అన్వేషించండి

14 Lokas Mystery: అధ:పాతాళానికి దిగజారిపోతున్నావ్ అంటే ఏంటి- ఆలోచనకు పాతాళానికి ఏంటి సంబంధం!

14 Lokas Mystery in Telugu: పాదాల నుంచి తల వరకూ మానవ శరీర నిర్మాణం మొత్తం అద్భుతమనే చెప్పాలి. ముఖ్యంగా 14 లోకాలకు శరీర నిర్మాణానికి ఏంటి సంబంధం? ఓ వ్యక్తి ఆలోచనలను పాతాళంతో ఎందుకు పోల్చుతారు?

How To See God 14 lokas in Human:  ఆలోచన ఎంత ఉన్నతంగా ఉంటే విజయానికి అంత చేరువలో ఉన్నట్టే అని చెబుతారు పెద్దలు. అందుకే చెడు ఆలోచనలు చేస్తున్నవారిని ఓ మాట అంటుంటారు.. రోజురోజుకీ దిగజారిపోతున్నావని , అధ:పాతాళంలో పడిపోతున్నావని అంటారు. ఇంతకీ ఆలోచనకు  పాతాళానికి ఏంటి సంబంధం? మనకున్న 14 లోకాల్లో ఆలోచనను పాతాళంతో పోలిస్తే మరి మిగిలిన లోకాలను దేనితో పోల్చాలి? అసలు మానవ శరీర నిర్మాణంలోనే 14 లోకాలు ఉన్నాయని మీకు తెలుసా?

14 లోకాలు అనే మాట వినే ఉంటారు

  • భూలోకానికి పైన 6 లోకాలుంటాయి వీటినే ఊర్థ్వలోకాలు అంటారు
  • భూలోకానికి కింద 7 లోకాలుంటాయి వీటినే అధోలోకాలు అంటారు

 
భూలోకంతో సహా పైన ఉన్న లోకాలు (ఊర్ధ్వ లోకాలు) 
1.భూలోకం
2.భువర్లోకం
3.సువర్ణలోకం అంటే స్వర్గం
4.మహార్లోకం
5.జనోలోకం
6.తపోలోకం
7.సత్య లోకం (మోక్ష దశ పుట్టుక మరణం లేని దశ అదే బ్రహ్మ దశ )

Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు

భూలోకానికి కింద ఉన్న లోకాలు (అధోలోకాలు) 
1.అతల
2.సుతల ( బలి చక్రవర్తి చోటు)
3.వితల: శివుడు అంశం
4.తలాతల: మయుడు ఉండే చోటు
5.మహాతల: నాగులు ఉండే చోటు (నాగలోకం)
6.రసాతల: రాక్షసులు ఉండే చోటు
7.పాతాళం: వాసుకి ఉండే చోటు

Also Read: ఏడాదిలో 4 పూర్ణిమలు ప్రత్యేకం - అందులో మాఘ పౌర్ణమి మరింత విశిష్టమైనది!
 
ఈ లోకాలకు మావన శరీరానికి లింకేంటి?

శరీరంలో మూలాధారం నుంచి పైకి...ఆరు చక్రాలుంటాయి. ఈ చక్రాలే ఊర్థ్వలోకాలకు సంకేతం అని చెబుతారు. 
1. మూలాధారం ( భూలోకం)
వెన్నుపూస అంత్య భాగంలో ఉంటుంది. ధారణశక్తి కి కేంద్రస్థానం ఇది. ఇదే మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి తొలిమెట్టు

2. స్వాధిష్టానం (భువర్లోకం)
బొడ్డు క్రింద, జననేంద్రియాల వద్ద ఉంటుంది. వివేకం దీని లక్షణం.

3. మణిపూరం (సువర్ణలోకం)
నాభిలో ఉంటుంది. సంకల్పశక్తికి కేంద్రస్థానం ఇది

4. అనాహతం (మహార్లోకం)
హృదయం దగ్గర ఉంటుంది.  పరోక్ష జ్ఞానానికి స్థానం

5. విశుద్ధం (జనోలోకం)
కంఠంలో ఉంటుంది. దివ్యప్రేమ/ దైవం పట్ల ప్రేమకు స్థానం 

6. ఆజ్ఞ (తపోలోకం
కనుబొమ్మల మధ్యన ఉంటుంది. దీన్నే మూడవ నేత్రం అంటారు. దివ్య దృష్టికి కేంద్రస్థానం.

7. సహస్రారం (సత్య లోకం)
తలమీద ఉంటుంది. ఆత్మజ్ఞానానికి, దైవానికి స్థానం.

 Also Read: పంచభూత శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి- శివరాత్రి సందర్భంగా ప్లాన్ చేసుకుంటున్నారా!

మూలా ధారానికి దిగువన కూడా ఏడు చక్రాలున్నాయని చెబుతారు -ఇవే శరీరంలో ఉండే అధోలోకాలంటారు

1. అతల 
శరీరంలో అగాధ ప్రాంతానికి చెందిన చక్రమిది. తుంటి భాగంలో ఉంటుంది. భయం, కామం దీని లక్షణం

2. వితల
నీరసించడం లక్షణంగా కలిగిన చక్రమిది. ఇక్కడ సుఖం ఉండదు, విపరీతమైన కోపం ఉంటుంది. తొడల భాగంలో ఈ చక్రం ఉంటుంది.

3. సుతల
బాగా లోతైన అనే అర్దంలో చెప్పే చక్రం ఇది. అసూయ దీని లక్షణం.

4. తలాతలం
అంధకారం, తామసికం దీని లక్షణం. పిక్కల్లో ఉంటుంది. క్రింది స్థాయి చక్రం ఇది. గందరగోళం, అస్పష్టమైన ఆలోచనలకు, అమితమైన మొండి తనానికి ఇది స్థానం.

5. రసాతల
కాలిచీలమండల ప్రాంతంలో ఉండే చక్రం. స్వార్ధపరత్వం, ఆధిపత్య ధోరణి, కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండడం దీని లక్షణo

6. మహాతల
అవివేకం దీని లక్షణం. పాదాల్లో ఉంటుంది.

7. పాతాళం
కాకోలం అనే నల్లని విషం ఉండే ప్రాంతం. పతనమైన, లేదా పాపిష్టి పనులకు మూలం ఇది. దుర్బుద్ధి, దుష్టభావాలకు నిలయం. అరికాలులో ఉంటుంది. 

Also Read: మీరు చేసే కర్మలకు ఫలితం మీరు ఎప్పుడు అనుభవిస్తారో తెలుసా!

లోకాలు-చక్రాలు-శరీర నిర్మాణం...వీటిగురించి ఇప్పుడీ క్లాస్ అవసరమా అనుకోవచ్చు...అయితే మనిషి ఎదుగుదల అయినా, ఆలోచన అయినా  ఊర్థ్వముఖంగా ఉండాలి కానీ దిగువ ముఖంగా ఉండరాదు. అప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అర్థం.  పాతాళ లోకాల చక్రాల గురించి ప్రస్తావించిన విషయాలను పరిగణలోకి తీసుకుని ఆ దుర్గుణాలను దూరం చేసుకుంటే మనిషిగా మీరు విజయం సాధించినట్టే...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Google Pay Laddoos: గూగుల్ పే ‘లడ్డూ’ ఆఫర్ - రూ.1001 వరకు క్యాష్‌బ్యాక్ - ఇలా చేస్తే చాలు!
గూగుల్ పే ‘లడ్డూ’ ఆఫర్ - రూ.1001 వరకు క్యాష్‌బ్యాక్ - ఇలా చేస్తే చాలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Parvathipuram Elephants Hulchul | భవన నిర్మాణ కార్మికులను వణికించిన ఏనుగులు | ABP DesamKappatralla Uranium News | రోడ్డుపై బైఠాయించిన కప్పట్రాళ్ల గ్రామస్థులు | ABP DesamHamas Leader Killed In Israel Attack | హమాస్ కీలక నేతను మట్టుబెట్టిన ఇజ్రాయేల్ | ABP Desamమహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Google Pay Laddoos: గూగుల్ పే ‘లడ్డూ’ ఆఫర్ - రూ.1001 వరకు క్యాష్‌బ్యాక్ - ఇలా చేస్తే చాలు!
గూగుల్ పే ‘లడ్డూ’ ఆఫర్ - రూ.1001 వరకు క్యాష్‌బ్యాక్ - ఇలా చేస్తే చాలు!
Upcoming Cars Bikes in November: నవంబర్‌లో లాంచ్ కానున్న కార్లు, బైక్‌లు ఇవే - రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి స్కోడా కైలాక్ వరకు!
నవంబర్‌లో లాంచ్ కానున్న కార్లు, బైక్‌లు ఇవే - రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి స్కోడా కైలాక్ వరకు!
Caste Census Meeting: బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
TGSRTC: కార్తీక మాసం వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - ప్రధాన దేవాలయాలకు ప్రత్యేక బస్సులు, పూర్తి వివరాలివే!
కార్తీక మాసం వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - ప్రధాన దేవాలయాలకు ప్రత్యేక బస్సులు, పూర్తి వివరాలివే!
SearchGPT: గూగుల్, మైక్రోసాఫ్ట్ షేర్ ధరలు పడేసిన ఛాట్‌జీపీటీ - ఒక్క నిర్ణయంతో అల్లకల్లోలం!
గూగుల్, మైక్రోసాఫ్ట్ షేర్ ధరలు పడేసిన ఛాట్‌జీపీటీ - ఒక్క నిర్ణయంతో అల్లకల్లోలం!
Embed widget