అన్వేషించండి

YSRCP MLAs Disqualification: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత హెచ్చరికలు - బెదిరింపులేనా.. నిజంగా వేటు వేస్తారా?

YCP MLAs : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరీ, దీనిపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

Disqualifying YCP MLAs:   భారత రాజ్యాంగంలోని  ఆర్టికల్ 190(4)  ప్రకారం, ఒక శాసనసభ సభ్యుడు సభ అనుమతి లేకుండా వరుసగా  60  పని దినాల  పాటు  సమావేశాలకు గైర్హాజరైతే, సభ ఆ సభ్యుడి సీటును ఖాళీగా ప్రకటించవచ్చు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇదే నిబంధనను ప్రస్తావిస్తూ, వైసీపీ ఎమ్మెల్యేలు పూర్తిగా హాజరు కావడంలేదని వారిపై చర్యల విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో కొంత మంది అటెండెన్స్ కోసం రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి.. లోపలికి రాకపోవడంతో..  ఇప్పటికే ఏఐ ఆధారిత కెమెరాల ద్వారా డిజిటల్ అటెండెన్స్ ప్రవేశపెట్టారు. 

సభకు రాకుండా జీతాలు తీసుకోవడాన్ని ప్రశ్నిస్తున్న స్పీకర్ 

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరని, అందుకే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని వారు వాదిస్తున్నారు.  స్పీకర్ దృష్టిలో ఇది రాజ్యాంగ విధిని విస్మరించడమే. సభ్యులు సంతకాలు చేసి సభలోకి రాకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నరాు.  సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఈ వ్యవహారంపై స్పందించారు.  రాజ్యాంగ పరిధిలో ఉంటే ఏ నిర్ణయానికైనా సిద్ధమని, కానీ కక్షసాధింపు చర్యలకు దిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. 60 రోజుల లెక్కింపులో సభ వాయిదా పడిన  లేదా ప్రోరోగ్ అయిన రోజులను మినహాయించాల్సి ఉంటుంది. ఈ సాంకేతిక అంశాలను వైసీపీ ఆయుధంగా చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం గనక వేటు వేస్తే న్యాయపోరాటం చేయాలని అనుకుంటున్నారు. 

ప్రభుత్వం ధైర్యం చేస్తుందా?  

వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం అనేది కూటమి ప్రభుత్వానికి రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఒకవేళ 11 మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తే, ఆ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయి. ఇది ప్రభుత్వంపై ఆర్థిక భారం కావడమే కాకుండా, వైసీపీకి సానుభూతి పవనాలు వీచే అవకాశం ఇస్తుందని కొందరు విశ్లేషకుల అభిప్రాయం.  ప్రజాప్రతినిధులు బాధ్యతారాహిత్యంగా ఉంటే సహించేది లేదు అనే గట్టి సందేశాన్ని ప్రజల్లోకి పంపడానికి ప్రభుత్వం ఈ సాహసం చేసే అవకాశం లేకపోలేదన్న చర్చ నడుస్తోంది. అసెంబ్లీకి వెళ్లకపోవడాన్ని ప్రజలు కూడా సమర్థించరని అంటున్నారు. 

 నో వర్క్ - నో పే  నినాదం 

స్పీకర్ కేవలం అనర్హత గురించి మాత్రమే కాకుండా,  పని చేయని వారికి జీతం లేదు  అనే విధానాన్ని కూడా తెరపైకి తెచ్చారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల జీతభత్యాల్లో కోత విధించాలని ఆయన లోక్‌సభ స్పీకర్‌కు కూడా లేఖ రాయాలని భావిస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీస్తోంది. ప్రజాప్రతినిధుల జవాబుదారీతనంపై వస్తున్న ఈ ప్రతిపాదనలకు ప్రజల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. అనర్హత  వేటు విషయంలో స్పీకర్ నిర్ణయమే అంతిమమైనప్పటికీ, అది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. ప్రభుత్వం నిజంగానే వైసీపీ ఎమ్మెల్యేలను ఇంటికి పంపాలని నిశ్చయించుకుంటే, రాజ్యాంగపరమైన లొసుగులు లేకుండా పక్కాగా అడుగులు వేయాల్సి ఉంటుంది. మరోవైపు వైసీపీ కూడా తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది.  

టాప్ హెడ్ లైన్స్

Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Cockroach Janata Party: విపక్షంలో ఎజెండా సెట్టర్‌గా కాక్రోచ్ జనతా పార్టీ - అసలు పొలిటికల్ గేమ్ ఎవరిది?
విపక్షంలో ఎజెండా సెట్టర్‌గా కాక్రోచ్ జనతా పార్టీ - అసలు పొలిటికల్ గేమ్ ఎవరిది?
AP Local Elections TDP Janasena Seat Sharing: స్థానిక ఎన్నికల్లో బాబు-పవన్ పొత్తు - అగ్రనేతల లెక్కలు ఓకే.. మరి క్షేత్రస్థాయి కేడర్ సమన్వయం సాధ్యమేనా?
స్థానిక ఎన్నికల్లో బాబు-పవన్ పొత్తు - అగ్రనేతల లెక్కలు ఓకే.. మరి క్షేత్రస్థాయి కేడర్ సమన్వయం సాధ్యమేనా?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Bhuvi Comeback Masterstroke: అగార్కర్ నిష్క్రమణతో మారిన స‌మీక‌ర‌ణాలు.. నాలుగేళ్ల తర్వాత భువీ రీ ఎంట్రీ, ఆర్పీ సింగ్ పట్టుదలతో కివీస్ టూర్‌కు ఎంపిక
అగార్కర్ నిష్క్రమణతో మారిన స‌మీక‌ర‌ణాలు.. నాలుగేళ్ల తర్వాత భువీ రీ ఎంట్రీ, ఆర్పీ సింగ్ పట్టుదలతో కివీస్ టూర్‌కు ఎంపిక
350cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 లాంచ్.. 5 రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో అదుర్స్!
యూత్‌ కోసం ట్రయంఫ్ బొన్నెవిల్ T40 వచ్చేసింది.. ఈ బైక్‌లో చాలా స్పెషల్స్ గురూ!
Hyderabad Elevated Corridor: కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
Kidney Disease : కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
Embed widget