అన్వేషించండి
Advertisement
Morning Top News: కేసీఆర్ ఫ్యామిలీపై కడియం విసుర్లు, వాసిరెడ్డి పద్మ రూట్ మారేనా? వంటి మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Todays Top 10 News:
మాజీ సీఎం ఫ్యామిలీపై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఫ్యామిలీపై మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో మాజీ మంత్రి కేటీర్ ఫ్యామిలీకి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పి పాదయాత్రకు వెళ్ళాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఆ నేతల వల్లే టీడీపీ-జనసేన మధ్య విభేదాలు..!
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం సాఫీగా సాగిపోతోంది. ఎక్కడా చిన్న వివాదం కూడా రాకుండా చంద్రబాబు,పవన్ ప్రతి నిర్ణయాన్ని చర్చించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం జనసేన, టీడీపీ క్యాడర్ మధ్య విభేదాలు వస్తున్నాయి. వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు పెరిగిపోయాయి. పై స్థాయితో పాటు కింది స్థాయిలోనూ చాలా మంది నేతలు జనసేనలో చేరిపోయారు. వీరంతా ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పని చేశారు. అయితే జనసేనలో చేరిన తర్వాత వారు కొన్ని నియోజకవర్గాల్లో చెలరేగిపోతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
చంద్రబాబు కీలక ప్రకటన
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏపీ భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక తెస్తున్నామని అన్నారు. 10 పాయింట్ల ప్రణాళికతో 2047 నాటికి అన్నింటా ముందుంటామని ధీమా వ్యక్తం చేశారు. మెట్రో రైల్, హైవేలు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు, అభివృద్ధి అంశాలపై విశాఖ కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో శనివారం సీఎం సమీక్ష నిర్వహించారు. జీరో పావర్టీ దిశగా ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. పరిశోధనలో మనమే నెంబర్ వన్ కావాలి. పీ 4 విధానంలో సంపద సృష్టిద్దాం.' అని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
జగన్ రాజకీయాలకు అవసరమా: చంద్రబాబు
జగన్ లాంటి వ్యక్తులు అసలు రాజకీయాలకు అవసరమా? అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. రుషికొండ భవనాలను పరిశీలించిన చంద్రబాబు.. జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాజులు కూడా ఇలాంటి భవనాలను కట్టుకోలేదని మండిపడ్డారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ఈ విలాసవంతమైన భవనాలు ఎందుకు ఉపయోగపడతాయో తనకే అర్థం కావడం లేదని చంద్రబాబు అన్నారు. రాజకీయ నేత ఇలాంటి తప్పులు చేస్తారని తాను ఊహించనే లేదన్నారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మెట్రో రైలు రెండో దశకు పరిపాలనా అనుమతులు
మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపట్టేందుకు అనుమతి లభించింది. ప్రభుత్వం జీవో 196ని జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రెండో దశ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.24,269 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.7,313 కోట్లు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్
శబరిమల యాత్రికులకు కేరళ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది మండలం-మకరవిలక్కు యాత్రా సీజన్‌లో శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునే యాత్రికులు అందరికీ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (TDB) రూ.5 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పించనుందని మంత్రి వీఎన్ వాసవన్ తెలిపారు. ఈ నెలాఖరులో మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
రాష్ట్రం పండుగగా సదర్ వేడుకలు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని యాదవ సోదరులకు శుభవార్త చెప్పింది. యాదవులు ఎంతో ఘనంగా నిర్వహించే సదర్ వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తించింది. సదర్ వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో యాదవులు సదర్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. యాదవ సోదరులు వేడుకగా నిర్వహించే పండుగను ఇక నుంచి రాష్ట్ర పండుగగా ప్రభుత్వం సదర్ వేడుకలు నిర్వహించనుంది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
వాసిరెడ్డి పద్మ రూట్ అటేనా?
ఏపీలో పైర్ బ్రాండ్ నాయకురాలిగా ఉన్న వాసిరెడ్డి పద్మ YCP ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసినా, ఆ తర్వాత కూడా రాని గుర్తింపు వైసీపీలో ఆమెకు వచ్చింది. జగన్ ఆమెను ఏకంగా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా నియమించారు. కానీ ఇప్పుడు పరిస్ధితి మారిపోయింది. ఇటీవలే ఆమె వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో వాసిరెడ్డి పద్మ అధికార కూటమిలోని టీడీపీలో చేరబోతున్నారనే చర్చ జరుగుతోంది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఏపీ టెట్ ఫలితాలు.. ఎప్పుడంటే?
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలు ఈ నెల 4వ తేదీన మంత్రి నారా లోకేశ్ రిలీజ్ చేయనున్నారు. OCT 3 నుంచి 21 వరకు రోజుకు రెండు విడతలుగా టెట్ నిర్వహించగా.. 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. దరఖాస్తు చేసిన 4,27,300 మంది అభ్యర్థుల్లో 86.28% మంది పరీక్ష రాశారు. కాగా, షెడ్యూల్ ప్రకారం ఈరోజే(శనివారం) టెట్ ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా.. ఫైనల్ ‘కీ’ ఆలస్యం కావడంతో వాయిదా పడ్డాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
చెలరేగిన టీమిండియా స్పిన్నర్లు
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 171/9 పరుగులు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్ బ్యాట్సమన్ విల్ యంగ్ 51 పరుగులతో రాణించగా, భారత్ బౌలర్లలో జడేజా 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు తీశారు. ఆకాశ్‌దీప్, వాషింగ్టన్‌లకు చెరో వికెట్ దక్కింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement