Realme GT2 Pro: ఫ్యూచర్ స్మార్ట్‌ఫోన్ ఇలానే ఉంటదేమో.. ఎన్నో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు.. ఏ మొబైల్‌లోనూ లేని విధంగా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన జీటీ 2 సిరీస్ ప్రత్యేక ఫీచర్లను రివీల్ చేసింది.
రియల్‌మీ ఫ్యాన్స్‌కు కాస్త నిరాశే. ఎందుకంటే జీటీ2 సిరీస్‌పై ఈవెంట్ అనగానే.. ఆ ఫోన్ ఈరోజే(డిసెంబర్ 20వ తేదీ) లాంచ్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ రియల్‌మీ ప్లాన్స్ మాత్రం వేరేలా ఉన్నాయి. ఈ సిరీస్ ఫోన్లకు సంబంధించిన ప్రత్యేక ఫీచర్లను మాత్రమే కంపెనీ రివీల్ చేసింది. ఫోన్ త్వరలో లాంచ్ కానుందని ప్రకటించింది.
ఒకసారి ఈ ఫోన్‌లో అందించనున్న ప్రత్యేకమైన ఫీచర్లను చూస్తే.. ఇందులో 150 డిగ్రీల అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండనుంది. సాధారణంగా 119 లేదా 120 డిగ్రీల అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ను మాత్రమే స్మార్ట్ ఫోన్ కెమెరాల్లో అందిస్తారు. కానీ ఒకేసారి 150 డిగ్రీల రేంజ్ ఉన్న లెన్స్ అంటే మాత్రం సూపర్ అనే చెప్పాలి. మంచి బ్యాక్‌గ్రౌండ్‌లో నిలబడి ఫొటోలు తీసుకోవాలనుకునే వారికి, వీలైనంత ఎక్కువ బ్యాక్‌గ్రౌండ్ కవర్ అయ్యేందుకు ఈ లెన్స్ ఉపయోగపడతాయి.
దీంతోపాటు ఇందులో ఫిష్ ఐ లెన్స్ ఉండనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఫిష్ ఐ లెన్స్ కూడా ఎక్కువ బ్యాక్‌గ్రౌండ్‌ను కవర్ చేసేందుకు ఉపయోగపడే లెన్స్. బయో డిగ్రేడబుల్ పదార్థాలతో ఈ ఫోన్ రూపొందించారు. అంటే పర్యావరణానికి జరిగే హాని చాలా తక్కువగా ఉండనుందన్న మాట.
ఈ స్మార్ట్ ఫోన్‌లో అల్ట్రా వైడ్ బ్యాండ్ యాంటెన్నా ఉంది. మాస్టర్ పేపర్ డిజైన్ కూడా ఇందులో అందించారు. కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం, ఆన్‌లైన్ క్లాసుల పుణ్యమా అని.. అందరి ఇళ్లలో వైఫై కూడా కామన్ అయిపోయింది. వైఫై కోసం కూడా ఇందులో ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఓమ్నీ డైరెక్షనల్ వైఫై టెక్నాలజీ, ఎన్‌హేన్స్‌డ్ వైఫై 6, డ్యూయల్ వైఫై నెట్‌వర్క్ యాక్సెలరేషన్, 5జీ, వైఫై నెట్‌వర్క్ రిలే వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
దీంతోపాటు ఇందులో స్విచ్చింగ్ యాంటెన్నా టెక్నాలజీ కూడా ఉంది. ఏ యాంటెన్నాకు సిగ్నల్ ఎక్కువ వస్తుందో గుర్తించి ఆ యాంటెన్నాకు నెట్‌వర్క్ స్విచ్ అవుతుందన్న మాట. అలాగే 360 డిగ్రీల ఆల్‌రౌండ్ ఇండక్షన్ ఫీచర్ కూడా ఉండనుంది. దీనికి సంబంధించిన బాక్స్ డిజైన్‌ను కూడా ఈ ఈవెంట్‌లో రివీల్ చేశారు.
Also Read: Jio 1 Rs Recharge Plan: రూ.1కే జియో రీచార్జ్ ప్లాన్.. లాభాలు ఏంటంటే?
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!