అన్వేషించండి

Tamil Nadu Assembly Elections 2026: విజయ్‌పై సీబీఐ ఉచ్చు - బీజేపీ వ్యూహాలకు దళపతి చిక్కుతారా?

TvK Vijay: తమిళనాడు రాజకీయాల్లో విజయ్ప్ర స్తుతం ఊహించని చిక్కుల్లో పడుతున్నారు. కరూర్ తొక్కిసలాట కేసులో సీబీఐ దూకుడు ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి.

BJP is sending strong warnings to TVK Vijay:  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, విజయ్ రాజకీయ ప్రయాణం ముళ్లబాటగా మారుతోంది. గతేడాది కరూర్‌లో జరిగిన పార్టీ ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది మృతి  కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ  విచారిస్తోంది. ఈ కేసులో భాగంగా ఇప్పటికే విజయ్‌ను ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో  మూడు సార్లు గంటల తరబడి విచారించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామం విజయ్‌ను రాజకీయంగా ఆత్మరక్షణలో పడేసిందనే వాదన వినిపిస్తోంది.

రాష్ట్ర పరిధి దాటిన వివాదం                           

సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగితే రాష్ట్ర పోలీసులు విచారణ జరుపుతారు. అప్పుడు అధికార డీఎంకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, దానిని  రాజకీయ కక్ష సాధింపుగా విజయ్ అభివర్ణించే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు విచారణ కేంద్ర సంస్థ అయిన సీబీఐ చేతుల్లో ఉండటంతో విజయ్‌కు ఆ వెసులుబాటు లేకుండా పోయింది. సీబీఐ విచారణ అంటే అది నేరుగా కేంద్రంలోని బీజేపీ నియంత్రణలో ఉంటుందనేది బహిరంగ రహస్యం. దీనివల్ల విజయ్ ఇప్పుడు అటు డీఎంకేను, ఇటు బీజేపీని ఒకేసారి ఎదుర్కోవాల్సిన క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. 

బీజేపీ మైండ్ గేమ్                        

విజయ్ తన పార్టీని స్థాపించినప్పటి నుండి  ఒంటరి పోరు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. అయితే, సీబీఐ కేసుల ద్వారా బీజేపీ ఆయనపై ఒత్తిడి తెస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్‌ను ఎన్డీయే కూటమిలోకి తీసుకురావడానికి బీజేపీ ఈ కేసులను అస్త్రంగా వాడుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ విజయ్ బీజేపీకి అనుకూలంగా మారకపోతే, ఈ విచారణలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆయన సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు.  కేవలం సీబీఐ కేసులే కాకుండా, పాత ఇన్‌కమ్ టాక్స్  కేసులకు సంబంధించి మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సుమారు రూ. 15 కోట్ల అదనపు ఆదాయంపై పన్నులు, జరిమానాలు చెల్లించాలనే పాత వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. రాజకీయ పార్టీ నడపడానికి భారీగా నిధులు అవసరమైన తరుణంలో, ఇలాంటి ఆర్థిక పరమైన చిక్కులు అభ్యర్థుల ఎంపికపై,  ప్రచార ఖర్చులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇది విజయ్ పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తోంది.

 విజయ్ ముందున్న దారులు 

ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్ ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి, కేసులను ఎదుర్కొంటూ  బాధితుడు  కార్డును వాడి ప్రజల్లో సానుభూతి పొందడం. రెండు, బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని కేసుల నుండి ఉపశమనం పొందడం. అయితే, రెండో దారిని ఎంచుకుంటే తమిళనాడులో ఆయనకున్న   అస్తిత్వం దెబ్బతింటుంది. డీఎంకే ఇప్పటికే విజయ్‌ను బీజేపీ బినామీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యూహ ప్రతివ్యూహాల మధ్య విజయ్ తన రాజకీయ ఉనికిని ఎలా కాపాడుకుంటారో చూడాలి.        

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget