అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pekamedalu Movie: జూలైలో పేకమేడలు... సీతక్క చేతుల మీదుగా 'బూమ్ బూమ్ లచ్చన్న' విడుదల
Telangana Minister Seethakka: తెలంగాణ మంత్రి సీతక్క చేతుల మీదుగా 'పేకమేడలు' సినిమా నుంచి 'భూమ్ భూమ్ లచ్చన్న' సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా జూలైలో సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
![Telangana Minister Seethakka: తెలంగాణ మంత్రి సీతక్క చేతుల మీదుగా 'పేకమేడలు' సినిమా నుంచి 'భూమ్ భూమ్ లచ్చన్న' సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా జూలైలో సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/cbdee8cf6d60891149f8a4867bca2ed61719147102187313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'పేకమేడలు' సాంగ్ విడుదల చేసిన సీతక్క... సినిమా హీరో హీరోయిన్లు అనూష కృష్ణ, వినోద్ కిషన్
1/6
!['నా పేరు శివ', 'అంధగారం' వంటి కోలీవుడ్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన నటుడు వినోద్ కిషన్. ఇప్పుడు ఆయన హీరోగా తెలుగులో ఓ సినిమా రూపొందుతోంది. 'ఎవరికీ చెప్పొద్దు' సినిమాతో విజయాన్ని అందుకున్న క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. 'ఎవరికీ చెప్పొద్దు' హీరో, 'బాహుబలి'తో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రే దీనికి నిర్మాత.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/3d400914206617025e01f7528b64ac851992b.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'నా పేరు శివ', 'అంధగారం' వంటి కోలీవుడ్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన నటుడు వినోద్ కిషన్. ఇప్పుడు ఆయన హీరోగా తెలుగులో ఓ సినిమా రూపొందుతోంది. 'ఎవరికీ చెప్పొద్దు' సినిమాతో విజయాన్ని అందుకున్న క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. 'ఎవరికీ చెప్పొద్దు' హీరో, 'బాహుబలి'తో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రే దీనికి నిర్మాత.
2/6
![వినోద్ కిషన్ సరసన అనూష కృష్ణ కథానాయికగా నటిస్తున్న 'పేకమేడలు' సినిమా టీజర్ కొన్ని రోజుల క్రితం విశ్వక్ సేన్ చేతుల మీదుగా విడుదలైంది. దానికి మంచి స్పందన లభించింది. ఇప్పుడు తెలంగాణ మంత్రి సీతక్క చేతుల మీదుగా ఈ సినిమాలో 'భూమ్ భూమ్ లచ్చన్న' సాంగ్ విడుదల చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/fde5e76eb5029515700037740162f7017cf53.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
వినోద్ కిషన్ సరసన అనూష కృష్ణ కథానాయికగా నటిస్తున్న 'పేకమేడలు' సినిమా టీజర్ కొన్ని రోజుల క్రితం విశ్వక్ సేన్ చేతుల మీదుగా విడుదలైంది. దానికి మంచి స్పందన లభించింది. ఇప్పుడు తెలంగాణ మంత్రి సీతక్క చేతుల మీదుగా ఈ సినిమాలో 'భూమ్ భూమ్ లచ్చన్న' సాంగ్ విడుదల చేశారు.
3/6
!['భూమ్ భూమ్ లచ్చన్న...' పాటను ప్రముఖ గాయకుడు మనో ఆలపించారు. 'లక్కు నీ వెంట కుక్క తోక లెక్క ఊపుకుంటూ వచ్చరో లచ్చన్న...' అంటూ సాగే ఈ పాటను భార్గవ్ కార్తీక్ రాయగా... స్మరణ్ సాయి బాణీ అందించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/3cb45a52c72efe75fe9856f9b598b7a5830d5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'భూమ్ భూమ్ లచ్చన్న...' పాటను ప్రముఖ గాయకుడు మనో ఆలపించారు. 'లక్కు నీ వెంట కుక్క తోక లెక్క ఊపుకుంటూ వచ్చరో లచ్చన్న...' అంటూ సాగే ఈ పాటను భార్గవ్ కార్తీక్ రాయగా... స్మరణ్ సాయి బాణీ అందించారు.
4/6
![''వినోదాత్మకంగా 'భూమ్ భూమ్ లచ్చన్న' పాటను తెరకెక్కించాం. మంచి కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న కథతో సినిమా రూపొందింది. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చిత్ర బృందం పేర్కొంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/5e7718c582f49ef32ba74174d7254d9a5b46a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
''వినోదాత్మకంగా 'భూమ్ భూమ్ లచ్చన్న' పాటను తెరకెక్కించాం. మంచి కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న కథతో సినిమా రూపొందింది. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చిత్ర బృందం పేర్కొంది.
5/6
![వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటిస్తున్న 'పేకమేడలు' సినిమాలో రితికా శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూషా నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ ఇతర ప్రధాన తారాగణం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/855743dc21628102f8b6131758ff0b236d054.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటిస్తున్న 'పేకమేడలు' సినిమాలో రితికా శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూషా నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ ఇతర ప్రధాన తారాగణం.
6/6
![క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై మీద హీరో రాకేష్ వర్రే నిర్మిస్తున్న ఈ 'పేకమేడలు' చిత్రానికి నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. రచయిత కూడా ఆయనే. హరిచరణ్ కె. ఛాయాగ్రహణం అందిస్తుండగా... స్మరణ్ సాయి సంగీత బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/2e5cdad4e2fe5d1899f10ff7802cab629b1bd.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై మీద హీరో రాకేష్ వర్రే నిర్మిస్తున్న ఈ 'పేకమేడలు' చిత్రానికి నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. రచయిత కూడా ఆయనే. హరిచరణ్ కె. ఛాయాగ్రహణం అందిస్తుండగా... స్మరణ్ సాయి సంగీత బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Published at : 23 Jun 2024 06:23 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఇండియా
అమరావతి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement