అన్వేషించండి

BGMI 2.9 Update Release Date: మోస్ట్ అవైటెడ్ బీజీఎంఐ 2.9 అప్‌డేట్ వచ్చింది - వావ్ అనిపిస్తున్న కొత్త గేమ్‌ప్లే!

Tech News in Telugu: మోస్ట్ పాపులర్ గేమ్ బీజీఎంఐలో 2.9 అప్‌డేట్‌ను కంపెనీ అందించింది.

BGMI 2.9 Update in Telugu: బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) గేమ్‌కు సంబంధించిన కొత్త అప్‌డేట్‌ను క్రాఫ్టన్ సంస్థ విడుదల చేసింది. అదే 2.9 అప్‌డేట్. దీని కోసం గేమర్లు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ అప్‌డేట్ ద్వారా ఐస్ అండ్ స్నో ఫెస్టివల్: ఎ స్నోవీ ఎక్స్‌ట్రాగావాంజా అనే కొత్త గేమ్ ప్లే అందుబాటులోకి రానుంది. దీనికి మంచి క్రేజ్ వచ్చింది. ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్, ఐవోఎస్ వినియోగదారులు యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ గేమ్‌ను డౌన్‌లోడ్ చేయవచ్చు.

బీజీఎంఐ గేమ్ ఇంతకుముందు పబ్జీ (ప్లేయర్ అన్‌నోన్ బ్యాటిల్ గ్రౌండ్స్) పేరుతో మనదేశంలో బాగా పాపులర్ అయింది. కానీ 2020 జులైలో పలు చైనా యాప్స్ బ్యాన్ చేసినప్పుడు పబ్జీపై కూడా నిషేధం విధించారు. ఆ తర్వాత క్రాఫ్టన్ అనే సౌత్ కొరియన్ కంపెనీ ద్వారా బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) పేరుతో భారతదేశంలో రీ ఎంట్రీ ఇచ్చింది. మళ్లీ వచ్చాక కూడా మనదేశంలో ఈ గేమ్‌కు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

బీజీఎంఐలో కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు వారి తల్లిదండ్రుల ద్వారా మాత్రమే గేమ్‌కు లాగిన్ అవ్వగలరు. అలాగే గేమర్‌లు కేవలం ఓటీపీ ద్వారా మాత్రమే లాగిన్ చేయగలరు. గేమ్ డెవలపర్ అయిన క్రాఫ్టన్ 18 ఏళ్లలోపు పిల్లలకు ఇందులో పరిమితి కూడా విధించారు. వారు రోజులో కేవలం మూడు గంటలు మాత్రమే గేమ్ ఆడగలరు. గతంలో చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను గేమ్ విషయంలో ఇబ్బంది పెట్టినందున ఈ పరిమితిని కంపెనీ విధించారు.

అయితే ఈ గేమ్ కారణంగా గతంలో కొన్ని దారుణాలు కూడా జరిగాయి. ఈ గేమ్ ఆడొద్దని తల్లి మందలించినందుకు లఖ్‌నవూలోని ఓ బాలుడు ఏకంగా కన్నతల్లినే కాల్చి చంపాడు. ఆర్మీలో పని చేసే తన తండ్రి లైసెన్స్‌డ్ తుపాకీతో తల్లిని హత్య చేయటం అప్పట్లో సంచలనమైంది. ఈ ఘటన అప్పట్లో అందరినీ ఆందోళనకు గురి చేసింది. హత్య చేసిన అనంతరం దాదాపు మూడు రోజుల పాటు శవంతో ఇంట్లోనే ఉండిపోయాడు ఆ బాలుడు. పొరుగింటి వాళ్లకు అనుమానం రాకుండా ఉండేందుకు రూమ్ ఫ్రెష్‌నర్స్‌ వినియోగించాడు.

పబ్‌జీ కారణంగా ఇలాంటి నేరాలు జరగటం ఇది తొలిసారి కూడా కాదు. 2022 జనవరిలో పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఓ 14 ఏళ్ల బాలుడు పబ్‌జీ మత్తులో పడిపోయి గేమ్ ఆడొద్దని వారించినందుకు కుటుంబ సభ్యులపై తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తల్లితో సహా ఇద్దరు మైనర్లు తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. భారతదేశంలోనూ ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుండటం, ప్రైవసీ మీద వచ్చిన ఫిర్యాదుల కారణంగా కేంద్రం గేమ్‌ను బ్యాన్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చా కార్యక్రమంలో నిర్వహించిన సందర్భంలో ఓ తల్లి తన కుమారుడు పబ్‌జీకి బానిసైపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పబ్‌జీ వాలా హై క్యా అంటూ ప్రధాని నరేంద్రమోదీ అప్పట్లో వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి కూడా.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget