అన్వేషించండి

How To Recover Deleted WhatsApp Messages: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!

వాట్సాప్‌లో డిలీట్‌ అయిన మెసేజ్‌లను తిరిగి పొందడానికి ఆండ్రాయిడ్‌ నోటిఫికేషన్‌ హిస్టరీ ఫీచర్‌ ఎంతో ఉపయోగపడుతుంది. గూగుల్‌ డ్రైవ్, లోకల్‌ డేటాబేస్‌ ఫైళ్ల ద్వారా పాత చాట్‌లను సులభంగా రికవర్ చేయవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆండ్రాయిడ్ 11+లో నోటిఫికేషన్ హిస్టరీ ద్వారా డిలీట్ మెసేజ్‌లు చూడండి.
  • గూగుల్ డ్రైవ్/లోకల్ బ్యాకప్‌తో వాట్సాప్ చాట్‌లను పునరుద్ధరించండి.
  • ఎగుమతి చాట్ ఫీచర్ వాడండి, మూడవ పార్టీ యాప్స్ వద్దు.

How To Recover Deleted WhatsApp Messages: వాట్సాప్‌లో మీ స్నేహితుడు లేదా కొలీగ్‌ ఒక ముఖ్యమైన మేసేజ్, ఫొటో లేదా డాక్యుమెంట్‌ పంపి, మీరు చూడకముందే డిలీట్ చేశాడనుకో, మీకు దిస్‌ మెసేజ్‌ వజ్ డిలీటెడ్‌ అని చూపిస్తుంది. లేదా తొందరపాటులో మీ అంతట మీరే చాట్ హిస్టరీ డిలీట్ చేసుకొని ఆందోళన చెందుతున్నారా? డిలీట్ అయిపోయిన ఆ మెసేజ్‌లో ఏముందో తెలుసుకోవాలనే ఉత్సుకత చాలా మందిలో ఉంటుంది. అయితే డిలీట్ అయిన వాట్సాప్‌ మెసేజ్‌లను తిరిగి చూడటం లేదా రికవరీ చేయడం అసాధ్యమేమీ కాదు. క్లౌడ్‌ బ్యాకప్‌ ఉన్నా, ఒక వేళ గూగుల్‌ డ్రైవ్‌  లేదా ఐక్లౌడ్‌ బ్యాక్‌ లేకపోయినా సరే, ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ వినియోగదారులు చాలా సులభంగా ఆ మెసేజ్‌లను ఎలా పొందాలో చూద్దాం. 

ఆండ్రాయిడ్‌ నోటిఫికేషన్ హిస్టరీ ద్వారా రికవరీ 

ఆండ్రాయిడ్‌ 11, ఆపై బగ్ వెర్షన్‌లలో పని చేసే స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి థర్డ్ పార్టీ  యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేయకుండానే డిలీట్ అయిన మెసేజ్‌లను చదవచ్చు. దీని కోసం మీ ఫోన్‌లోని సెట్టింగ్స్‌ యాప్‌లోకి వెళ్లండి. నోటిఫికేషన్స్‌ లేదా యాప్స్‌ అండ్‌ నోటిఫికేషన్స్‌పై క్లిక్ చేయండి. అక్కడ నిపించే నోటిఫికేషన్స్‌ హిస్టరీపై టాప్ చేసి దానిని ఆన్ చేయండి. ఈ ఫీచర్ ఆన్ చేసిన తర్వాత, ఎవరైనా వాట్సాప్‌లో మెసేజ్‌ పంపి వెంటనే డిలీట ఫర్ ఎవర్రీ  వన్ చేసినా, ఆ మెసేజ్‌ ప్రివ్యూ మీ ఫోన్ నోటిఫికేషన్ లాగ్‌లో భద్రంగా సేవ్ అయి ఉంటుంది. 

గూగుల్‌ డ్రైవ్‌ అండ్‌ ఐక్లౌడ్‌ బ్యాక్‌ ద్వారా చాట్‌ పునరుద్ధరణ

మీ వాట్సాప్‌ అకౌంట్‌లో డైలీ లేదా వీక్లీ బ్యాకప్‌ ఆన్ చేసి ఉంటే, డిలీట్‌ అయిన చాట్‌లను సెకన్లలో రికవరీ చేయవచ్చు. వాట్సాప్‌ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌>చాట్స్‌>చాట్ బ్యాప్‌లోకి వెళ్లి చివరి బ్యాకప్‌ ఎప్పుడు జరిగిందో చెక్‌ చేయండి. మెసేజ్ డిలీట్ కావడానికి ముందే బ్యాకప్‌ ఉంటే, మీ ఫోన్‌ నుంచి వాట్సాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి. గూగుల్‌ పే స్టోర్‌, ఆపిల్‌ యాప్ స్టోర్ నుంచి వాట్సాప్‌ను తిరిగి రీఇన్‌స్టాల్‌ చేసుకోండి. మీ మొబైల్‌ నంబర్‌తో లాగిన్ అయి ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయండి. స్క్రీన్‌పై కనిపించే రీస్టోర్‌ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డిలీట్ అయిన చాట్‌లు, మీడియా ఫైల్స్‌ తిరిగి వచ్చేస్తాయి. 

లోకల్‌ డేటాబేస్‌ ట్రిక్‌

ఒక వేళ మీ వద్ద గూగుల్ డ్రైవ్ బ్యాకప్ లేకపోతే, ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోని ఇంటర్నల్ స్టోరేజ్‌ ఆధారంగా డేటాను రికవర్ చేయవచ్చు. వాట్సాప్‌ ప్రతినెలా, రోజూ ఉదయం 2 గంటలకు లోకల్‌ బ్యాకప్‌ ఫైల్స్‌ను ఫోన్‌లో సేవ్ చేస్తుంది. మీ ఫోన్‌లోని ఫైల్ మేనేజర్‌ ఓపెన్ చేయండి. ఆండ్రాయిడ్‌>మీడియా>com.whatsapp>whatsapp>డాటాబేస్‌ ఫోల్టర్‌లోకి వెళ్లండి. అక్కడ ఉన్న msgstore-YYYY-MM-DD.1.db.crypt14 ఫైల్‌లలో మీరు రికవర్ చేయాలనుకుంటున్న తేదీకి చెందిన ఫైల్‌ను ఎంచుకొని, గానిపేరును msgstore.db.crypt14గా రీనేమ్‌ చేయండి. ఇప్పుడు వాట్సాప్‌ను అన్‌ ఇన్‌స్టాల్ చేసి, మళ్లీ ఇన్‌స్టాల్ చేసి వెరిపై చేస్తే లోకల్ ఫైల్ ద్వారా చాట్ రికవరీ అవుతుంది. 

ఎక్స్‌పోర్ట్ చాట్‌ ఫీచర్‌తో బ్యాకప్‌ భద్రత 

మీకు అత్యంత సన్నిహితులు, లేదా బిజినెస్ కాంటాక్ట్స్‌తో జరిపిన చాట్‌ డిలీట్ కాకుండా ఉండటానికి వాట్సాప్‌లోని ఇన్ బిల్ట‌ ఎక్స్‌పోర్ట్ చాట్‌ ఫీచర్‌ అద్భుతంగా తోడ్పడుతుంది. నిర్ధిష్టమైన వ్యక్తి చాట్ బాక్స్‌ ఓపెన్ చేసి పైన ఉన్న ...>మోర్‌>ఎక్స్‌పోర్ట్‌ ఛార్ట్‌ ఎంచుకోండి. విత్‌అవుట్‌ మీడియా లేదా ఇన్‌క్లూడ్‌ మీడియా ఆప్షన్ ఎంచుకుని, ఆ మొత్తం చాట్‌ను మీ ఈ మెయిల్‌ లేదా గూగుల్‌ డ్రైవ్‌లోకి పీడీఎఫ్‌/టెక్స్ట్‌ ఫైల్‌గా పంపుకోవచ్చు. 

థర్డ్ పార్టీ రికవరీ యాప్స్ వాడవచ్చా?

ప్లే స్టోర్‌లో వాట్సాప్‌ యాప్‌ డిలీట్‌ రికవరీ పేరిట అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటువంటి అన్‌ వెరిఫైడ్ థర్డ్ పార్టీ యాప్స్‌ ఇన్‌స్టాల్ చేయడం పర్సనల్‌ డేటాకు అత్యంత ప్రమాదకరం. ఇవి మీ నోటిఫికేషన్‌లు, కాంటాక్ట్‌లు, ఓటీపీలను యాక్సెస్‌ చేసే అవకాశం ఉన్నందున, ఫోన్‌ ఇన్‌ బిల్డ్‌ సెట్టింగ్స్‌ లేదా అధికారిక క్లౌడ్‌ బ్యాకప్‌లను మాత్రమే ఉపయోగించడం మంచిది. 

Frequently Asked Questions

వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను తిరిగి చూడటం సాధ్యమేనా?

అవును, డిలీట్ అయిన వాట్సాప్‌ మెసేజ్‌లను తిరిగి చూడటం లేదా రికవరీ చేయడం సాధ్యమే. దీని కోసం ఆండ్రాయిడ్‌ నోటిఫికేషన్‌ హిస్టరీ, క్లౌడ్‌ బ్యాకప్‌ వంటి పద్ధతులు ఉన్నాయి.

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో డిలీట్ అయిన వాట్సాప్‌ మెసేజ్‌లను ఎలా చూడవచ్చు?

ఆండ్రాయిడ్‌ 11+ వెర్షన్‌లలో, ఫోన్ సెట్టింగ్స్‌లోని నోటిఫికేషన్‌ హిస్టరీని ఆన్ చేయడం ద్వారా డిలీట్ అయిన మెసేజ్‌ల ప్రివ్యూలను చూడవచ్చు. దీనికి థర్డ్‌ పార్టీ యాప్స్‌ అవసరం లేదు.

గూగుల్‌ డ్రైవ్‌ లేదా ఐక్లౌడ్‌ బ్యాకప్‌ ద్వారా వాట్సాప్‌ చాట్‌లను ఎలా పునరుద్ధరించాలి?

వాట్సాప్‌లో బ్యాకప్‌ ఆన్‌లో ఉంటే, అన్‌ఇన్‌స్టాల్‌ చేసి, తిరిగి ఇన్‌స్టాల్‌ చేయండి. లాగిన్‌ అయిన తర్వాత

గూగుల్‌ డ్రైవ్‌ బ్యాకప్‌ లేనప్పుడు లోకల్‌ డేటాబేస్‌ ద్వారా చాట్‌లను ఎలా రికవర్ చేయాలి?

ఫైల్ మేనేజర్‌లో డేటాబేస్‌ల ఫోల్డర్‌లోని సరైన బ్యాకప్‌ ఫైల్‌ను రీనేమ్‌ చేయండి. వాట్సాప్‌ను తిరిగి ఇన్‌స్టాల్‌ చేసి వెరిఫై చేస్తే లోకల్‌ ఫైల్‌ ద్వారా చాట్‌లు రికవరీ అవుతాయి.

డిలీట్ అయిన వాట్సాప్‌ మెసేజ్‌ల కోసం థర్డ్‌ పార్టీ రికవరీ యాప్స్‌ను ఉపయోగించడం సురక్షితమేనా?

కాదు, అన్‌ వెరిఫైడ్ థర్డ్‌ పార్టీ యాప్స్‌ను ఉపయోగించడం వ్యక్తిగత డేటాకు ప్రమాదకరం. అవి మీ నోటిఫికేషన్లు, కాంటాక్టులు, OTPలను యాక్సెస్‌ చేసే అవకాశం ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Embed widget