అన్వేషించండి

Nara Lokesh: నారా లోకేష్ మంగళగిరి మోడల్ - టీడీపీ ఎమ్మెల్యేలకు ఆదర్శమా? అందని ద్రాక్షా?

TDP MLAS: భారీమెజార్టీ ఉన్న టీడీపీలో ఎమ్మెల్యేల పనితీరు నాసిరకంగా ఉంది. నారా లోకేష్ ఓ స్టాండర్ట్ సెట్ చేస్తున్నా ఆయనను ఫాలో చేయలేకపోతున్నారు ఎమ్మెల్యేలు.

MLAs who do not follow Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువనేత, మంత్రి నారా లోకేష్ తన పనితీరుతో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి రికార్డు మెజారిటీతో విజయం సాధించిన తర్వాత, నియోజకవర్గ అభివృద్ధి , ప్రజా సంక్షేమం విషయంలో ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే, లోకేష్ సృష్టిస్తున్న ఈ  స్టాండర్డ్ ను అందుకోవడంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం వెనుకబడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

నియోజకవర్గంలో పక్కా వ్యవస్థ 

నారా లోకేష్ మంగళగిరిలో కేవలం ఒక ఎమ్మెల్యేగా కాకుండా, ఒక వ్యవస్థగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మంత్రిగా రాష్ట్రస్థాయి బాధ్యతల్లో అత్యంత బిజీగా ఉన్నప్పటికీ, తన నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అటు ఐటీ, విద్యాశాఖల మంత్రిగా సచివాలయంలో ఫైళ్లను క్లియర్ చేస్తూనే, ఇటు మంగళగిరిలోని పాఠశాలలకు ఆకస్మిక తనిఖీలకు వెళ్లడం, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయడం వంటి చర్యల ద్వారా గ్రౌండ్ లెవల్‌లో బలమైన ముద్ర వేస్తున్నారు. పర్యటనల్లో ప్రోటోకాల్ ఆడంబరాలు లేకుండా సామాన్యుడిలా ప్రజల మధ్యకు వెళ్లడం ఆయన పనితీరులోని ప్రత్యేకత.

ఎమ్మెల్యేల లైట్  వైఖరి - వివాదాల పరంపర 

లోకేష్ తనను తాను ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుకుంటున్న తరుణంలో, టీడీపీలోని చాలామంది ఎమ్మెల్యేలు మాత్రం పాత ధోరణిలోనే సాగుతున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కంటే వ్యక్తిగత ఆధిపత్యం, స్థానిక వివాదాలు మరియు కాంట్రాక్టుల చుట్టూ కొందరు నేతలు తిరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. లోకేష్ తరహాలో టెక్నాలజీని వాడుకోవడం లేదా సోషల్ మీడియా ద్వారా ప్రజలతో నిరంతరం టచ్‌లో ఉండటం వంటి అంశాలను వీరు  లైట్ తీసుకుంటున్నారు. ఫలితంగా, కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా, ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు.

హైకమాండ్ మౌనం - వ్యూహాత్మకమా?

లోకేష్ పనితీరును అందరూ అనుసరించాలని టీడీపీ హైకమాండ్ బహిరంగంగా ఆదేశాలు ఇస్తున్నట్లు కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలను మోటివేట్ చేయడంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదనే విశ్లేషణలు వస్తున్నాయి. బహుశా సీనియర్ ఎమ్మెల్యేల పనితీరును ఒక్కసారిగా మార్చడం సాధ్యం కాదన్న ఉద్దేశంతో అధిష్టానం ఉందేమో కానీ, లోకేష్ సాధిస్తున్న ఫలితాలను చూసైనా నేతలు మారాలన్న ఒత్తిడి క్యాడర్ నుంచి పెరుగుతోంది. లోకేష్ తన శాఖల్లో చూపిస్తున్న వేగాన్ని పార్టీ యంత్రాంగం మొత్తం అందిపుచ్చుకోలేకపోవడం ఒక లోపంగా కనిపిస్తోంది.
 
ప్రజాబలం vs వ్యక్తిగత ఇమేజ్ 

రాజకీయాల్లో ఇప్పుడు వ్యక్తిగత ఇమేజ్ కంటే ప్రజాబలం ముఖ్యం. లోకేష్ తన ఇమేజ్‌ను మంగళగిరిలో చేసిన సేవా కార్యక్రమాల ద్వారా  పెంచుకున్నారు. కానీ, చాలామంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కేవలం ఎన్నికల సమయంలోనే కనిపిస్తారన్న ముద్రను చెరిపేసుకోలేకపోతున్నారు. లోకేష్ సెట్ చేసిన స్టాండర్డ్స్ ఒక రకంగా టీడీపీ నేతలకు సవాల్‌గా మారాయి. ఆయన వేగాన్ని తట్టుకుని నిలబడాలంటే, ఎమ్మెల్యేలు తమ పనితీరును సమూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  నారా లోకేష్ ఇప్పుడు 'నెక్స్ట్ జనరేషన్' లీడర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. కేవలం లోకేష్ ఒక్కరు కష్టపడితే సరిపోదని, పార్టీలోని ఎమ్మెల్యేలందరూ అదే స్థాయిలో కష్టపడితేనే 2029 ఎన్నికల నాటికి టీడీపీ మళ్ళీ తిరుగులేని శక్తిగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి లోకేష్‌ను చూసి ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడు చక్కబడతారో వేచి చూడాలి. 


 

 

టాప్ హెడ్ లైన్స్

Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Embed widget