తమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్
తమిళనాడులోని తండలం ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ ట్రక్ ప్రైవేట్ ట్రావెల్ బస్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ట్రక్ డ్రైవర్‌కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్ టీమ్ ఘటనా స్థలానికి వచ్చింది. బాధితులను శ్రీ పెరుంబుదూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించారు. అయితే...ఈ ప్రమాదం జరిగినప్పుడు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో అంతా రికార్డ్ అయింది. ట్రక్ ఢీకొట్టడం వల్ల బస్ ఓ కరెంట్ పోల్‌ని బలంగా తాకి బోల్తా పడింది. భారీ శబ్దాలు రావడం వల్ల వాహనదారులు భయపడిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే..గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో కరెంట్ పోల్ పూర్తిగా ధ్వంసమైంది. పరిమితికి మించి వేగంతో రావడం వల్ల ట్రక్ స్పీడ్ కంట్రోల్ కాలేదని, అందుకే ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.