తిరుమలలో డిసెంబర్ 20 నుండి 29 వరకు వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది. ఈ పది రోజులు భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుంది.
Tirumala Darshan Tickets: తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల షెడ్యూల్ ప్రకటించిన టీటీడీ
తిరుమలలో జరగనున్న వైకుంఠ ద్వార దర్శన టికెట్ల షెడ్యూల్‌ను టీటీడీ విడుదల చేసింది. నవంబర్ 28 నుంచి ttdevasthanams.ap.gov.in లో దర్శన టికెట్ల కోటా విడుదల కానున్నాయి.

- వైకుంఠ ద్వార దర్శన టికెట్లు, టోకెన్ల షెడ్యూల్ టీటీడీ విడుదల చేసింది.
- శ్రీవాణి, రూ.300 టికెట్లు నవంబర్ 28, 30; దాతలవి డిసెంబర్ 8న.
- డిసెంబర్ 20, 21కి సామాన్యుల ఈ-డిప్ నమోదు డిసెంబర్ 1-5.
- డిసెంబర్ 20, 21న వీఐపీ బ్రేక్, రూ.300 దర్శనాలు రద్దు.
Tirumala Vaikuntha Dwara Darshan Tickets | తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి వివిధ దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుక్రవారం వెల్లడించింది. ఈ షెడ్యూల్ ప్రకారం, నవంబర్ 28వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను, నవంబర్ 30వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను (https://ttdevasthanams.ap.gov.in) లో విడుదల చేయనున్నారు. అలాగే, డిసెంబర్ 8వ తేదీ ఉదయం 10 గంటలకు దాతల (డోనర్స్) దర్శన కోటా టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులైన డిసెంబర్ 20, 21 తేదీల్లో అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఆ రెండు రోజులకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్ ఈ-డిప్ విధానం ద్వారా కేటాయించనున్నారు. భక్తులు డిసెంబర్ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ-డిప్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అనంతరం డిసెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఈ-డిప్ ద్వారా టోకెన్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేస్తారు.
ఇక రద్దీని దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 20, 21 తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన అన్ని వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా టీటీడీ రద్దు చేసింది. భక్తులందరూ దళారులను నమ్మకుండా కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ (https://ttdevasthanams.ap.gov.in) ద్వారా మాత్రమే దర్శన టికెట్లు, టోకెన్లను బుక్ చేసుకోవాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది.
Frequently Asked Questions
వైకుంఠ ద్వార దర్శనం ఎప్పుడు జరుగుతుంది?
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు?
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నవంబర్ 30వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు.
డిసెంబర్ 20, 21 తేదీల్లో సామాన్య భక్తులకు దర్శనం ఎలా లభిస్తుంది?
డిసెంబర్ 20, 21 తేదీలలో సామాన్య భక్తులకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ఈ-డిప్ ద్వారా కేటాయిస్తారు. డిసెంబర్ 1 నుండి 5 వరకు ఈ-డిప్‌లో నమోదు చేసుకోవచ్చు.
డిసెంబర్ 20, 21 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుందా?
డిసెంబర్ 20, 21 తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా, అన్ని వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు రూ.300 దర్శనాలను రద్దు చేశారు. ఇది సాధారణ భక్తుల కోసం చేసిన ఏర్పాటు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























