News
News
X

What's App Calls Cheating : అందమైన అమ్మాయి వాట్సప్ వీడియో కాల్ చేస్తే, మీకు చిక్కులే!

What's App Calls Cheating : సైబర్ మోసగాళ్లు వాట్సప్ కాల్స్ లో మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సప్ లో న్యూడ్ కాల్స్ చేస్తూ వాటిని రికార్డ్ చేసి బెదిరింపులకు దిగుతున్నారు.

FOLLOW US: 

What's App Calls Cheating :  సైబర్ మోసగాళ్లు రోజుగా కొత్త రూట్ ఎంచుకుంటున్నారు. తాజాగా వాట్సప్ వీడియో కాలింగ్ ను టార్గెట్ చేశారు. అందమైన అమ్మాయిల ప్రొఫైల్ పిక్ లు ఉన్న నెంబర్ల నుంచి హాయ్ అని పెడతారు. ఎలా ఉన్నారని పలకరిస్తారు. పొరపాటున రిప్లై ఇచ్చారో అంతే ఒక్కసారిగా వీడియో కాల్ చేస్తారు. కక్కుర్తి పడి కాల్ లిఫ్ట్ చేశారో ఇక అంతే డబ్బులు ఇచ్చేదాకా మీకు బెదిరింపులు వస్తూనే ఉంటాయి. వీడియో కాల్ లిఫ్ట్ చేయగానే అందమైన అమ్మాయిలు న్యూడ్ ఉంటారు. వాళ్ల స్ర్కీన్లపై మీరు కనిపిస్తున్న వీడియోలను సైబర్ మోసగాళ్లు రికార్డు చేస్తారు. ఆ తర్వాత డబ్బులు ఇస్తే వీడియో డిలీట్ చేస్తామని చెబుతారు. లేదంటే సోషల్ మీడియా పెడతామని బెదిరిస్తారు. ఇలా న్యూడ్ కాలింగ్ తో కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. 

ఆదిలాబాద్ లో ఇలాంటి ఘటన 

వాట్సప్ వీడియో కాల్స్ తో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. హాయ్ అంటూ మొదలైన పరిచయం యువకులను ముగ్గులోకి దింపి అందినంత డబ్బులు దండుకునేందుకు న్యూడ్ వీడియోలతో కవ్విస్తున్నారు. ఇలాంటి ఓ ఘటనే ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తికి ఓ యువతి వాట్సప్ మెసేజ్ లు, వాట్సప్ కాల్స్ చేస్తూ, న్యూడ్ గా వీడియో చూపిస్తూ ఛాటింగ్ చేసింది. చివరికి డబ్బులు ఇవ్వాలంటూ లేదంటే ఈ వీడియోను యూట్యూబ్, ఫేస్ బుక్, వాట్సప్ లో అప్లోడ్ చేస్తానని బెదిరింపులకు గురి చేసింది. దీంతో ఈ వాట్సప్ తతంగాన్ని బాధిత యువకుడు పోలీసులకు తెలియజేశాడు. గుర్తు తెలియని వారితో ఆన్లైన్ వాట్సప్ ఛాటింగ్ చేయొద్దని, మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. 

వాట్సప్ స్టేటస్ తో ఆగిన పెళ్లి

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణపురంకు చెందిన బొద్దుల రాజేష్ అనే యువకుడి పెళ్లి గద్దేరాగడిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బుధవారం రోజు జరుగుతోంది. వివాహ తంతు జరుగుతుండగానే... అక్కడకు ఓ అమ్మాయి వచ్చింది. అచ్చం తెలుగు సినిమాల్లో లాగానే పెళ్లి ఆపండి అంటూ గట్టిగా కేక వేసింది. ఏమైందంటూ అందరూ ఆమెను చూస్తున్నారు. ఆమె వధూవరులిద్దరూ స్నేహితురాలేమో, ఏదైనా సర్ ప్రైజ్ ప్లాన్ చేసిందేమోనని చాలా మంది అనుకున్నారు. కానీ ఆమె వచ్చింది వారిద్దరికి సర్ ప్రైజ్ ఇవ్వడానికి కాదు. షాక్ ఇవ్వడానికి. 

వచ్చింది బంధువు కాదండోయ్ వరుడి ప్రేయసి..

అదేంటీ అనుకుంటున్నారా. నిజమండి. ఆమె పెళ్లి కూతురుకో, పెళ్లి కుమారుడికో స్నేహితురాలు అయితే అదే జరిగేది. కానీ వచ్చింది నవ వరుడి ప్రేయసి. పెళ్లి పీఠల మీద కూర్చొని మరో అమ్మాయి మెడలో తాళి కట్టేందుకు రెడీగా ఉన్న రాజేష్ తనను ప్రేమించాడని, గత ఎనిమిదేళ్లుగా తామిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్లు బంధువుల అందరి ముందే చెప్పింది. అందుకే ఆ పెళ్లిని ఆపేసింది. తనను మోసం చేసిన యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె మాటలు విన్న అమ్మాయి తరపు బంధువులంతా ముక్కున వేలేస్కున్నారు. చోద్యం చూసినట్లుగా చూస్తుండిపోయారు. 

రాజేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

అమ్మాయి కుటుంబ సభ్యులు అయితే ఓ వైపు విలపిస్తూనే మరోవైపు పెళ్లి కొడుకుపై దుమ్మెత్తి పోశారు. ఇలాంటి వాడికా తమ కూతురును ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది అని కన్నీటి పర్యంతం అయ్యారు. ఆమెతోపాటే పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు పెళ్లి కుమారుడు రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై పూర్తి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

Also Read : Rayachoti Crime : కోడలి తల నరికిన అత్త, తలతో పోలీస్ స్టేషన్ కు!

Also Read : ప్రియురాలు పిలిచింది- వాట్సాప్‌ స్టాటస్‌ చూసి ప్రియుడి పెళ్లి ఆపేసింది

Published at : 11 Aug 2022 08:33 PM (IST) Tags: cyber crime TS News Crime News Adilabad News what's app video call

సంబంధిత కథనాలు

Rains In AP Telangana: మరో 2 రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్స్ - IMD ఎల్లో అలర్ట్

Rains In AP Telangana: మరో 2 రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్స్ - IMD ఎల్లో అలర్ట్

Telangana Model : గుజరాత్‌ మోడల్‌కు తెలంగాణ మోడల్‌తో చెక్ - కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ ప్లాన్ బ్లూ ప్రింట్ ఇదే !

Telangana Model :  గుజరాత్‌ మోడల్‌కు తెలంగాణ మోడల్‌తో చెక్ - కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ ప్లాన్ బ్లూ ప్రింట్ ఇదే !

Hyderabad Traffic Rules : ఇకపై స్టాప్ లైన్ దాటితే బాదుడే, హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్!

Hyderabad Traffic Rules : ఇకపై స్టాప్ లైన్ దాటితే బాదుడే, హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్!

Dasara 2022 : రూ.5.55 కోట్ల నగదుతో అమ్మవారి అలంకరణ, దర్శనానికి పోటెత్తిన భక్తులు!

Dasara 2022 : రూ.5.55 కోట్ల నగదుతో అమ్మవారి అలంకరణ, దర్శనానికి పోటెత్తిన భక్తులు!

Revanth Reddy : ఆ జీవో అమలుచేస్తే కేటీఆర్ చప్రాసి ఉద్యోగానికి కూడా పనికిరారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : ఆ జీవో అమలుచేస్తే కేటీఆర్ చప్రాసి ఉద్యోగానికి కూడా పనికిరారు- రేవంత్ రెడ్డి

టాప్ స్టోరీస్

Nagarjuna No Politics : విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Nagarjuna No Politics :  విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

Bigg Boss 6 Telugu Episode 27: సీజన్ 6లో తొలి మహిళా కెప్టెన్‌గా కీర్తి, శ్రీసత్య కాళ్లు పట్టిన అర్జున్ కళ్యాణ్ - జైలుకెళ్లక తప్పలేదు

Bigg Boss 6 Telugu Episode 27: సీజన్ 6లో తొలి మహిళా కెప్టెన్‌గా కీర్తి, శ్రీసత్య కాళ్లు పట్టిన అర్జున్ కళ్యాణ్ - జైలుకెళ్లక తప్పలేదు

68th National Film Awards: జాతీయ అవార్డుల ప్రధానోత్సవం - ఐదు అవార్డులతో ఓ మెరుపు మెరిసిన సూర్య, జ్యోతిక, ప్రత్యేక ఆకర్షణగా తమన్!

68th National Film Awards: జాతీయ అవార్డుల ప్రధానోత్సవం - ఐదు అవార్డులతో ఓ మెరుపు మెరిసిన సూర్య, జ్యోతిక, ప్రత్యేక ఆకర్షణగా తమన్!