గూగుల్ సెర్చ్‌లో టాప్ ప్లేస్‌లో పవన్ కల్యాణ్
గూగుల్ లో పవన్ కళ్యాణ్ సత్తా చాటారు. అది కూడా ఏపీలోనో..ఇండియాలోనో కాదు..ఏకంగా ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గురించి తెగ సెర్చ్ చేశారు. గూగుల్ 2024 సంవత్సరానికి గానూ గ్లోబల్ ట్రెండింగ్ లిస్ట్ ను రిలీజ్ చేసింది. అందులో ఎంటర్ టైన్మెంట్ విభాగంలో నటుల జాబితాలో పవన్ కళ్యాణ్ ప్రపంచవ్యాప్తంగా రెండోస్థానంలో నిలిచారు. పవన్ కళ్యాణ్ సినిమా ఈ ఏడాది ఒక్కటి కూడా విడుదల కాకపోవటం ఇక్కడ విశేషం. కానీ సినిమాల నుంచి పొలిటికల్ జర్నీ ప్రారంభించిన పవన్ కళ్యాణ్...రాజకీయాల్లో ఈ ఏడాది ఓ సునామీనే సృష్టించారు. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 21 గెలుచుకోవటం..రెండు ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధించటంతో పాటు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హిందూ ధర్మ పరిరక్షణ అనే అంశంతో గ్లోబల్ స్థాయికి చేరుకున్న పవన్...ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన నటుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సీజ్ ది షిఫ్ అనే అంశాలు...గూగుల్ ను షేక్ చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. మొదటిస్థానంలో అమెరికన్ నటుడు కేటి విలియమ్స్ ఉండగా...భారతీయ నటులు హీరా ఖాన్, నిమ్రత్ కౌర్ 5,8 స్థానాల్లో నిలిచారు.