అన్వేషించండి
Advertisement
AP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
AP SSC Exams Schedule 2025 | ఏపీ విద్యాశాఖ టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టెన్త్ ఎగ్జామ్స్ తేదీలను ప్రకటించారు.
AP 10th Class 2025 Exam date | అమరావతి: ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ బుధవారం నాడు విడుదల చేశారు. వచ్చే ఏడాది 2025 మార్చి 17న టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. మార్చి 31 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. విద్యార్థులకు ఒత్తిడికి లోను కాకుండా ఉండేందుకు రోజు విడిచి రోజు ఎగ్జామ్స్ నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకున్నట్టు లోకేష్ పేర్కొన్నారు. ఒక్కో రోజు గ్యాప్ ఉన్నందున విద్యార్థులు టెన్షన్ లేకుండా పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని టెన్త్ బోర్డ్ ఎగ్జామ్‌కు హాజరు కానున్న విద్యార్థులకు మంత్రి లోకేష్ సూచించారు.
టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పూర్తి షెడ్యూల్
- 17-03-2025 (సోమవారం) - ఫస్ట్ ల్యాంగ్వేజ్ గ్రూప్ ఏ - 9.30 నుంచి 12.45 వరకు
- 17-03-2025 (సోమవారం) - ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 1 కాంపోజిట్ కోర్స్ - 9.30 నుంచి 12.45 వరకు
- 19-03-2025 (బుధవారం) - సెకండ్ ల్యాంగ్వేజ్ - 9.30 నుంచి 12.45 వరకు
- 21-03-2025 (శుక్రవారం) - ఇంగ్లీష్ - 9.30 నుంచి 12.45 వరకు
- 22-03-2025 (శనివారం) - ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 2 కాంపోజిట్ కోర్స్ - 9.30 నుంచి 11.15 వరకు
- 22-03-2025 (శనివారం) - OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) - 9.30 నుంచి 12.45 వరకు
- 24-03-2025 (సోమవారం) - మ్యాథమేటిక్స్ - 9.30 నుంచి 12.45 వరకు
- 26-03-2025 (బుధవారం) - భౌతికశాస్త్రం - 9.30 నుంచి 12.45 వరకు
- 28-03-2025 (శుక్రవారం) - జీవశాస్త్రం - 9.30 నుంచి 12.45 వరకు
- 29-03-2025 (శనివారం) - OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) - 9.30 నుంచి 12.45 వరకు
- 29-03-2025 (శనివారం) - SSC ఒకేషనల్ కోర్స్ (థియరీ)- 9.30 నుంచి 11.30 వరకు
- 31-03-2025 (సోమవారం) - సాంఘీక శాస్త్రం - 9.30 నుంచి 12.45 వరకు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement