![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Constable Jobs: కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ - ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన
Andhra News: ఏపీలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ చివరి ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలిపింది.
![Constable Jobs: కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ - ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన ap police recruitment board key announcement on constable posts recruitment process has started Constable Jobs: కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్ - ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/01/c5fa0ed787541978834f889c178a43951730476991109876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Constable Recruitment Process Has Started: ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం చూస్తోన్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (Police Recruitment Board) ఇంఛార్జీ ఛైర్మన్ ఆకే రవికృష్ణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి వారంలో ఫిజికల్ టెస్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 91,507 మంది అభ్యర్థులు మాత్రమే ఫిజికల్ టెస్ట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారని.. ఇంకా అప్లై చేసుకోని అభ్యర్థులకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 11న సాయంత్రం 3 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ slrb.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
కాగా, గత ప్రభుత్వం 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022లో నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులకు గతేడాది జనవరిలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. మొత్తం 4,59,182 మంది ప్రిలిమ్స్ పరీక్షకు హాజరు కాగా.. 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అయితే, ప్రిలిమ్స్ అనంతరం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ కారణాలతో నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టింది. ఇటీవలే, దీనిపై హోమంత్రి వంగలపూడి అనిత సైతం సమీక్షించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)