Best 5G Smartphones Under Rs 15000: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!
మనదేశంలో రూ.15 వేలలోపు 5జీ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఇందులో బెస్ట్ ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
5G Smartphones Under 15,000: దేశంలో ఎయిర్‌టెల్, జియో 5జీ సేవలను ప్రారంభించినప్పటి నుండి, పరిమిత బడ్జెట్‌లో 5జీ ఫోన్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం మనదేశంలో రూ. 15,000 రేంజ్‌లో వచ్చే 5జీ స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసుకుందాం. ఇందులో ఐటెల్, పోకో, వివో, రియల్‌మీ బ్రాండ్లకు చెందిన 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి.
ఐటెల్ పీ55 5జీ (Itel P55 5G)
ఐటెల్ పీ55 5జీ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఆక్టాకోర్ డైమెన్సిటీ ప్రాసెసర్, వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఏఐ పవర్డ్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఫోన్ వెనకవైపు అందించడం విశేషం. ఒక స్టోరేజ్ వేరియంట్, రెండు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై ఐటెల్ ఏకంగా రెండు సంవత్సరాల వారంటీని అందిస్తుంది. కొనుగోలు చేసిన తర్వాత మొదటి 100 రోజుల పాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను కూడా ఇవ్వనున్నారు. బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఐటెల్ పీ55 5జీని కొనుగోలు చేయవచ్చు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.9,999గా ఉంది. అలాగే రూ.9,499 ధరతో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు.
పోకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G)
పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ ఈ సంవత్సరం ఆగస్టులో మనదేశంలో లాంచ్ అయింది. దీని వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై పోకో ఎం6 ప్రో 5జీ పని చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను పోకో ఎం6 ప్రో 5జీ సపోర్ట్ చేయనుంది. 6.79 అంగుళాల భారీ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించారు. పోకో ఫోన్లలో ఇదే అత్యంత భారీ డిస్‌ప్లే ఉన్న ఫోన్ అని కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో మార్కెట్లో లాంచ్ అయింది. ఇందులో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గా నిర్ణయించారు. పవర్ బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్ రంగుల్లో పోకో ఎం6 ప్రో 5జీను కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మీ నార్జో 60ఎక్స్ 5జీ (Realme Narzo 60x 5G)
రియల్‌మీ నార్జో 60ఎక్స్ స్మార్ట్ ఫోన్ సెప్టెంబరులో మనదేశంలో లాంచ్ అయింది. రియల్‌మీ నార్జో 60 సిరీస్‌లో ఈ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్‌లో రియల్‌మీ నార్జో 60, నార్జో 60 ప్రో ఫోన్లు కూడా ఉన్నాయి. ఇందులో ఆక్టాకోర్ 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి రెండు వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.14,499గా నిర్ణయించారు. నెబ్యులా పర్పుల్, స్టెల్లార్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో రియల్‌మీ నార్జో 60ఎక్స్ 5జీ కొనుగోలు చేయవచ్చు.
వివో టీ2ఎక్స్ (Vivo T2x 5G)
వివో టీ-సిరీస్‌లో కొత్త ఫోన్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. వివో టీ2ఎక్స్ అనే పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. వివో టీ2ఎక్స్‌లో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.14,999గా నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.11,999కు కొనుగోలు చేయవచ్చు. మిర్రర్ బ్లాక్, ఫాగ్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?