అన్వేషించండి

Hindalco at Kuppam: కుప్పంకు iPhone కాంపోనెంట్ తయారీ యూనిట్..హిందాల్కో భారీ పెట్టుబడి

Hindalco at Kuppam: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం Iphone  తయారీలో భాగం కాబోతోంది. ఐఫోన్‌లో ఉపయోగించే అల్యూమినియం చాసిస్‌లల యూనిట్‌ను హిందాల్కో ఏర్పాటు చేయబోతోంది.

Hindalco iPhone Plant at Kuppam: అంతర్జాతీయ అల్యూమీనియం తయారీ సంస్థ Hindalco ఆంధ్రప్రదేశ్‌లో అడుగిడుతోంది. హిందాల్కో ఇండస్ట్రీస్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో పెట్టుబడిపెడుతోంది. రూ. 586 కోట్లతో ఒక అత్యాధునిక అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం అల్యూమినియం ఉత్పత్తులను మాత్రమే కాదు, యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్‌ల ఛాసిస్  iPhone Alluminnium Chasis(బాడీ) లను ప్రత్యేకంగా తయారు చేస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించలేదు కానీ.. కుప్పంలో ప్లాంట్ ఏర్పాటు దాదాపు ఖరారు అయినట్లు ఎకనామిక్ టైమ్స్ ప్రచురించింది.

2027కు ప్లాంట్ సిద్ధం

కుప్పంలో ఉన్న పాత అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్ ప్లాంట్‌ను కొనుగోలు చేసిన Hindalco అక్కడ తన కార్యకలాపాలు మొదలుపెడుతుంది. ఏపీ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ ఇండస్ర్రీ పాలసీ 2025-30 కు అనుగునంగా ఈ సంస్థ ఏర్పాటవుతోంది. 2026 చివరి నాటికి నిర్మాణం పూర్తవుతుందని.. 2027 నుంచి కార్యకలాపాలు మొదలవుతాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ ఫెసిలిటీ ద్వారా షుమారు 600 ఉద్యోగాల కల్పన జరుగుతుంది. బెంగళూరులోని ఫాక్స్‌కాన్ ఫెసిలిటీకి కుప్పం సమీపంలో ఉంటుంది. ఈ అనుకూలతను ఉపయోగించుకుని కుప్పంలో Hindalco యూనిట్ ప్రారంభం అవుతోంది.

ఈ ప్రాజెక్ట్ కేవలం ఉద్యోగాల కల్పనకే పరిమితం కాదు.  "మేక్ ఇన్ ఇండియా" మరియు "మేక్ ఫర్ ది వరల్డ్"  అంటున్న భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఇది ఒక ముందడుగు.  ఇంతకు ముందు ఐఫోన్ విడిభాగాలను దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబ్లింగ్ చేసేవారు. ఇప్పుడు ఆ ఫోన్లలో ఉపయోగించే చాసిస్‌ను ఇక్కడే తయారు చేస్తుండటం ఐఫోన్ మేకింగ్ ఇన్ ఇండియా డ్రీమ్‌లో కీలకమైన అంశం.

ఆదిత్య బిర్లా గ్రూప్ లో ఒక ప్రముఖ సంస్థ అయిన హిందాల్కో, అల్యూమినియం మరియు రాగి ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది.. ఆటోమొబైల్స్, విమానాలు, ప్యాకేజింగ్ మరియు ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రంగాలకు ఈ సంస్థ కీలకమైన ఉత్పత్తులను అందిస్తుంది.


Hindalco at Kuppam: కుప్పంకు iPhone కాంపోనెంట్ తయారీ యూనిట్..హిందాల్కో భారీ పెట్టుబడి

యాపిల్ ఫోన్ల తయారీలో కీలక అడుగు

యాపిల్ ఫోన్ల తయారీ యూనిట్‌ Foxconnను  ఏపీకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు. తైవాన్‌కు చెందిన ఈ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ కంపెనీ భారత్‌లో విస్తరణకు ప్రణాళికలు వేసుకుంటోంది. ఇప్పటికే ఏపీలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. శ్రీ సిటీలో ఫాక్స్‌కాన్‌ను అసెంబ్లింగ్ యూనిట్ ఉంది. అప్పట్లో ఇక్కడ Iphone టెస్టింగ్, అసెంబ్లింగ్ చేశారు. ఇంకా శ్రీపెరంబదూర్, బెంగళూరులో కూడా ఫాక్స్‌కాన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇటీవలనే యూపీలో యూనిట్ ప్రారంభించడానికి సన్నాహకాలు చేస్తున్నారు. అయితే వియత్నాం తరహాలో పెద్ద ఎత్తున మాన్యుఫాక్చరింగ్ చేసేందుకు ఫాక్స్‌కాన్ సిటీని నిర్మించాలని ఆ కంపెనీ యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం చాలా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి.

ఇప్పటికే కుప్పంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు కొన్ని ఉన్నాయి. హిందాల్కో అక్కడ అడుగుపెడితే.. మరిన్ని పరిశ్రమలు అక్కడకు రావడానికి ఆస్కారం ఉంది. ఈ మధ్యనే నెల్లూరు- బెంగళూరు హైవే నుంచి కుప్పంకు నాలుగు వరుసల రహదారి నిర్మించారు. బెంగళూరుకు అతి దగ్గరగా ఉండటంతో దీనిని పారిశ్రామిక కేంద్రంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Aggipetti Macha : ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
ఆగిన అగ్గిపెట్టె మచ్చ అంత్యక్రియలు - ఆస్తి వివాదాలే కారణమా?
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
KCR Farmhouse 45 Acres Missing Land: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
Embed widget