అన్వేషించండి

AP TET Results 2024: అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్

Andhra Pradesh TET Results 2024 | ఏపీ టెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. తుది కీలో జాప్యం కారణంగా ఏపీ టెట్ ఫలితాల ప్రకటన రెండు రోజులు వాయిదా వేశారు. నవంబర్ 4న టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి.

TET Results 2024 In Andhra Pradesh | అమరావతి: ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్. ఏపీ టెట్ ఫలితాల విడుదల నేడు వాయిదా పడింది. తొలుత చెప్పిన షెడ్యూల్ ప్రకారం ఏపీ టెట్ ఫలితాలు నవంబర్ 2న విడుదల కావాల్సి ఉంది. కానీ ఏపీ టెట్ ఫలితాలు నవంబర్ 4న విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024) ఫలితాలను మొదట నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం శనివారం (నవంబరు 2న) టెట్‌ ఫలితాలు విడుదల చేయాలి. అయితే తుది కీ (AP TET Key) లో జాప్యం జరిగింది. మరోవైపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలో ఉండటంతో నవంబర్ 4కు ఏపీ టెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. సోమవారం నాడు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఏపీ టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు.

ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటనపై ఉత్కంఠ
ఏపీ ప్రభుత్వం టెట్ ఫలితాలు విడుదల చేసిన రోజుల వ్యవధిలో అభ్యర్థులకు శుభవార్త చెప్పడానికి సిద్ధంగా ఉంది. నవంబర్ 6న మెగా డీఎస్సీ ప్రకటన చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. 16,347 పోస్టులతో ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ విడుదల చేస్తుందని అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. టెట్ ఫలితాలు వచ్చాయంటే.. డీఎస్సీనే తరువాయి అని, నోటిఫికేషన్ తరువాత ప్రిపరేషన్ కు కనీసం రెండు నెలల గడువు కావాలని అభ్యర్థులు కోరుతున్నారు. అయితే ఫిబ్రవరిలో ఏపీ ప్రభుత్వం డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది.

ఫలితాల కోసం ఏపీ టెట్ అధికారిక వెబ్ సైట్ లింక్ 

అక్టోబర్ నెలలో టెట్ పరీక్షలు, తుది కీ విడుదల

అక్టోబర్‌ 3 నుంచి 21వ తేదీ వరకు ఏపీ విద్యాశాఖ టెట్ పరీక్షలను నిర్వహించింది.  టెట్ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 3,68,661 మంది (86.28 శాతం అభ్యర్థులు) హాజరయ్యారు. మొత్తం 17 రోజులపాటు టెట్ ఎగ్జామ్స్ రెండు విడుతలుగా నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం రెస్పాన్స్‌ షీట్లు, ఫైనల్‌ కీ ఇదివరకే వెల్లడించింది. టెట్‌ స్కోర్‌కు లైఫ్ టైమ్ వాలిడిటీ ఉంటుంది. టీచర్ల నియామక పరీక్షలో దీనికి 20 శాతం వెయిటేజీ కూడా ఉండటంతో ఏపీ టెట్ జులై 2024 ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. జనరల్‌ అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

Also Read: Constable Jobs: కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ - ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన 

టెట్ ఫలితాలు విడుదలైన రెండు రోజుల్లోనే ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మెగా డీఎస్సీ ద్వారా భారీగా పోస్టులు భర్తీచేసే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. మొత్తం ఖాళీల్లో ప్రిన్సిపల్- 52 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్లు(SA)-7,725 పోస్టులు, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (SGT)-6,371 పోస్టులు, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(TGT)-1,781 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(PGT)-286 పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET)-132 పోస్టులను భర్తీ చేయనున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Embed widget