్నార‌ని... అలానే క్రీడా సంస్కృతి రావాల‌ని తాను అభిల‌షిస్తున్న‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. క్రీడా రంగం ప్రోత్సాహానికిగానూ గ‌తంతో పోల్చితే 16 రెట్లు బ‌డ్జెట్ పెంచామ‌ని సీఎం వివ‌రించారు. జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారుల‌కు ప్రోత్సాహాకాలు ఇవ్వ‌డంతో పాటు ప్ర‌భుత్వ ఉద్యోగాలు క‌ల్పించామ‌ని సీఎం తెలిపారు. క్రీడా రంగం ప్రాధాన్య‌త‌ను పెంచేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామ‌న్నారు.  హైద‌రాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్టేడియాలు, అధునాత‌న ప‌రిక‌రాలు అందుబాటులో ఉన్నా ఆశించిన స్థాయిలో ఫ‌లితాలు లేవ‌ని, వాటిని స‌మ‌గ్రంగా స‌ద్వినియోగం చేసుకోవ‌డంతో పాటు క్రీడా రంగంలో తెలంగాణ‌ను అగ్ర‌గామిగా నిలిపేందుకు బోర్డు త‌గిన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని సీఎం కోరారు. క్రీడా రంగం అభివృద్ధికి నిధులు, నిపుణులు, నిర్వ‌హ‌ణ‌ అవ‌స‌ర‌మైనందునే బోర్డులో ప్ర‌ముఖ కార్పొరేట్లు, క్రీడాకారులు, క్రీడా నిర్వాహ‌కుల‌కు చోటు క‌ల్పించామ‌ని సీఎం తెలిపారు. 

ప్రతి విద్యార్థి ఏదో ఓ క్రీడలో పాల్గొనేలా ప్రోత్సహించాలి ! 

ప్ర‌తి విద్యార్థి ఏదో ఒక క్రీడ‌లో పాల్గొనేలా చూస్తే ఫ‌లితాలు వాటంత‌ట‌వే వస్తాయ‌ని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్  అభిప్రాయ‌ప‌డ్డారు. హ‌ర్యానాలో కుస్తీతో ప్ర‌తి క్రీడ‌కు ప‌ల్లెల్లో చోటు ఉంద‌ని ఆయ‌న గుర్తు చేశారు.  ప్ర‌తి పాఠ‌శాల‌లో వ్యాయామ ఉపాధ్యాయుడు, వ్యాయామ సంచాల‌కుడు ఉండేలా చూడాల‌ని అభినవ్ భింద్రా సూచించారు.   పాఠ‌శాల స్థాయిలోనే క్రీడ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని... వ్యాయామ అక్ష‌రాస్య‌త (Physical literacy)పై అవ‌గాహ‌న పెంపొందించాల్సి ఉంద‌ని ధాని ఫౌండేష‌న్ వీతా ధానీ సలహా ఇచ్చారు.  గ్రామ స్థాయి నుంచి క్రీడా పోటీలు ద‌శ‌ల‌వారీగా ఉండాల‌ని.. అప్పుడు మెరుగైన క్రీడాకారుల ఎంపిక సాధ్య‌మ‌వుతుంద‌ని గోపీచంద్ సలహా ఇచ్చారు. ఫిజియోథెర‌పిస్టు కోర్సుల‌ను క్రీడా యూనివ‌ర్సిటీలో ప్రారంభించాల‌ని   హ‌బ్ కో ఛైర్‌ప‌ర్స‌న్ ఉపాస‌న కొణిదెల సూచించారు.   గ్రామ స్థాయిలో స్టేడియాలు, క్రీడా సామ‌గ్రి అందుబాటులో ఉండే క్రీడాకారులు వెలుగులోకి వ‌స్తార‌ని తెలిపారు. ఇంగ్లాండ్‌లో ప్ర‌తి ఆట‌కు లీగ్స్ ఉంటాయ‌ని...అలాగే మ‌న ద‌గ్గ‌ర ప్ర‌తి ఆట‌కు లీగ్స్ ఉండాల‌ని ఫుట్ బాట్ టీమ్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా సూచించారు. 

సభ్యుల సూచనల మేరకు మార్పులు 

క్రీడా పోటీల విధానాన్ని మార్చుతూ గ్రామ‌, మండ‌ల, శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ స్థాయి పోటీలు నిర్వ‌హిస్తామ‌ని సీఎం తెలిపారు.  శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో విజేత‌లుగా నిలిచిన జ‌ట్ల మ‌ధ్య పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ స్థాయి పోటీలు నిర్వ‌హించి అంతిమంగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వ‌హించి రాష్ట్ర స్థాయి జ‌ట్ల‌ను ఎంపిక చేస్తామ‌న్నారు.. క్రీడా సామ‌గ్రిపై ఉన్న ప‌న్నుల త‌గ్గింపున‌కు కేంద్ర ప్ర‌భుత్వంతో మాట్లాడ‌తామ‌ని... త‌మ స్థాయిలో అవ‌స‌ర‌మైన ప్రోత్సాహాకాలు అందిస్తామ‌ని తెలిపారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీలో ఫిజియోథెర‌పీ, ఇత‌ర క్రీడా సంబంధిత కోర్సులు ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని బోర్డు స‌భ్యుల‌కు తెలియ‌జేశారు. స్టేడియాలు పెద్ద సంఖ్య‌లో ఉన్నా త‌గిన సంఖ్య‌లో కోచ్‌లు లేర‌ని, ఉన్న కోచ్‌ల‌కు అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌కు త‌గిన‌ట్లు  శిక్ష‌ణ ఇప్పించాల్సి ఉంద‌న్నారు.   

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tiger Near Hyderabad: హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
Most imported item in India: భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
Special Trains: ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే
ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే
Border 2 Advance Booking: రిలీజుకు ముందే సన్నీ డియోల్ సినిమా సంచలనం... అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ము దులుపుతున్న బోర్డర్ 2
రిలీజుకు ముందే సన్నీ డియోల్ సినిమా సంచలనం... అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ము దులుపుతున్న బోర్డర్ 2

వీడియోలు

Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Medaram Jatara Gattamma Thalli History | ఎవరీ గట్టమ్మ తల్లి ? | ABP Desam
WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Near Hyderabad: హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
Most imported item in India: భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
Special Trains: ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే
ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రం మీదుగా బెంగుళూరు, చెన్నైకి 2 పర్మనెంట్ ట్రైన్స్.. రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే
Border 2 Advance Booking: రిలీజుకు ముందే సన్నీ డియోల్ సినిమా సంచలనం... అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ము దులుపుతున్న బోర్డర్ 2
రిలీజుకు ముందే సన్నీ డియోల్ సినిమా సంచలనం... అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్ము దులుపుతున్న బోర్డర్ 2
Hyderabad News: బేగంపేట ఫ్లైఓవర్‌పై కారు బోల్తా, నలుగురికి గాయాలు.. అసలేం జరిగింది
బేగంపేట ఫ్లైఓవర్‌పై కారు బోల్తా, నలుగురికి గాయాలు.. అసలేం జరిగింది
Smartphone Exposure in Kids : చిన్నపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? అయితే ప్రమాదమే.. స్మార్ట్‌ఫోన్ల వల్ల పిల్లల ఆరోగ్యంపై షాకింగ్ విషయాలు
చిన్నపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? అయితే ప్రమాదమే.. స్మార్ట్‌ఫోన్ల వల్ల పిల్లల ఆరోగ్యంపై షాకింగ్ విషయాలు
Revanth Reddy at WEF:
"మేధస్సే సమస్య మేధస్సే పరిష్కారం" ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ సీఎం కీలక కామెంట్స్
స్కోడా కుషాక్‌ ఫేస్‌లిఫ్ట్‌ vs పాత కుషాక్‌: డిజైన్‌, ఫీచర్లు, ఇంజిన్‌లో ఏమేం మారాయి?
కొత్త కుషాక్‌ ఫేస్‌లిఫ్ట్‌ vs పాత మోడల్‌: అసలు తేడాలేంటి?
Embed widget