అన్వేషించండి
Sangareddy News: సంగారెడ్డి జిల్లాలో పెళ్లి ట్రాక్టర్ బోల్తా- ముగ్గురు మృతి- వివాహం ఆగిపోవడంతో వరుడి తాత ఆత్మహత్య
Telangana News: ప్రమాదం జరిగిందని పెళ్లి ఆగిపోయింది. అది తట్టుకోలేక వరుడు సూసైడ్ చేసుకున్నాడు.

ప్రతీకాత్మక చిత్రం
Hyderabad News: సంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదం నాలుగైదు కుటుంబాల్లో తీవ్రవిషాదం నింపింది. పెళ్లి కూడా ఆగిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం మాన్సాన్ పల్లిలో పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో స్పాట్‌లో ముగ్గురు మృతి చెందారు. దీని కారణంగా జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది.
పెళ్లి ఆగిపోవడంతో వరుడి ఇంట్లో కూడా మరో విషాదం చోటు చేసుకుంది. వివాహం ఆగిపోయిందన్న బెంగతో వరుడి తాత ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మెదక్ జిల్లా పాపన్నపేట మండలం బాచారంలో విషాదం అలుముకుంది.
ఇంకా చదవండి





















