అన్వేషించండి
Water Proof Mobiles in Budget : వాటర్‌ప్రూఫ్ స్మార్ట్ ఫోన్లు.. 20 వేల కంటే తక్కువ బడ్జెట్లో, బెస్ట్ ఫీచర్స్ కూడా
Water Proof Mobiles : బడ్జెట్లో వాటర్‌ప్రూఫ్ మొబైల్స్ కావాలనుకుంటున్నారా? వర్షాకాలంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎలాంటి ఫోన్స్ బెస్టో ఇప్పుడు చూసేద్దాం.
ఈ ఫోన్లు నీటిలో పడినా పాడవవు (Image Source : Envato)
1/5

కొత్తగా విడుదలైన Oppo K13 వాటర్‌ప్రూఫ్ ఫోన్ కోసం ఎదురుచూసే వారికి మంచి ఎంపిక. దీని ధర 17,999 రూపాయలు. ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చే 7000mAh పెద్ద బ్యాటరీ ఉంది. 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. Qualcomm Snapdragon 6 Gen 4 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. దీనితో పాటు 8GB RAM మద్దతు ఉంది.
2/5

Moto G86 Power కూడా మంచి ఆప్షనే. ఇది16,999లకు అందుబాటులో ఉంది. 6720mAh బ్యాటరీని కలిగి ఉంది. ఎక్కువ కాలం బ్యాకప్ ఇస్తుంది. 6.7-అంగుళాల FHD+ p-OLED డిస్ప్లే ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. MediaTek Dimensity 7400 చిప్సెట్, 8GB RAMతో వస్తుంది. వర్షాకాలంలో ఇది మంచి ఎంపిక అవుతుంది.
3/5

Realme P3 16499కు అందుబాటులో ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసి.. 6000mAh బ్యాటరీతో వస్తుంది. 6.67-inch FHD+ AMOLED డిస్ప్లేతో పాటు.. Qualcomm Snapdragon 6 Gen 4 ప్రాసెసర్‌తో వచ్చింది. 8GB వరకు RAM ఆప్షన్‌తో వస్తుంది. బ్యాటరీ, పర్ఫార్మెన్స్పై మంచి రివ్యూలే ఉన్నాయి.
4/5

తాజాగా విడుదలైన iQOO Z10R కూడా 20 వేలలోపే అందుబాటులో ఉంది. 19,499 రూపాయలకు వచ్చేస్తుంది. 5700mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. 6.77-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. MediaTek Dimensity 7400 ప్రాసెసర్, 8GB RAMతో వస్తుంది. పనితీరు అద్భుతంగా ఉంటుంది.
5/5

Xiaomi Redmi Note 14 5G కూడా ఈ జాబితాలో ఉంది. 16,999 రూపాయల ధర కలిగిన ఈ ఫోన్ 5110mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. MediaTek Dimensity 7020 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. 6GB RAMతో రోజువారీ వినియోగానికి, మల్టీ టాస్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.
Published at : 18 Aug 2025 09:15 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆట
ఆధ్యాత్మికం
శుభసమయం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















