Top Headlines: 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో సీఎం జగన్ - ఎర్రగుంట్లలో టెన్షన్ టెన్షన్, సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచి ఉన్న టాప్ హెడ్ లైన్స్ మీ కోసం.
Top Headlines on March 28th In Telugu States:
1. ఎర్రగుంట్లలో సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర
మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రెండో రోజున నంద్యాల జిల్లాలోని ఎర్రగుంట్లలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గత ఐదేళ్లు తాను చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఆ గ్రామంలో సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన నిధుల చిట్టా విప్పారు. అదే టైంలో టీడీపీ, జనసేనపై విమర్శలు చేశారు. తాను ఐదేళ్లుగా ప్రజల ముఖాల్లో ఆనందం కోసం బటన్స్ నొక్కుతూ ఉన్నాని దాని వల్ల గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించాలని రిక్వస్ట్ చేశారు జగన్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2. సీఎంను కలిసేందుకు ఎర్రగుంట్లకు అఖిలప్రియ - టెన్షన్.. టెన్షన్
వైసీపీ అధినేత జగన్ పర్యటనలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్‌ను కలిసి రైతుల సమస్యలు చెబుతానంటూ బయల్దేరిన మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు అడ్డుకున్నారు. బస్సు యాత్ర ఎర్రగుంట్ల వద్ద ఉన్నప్పుడు అటుగా వచ్చారు అఖిలప్రియ. స్థానిక అంశాలపై ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇస్తానంటూ వచ్చారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు రైతులతో కలిసి వచ్చిన అఖిలప్రియను పోలీసులు అడ్డుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3. సంగారెడ్డి జిల్లాలో పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం
సంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదం నాలుగైదు కుటుంబాల్లో తీవ్రవిషాదం నింపింది. పెళ్లి కూడా ఆగిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం మాన్సాన్ పల్లిలో పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో స్పాట్‌లో ముగ్గురు మృతి చెందారు. దీని కారణంగా జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4. హైదరాబాద్ బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాటేదాన్(Katedhan)లో ఉన్న రవి బిస్కెట్ ఫ్యాక్టరీ(Ravi Biscuits Factory )లో వేకువ జామున మంటలు అంటుకున్నాయి. ప్రమాదం ఎలా ఎందుకు జరిగిందో కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన క్షణాల్లోనే మంటలు పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. చూస్తుండగానే ఫ్యాక్టరీ కాలిబూడిదైపోయింది. మూడు అంతస్తుల్లో ఉన్న ఫ్యాక్టరీకి మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున పొగ ఆప్రాంతాన్ని కమ్మేసింది. అగ్ని కీలలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతంలో ఉన్న వారంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు
కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఎనిమిదో జాబితాను విడుదల చేసింది. 14 మందితో కూడిన జాబితాను కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి ప్రకటించింది. తెలంగాణలోని నాలుగు స్థానాలు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, భువనగిరి నియోజకవర్గాలకు అభ్యర్థులను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ నుంచి నాలుగు స్థానాలు, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్‌ల నుంచి చెరో 3 స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను 8వ జాబితాలో ప్రకటించింది. తాజా జాబితా ఖరారుపై చర్చించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ అయి చర్చించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.