కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబు
మంచు కుటుంబంలో ఆస్తి గొడవలు తారస్థాయికి చేరుకున్నాయి. మంచు మనోజ్...మోహన్ బాబు ఇంటికి వెళ్లడం, అక్కడ ఘర్షణ పడడం సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ఇంటి గేట్ వద్ద మనోజ్ నానా హంగామా చేశాడు. తన కూతురిని అప్పగించాలని గట్టిగా అరిచాడు. ఆ తరవాత మోహన్ బాబు బయటకు వచ్చారు. ఇంట్లోకి వస్తారా అంటూ జర్నలిస్ట్‌లపై దాడి చేశాడు. అయితే...ఈ గొడవ తరవాత ఆయనకు బీపీ పెరిగింది. ఇంట్లో ఉన్నట్టుండి పడిపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయనను వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే మోహన్ బాబుకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇంటి వ్యవహారాన్ని ఇలా బయట వేసుకోవడంపై మండి పడ్డారు. మోహన్ బాబుతో పాటు మంచు మనోజ్ గన్స్‌ని సీజ్ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే..ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతుండడం వల్ల విచారణకు వెళ్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వైద్యులు చెబుతున్నారు.