అన్వేషించండి
Jr NTR: ఎన్టీఆర్‌ను చుట్టుముట్టిన ముంబై మీడియా... బాలీవుడ్ స్టార్లతో యంగ్ టైగర్ పార్టీ
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రజెంట్ ముంబైలో వున్నాడు. 'వార్ 2' కోస్టార్ హృతిక్ రోషన్, అతడి ప్రేయసి సాబా ఆజాద్... 'ఆర్ఆర్ఆర్' కోస్టార్ ఆలియా భట్, ఆమె భర్త రణబీర్ తో పార్టీ చేసుకున్నాడు.

ముంబైలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్, రణబీర్ కపూర్ పార్టీ
1/6

టాలీవుడ్ స్టార్ హీరో, 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ను తన ఫ్యాన్స్ చేసుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ముంబైలో వున్నాడు. తన భార్య ప్రణతీతో కలిసి ఆదివారం రాత్రి పార్టీకి వెళ్ళాడు. అప్పుడు అతడిని ముంబై పాపరాజీ మీడియా చుట్టుముట్టింది.
2/6

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి 'వార్ 2' సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఆదివారం రాత్రి వాళ్లిద్దరితో పాటు వాళ్ల పార్ట్నర్స్, ఇంకా రణబీర్ కపూర్, ఆలియా భట్ దంపతులు, ఫేమస్ బాలీవుడ్ డైరెక్టర్ & ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ పార్టీ చేసుకున్నారు.
3/6

పార్టీ తర్వాత రెస్టారెంట్ బయటకు ఎన్టీఆర్, ప్రణతి వచ్చినప్పుడు పాపరాజీ మీడియా వాళ్లను ఇలా చుట్టుముట్టింది. కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ముంబైలో వుంటున్నాడు. 'వార్ 2' షూటింగ్ చేస్తున్నాడు.
4/6

'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాలో సీత పాత్రలో హిందీ హీరోయిన్ ఆలియా భట్ యాక్ట్ చేసింది. ఆవిడ రామ్ చరణ్ పెయిర్. ఆ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ రోల్ చేశాడు. షూటింగ్ టైంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. రణబీర్ తో ఆలియా వీడియో ఫోన్ కాల్స్ గురించి ఓ ఈవెంట్ లో ఎన్టీఆర్ కామెడీ చేశాడు. సండే నైట్ పార్టీకి వాళ్లు కూడా అటెండ్ అయ్యారు.
5/6

హృతిక్ రోషన్ తో పాటు అతడి లవర్ సాబా ఆజాద్ సైతం వచ్చింది. ఆమెను జాగ్రత్తగా కార్ ఎక్కిస్తున్న హృతిక్.
6/6

'వార్ 2' సినిమా డైరెక్ట్ చేస్తున్న అయాన్ ముఖర్జీ. అతడు రణబీర్ కపూర్, ఆలియా భట్ దంపతులకు క్లోజ్ ఫ్రెండ్. 'బ్రహ్మాస్త్ర' సినిమాకూ అతడు డైరెక్షన్ చేశాడు. వీళ్లతో పాటు కరణ్ జోహార్ కూడా పార్టీలో వున్నాడు.
Published at : 29 Apr 2024 10:37 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion