YSRCP: జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
North Andhra: ఉత్తరాంధ్ర వైసీపీలో నేతుల ఇంకా బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో వైసీపీ ఉనికి అసలు కనిపించడం లేదు.
North Andhr YSRCP Leaders not showing interest to come out yet : ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు పార్టీకి పూర్వ వైభవం సంగతి పక్కన పెడితే.. తాము ఎక్కడ ఉన్నామన్నది కూడా తెలుసుకునే వాతావరణంలో కూడా చాలామంది లేకుండా పోయారు. అంతటి దారుణమైన ఓటమితో వైసీపీ కునారిల్లింది.ఉత్తరాంధ్రలో చూస్తే వైసీపీ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఉమ్మడి మూడు జిల్లాలూ టీడీపీకి కంచుకోటలు. టీడీపీ పుట్టిన నాటి నుంచీ ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఆదరిస్తున్న ప్రాంతాలుగా ముద్ర పడ్డాయి. అటువంటి ఉత్తరాంధ్రలో, టీడీపీ రాజకీయ జీవితంలో తొలిసారి పరాభవం 2019లో జరిగింది. అదే సమయంలో వైసీపీని అందలం ఎక్కించి, జనాలు కూర్చోబెట్టారు.
అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్న వైసీపీ నేతలు
అంది వచ్చిన అవకాశాన్ని వైసీపీలో నాయకులు, సీనియర్లు ఎంతవరకూ సద్వినియోగం చేసుకున్నారు అన్నది పక్కన పెడితే, ఈ రోజు భారీ పరాజయం మాత్రం పార్టీని కుంగదీస్తోంది.టీడీపీ మళ్లీ పుంజుకుంది. పటిష్టంగా మారింది. కూటమిలోని జనసేనకు కూడా ఉత్తరాంధ్రలో సామాజిక బలం ఉండడంతో, టీడీపీకి అన్నింటా కలసివస్తోంది. ఈ క్రమంలో వైసీపీలో నిస్తేజం నిండా ఆవరించింది. నేతలు ఎక్కడికక్కడ చతికిల పడిపోయారు. రేపటి రోజు గురించి బెంగటిల్లుతూ పొద్దుపుచ్చుతున్నారు. వైసీపీలో ఉంటే తమకు తమ వారసులకు, మంచి భవిష్యత్తు దక్కుతుందా అన్న సందేహాలలో చాలామంది ఉన్నారు. మళ్లీ ఫ్యాన్ జోరు చేస్తుందా, లేదా అన్న అనుమానాలు అణు వణువునా నాయకులలో ఉండడం గమనార్హం. అనేక దశాబ్దాలుగా రాజకీయాలలో ఉంటూ గెలు పోటములు చవిచూసినవారు సైతం 2024 ఎన్నిక లలో ఓటమితో, మైండ్ సెట్ మార్చుకుంటున్నారా, అన్న చర్చ కూడా సాగుతోంది.
వైసీపీకి భవిష్యత్ ఉండదన్న అనుమానాలు
వైసీపీలో ఉంటే రాజ కీయం ముందుకు సాగదు అన్న నిశ్చయానికి వచ్చిన వారు అంతా నిశ్శబ్దం అయ్యారు. అయితే వారు పార్టీలోనే ఉంటున్నారు..కానీ చడీ చప్పుడూ అయితే లేదు. వైసీపీలోనే ఉంటూ ఎదురు చూపులు చూస్తున్నారు.వేరే పార్టీలలోకి వెళ్లిపోవడానికి ఉన్న పార్టీ నుంచే రాజకీయం చేసుకుంటున్నారు అన్నది కూడా ప్రచారంలో ఉన్నమాట. దాంతో పార్టీ అధినాయ కత్వానికి కూడా ఈ తీరుతెన్నులు అసలు అర్ధం కావడంలేదు. సైలెంట్గా ఉన్నవారు పార్టీలో ఉన్నట్లా లేనట్లా అన్నది సైతం బోధపడడంలేదు. పార్టీతో పట్టనట్లుగా ఉంటున్న వారు, బయటకు వెళ్తే స్పష్టత వస్తుంది. కానీ అలా చేయడంలేదు. వైసీపీ నేతలుగా ఉంటూనే రాజకీయ రాయబేరాలు చేసుకుంటు న్నారని అంటున్నారు. దాంతో వైసీపీలో ఏం జరు గుతోంది అన్నది హైకమాండ్‌కు కూడా తోచని స్థితిగా ఉంది.
పార్టీ ముఖ్య నేతలు పిలిచినా వెళ్లని నేతలు
ఉత్తరాంధ్రలో చాలామంది సీనియర్ నేతలు,రాజకీయ ప్రముఖులు కూడా ఇపుడు పార్టీ పట్ల అంత ఆసక్తిని చూపించకపోవడం విచిత్రమైన పరి ణామంగానే చూడాలని అంటున్నారు. వీరి విషయం లో ఏమి చేయాలన్నది కూడా అధినాయకత్వానికి తెలియని విష యంగా మారుతోంది. పార్టీలో ఉన్న సీనియర్లను పక్కన పెట్టలేక అలాగని కొనసాగిం చలేక హైకమాండ్ సతమతమవుతోంది.దాంతో ఇటీవల కాలంలో ఉత్తరాం ధ్రలోని పార్టీ నాయ కులకు కబురు పంపుతోంది. పార్టీలో ఉంటే పదవులు ఇస్తామని, మళ్లీ చురుకుగా పనిచేయాలని కోరుతోంది. అలాంటి అవకాశం ఉన్నవారంతా, అధినాయకత్వం ప్రతిపాద నలకు ప్రతిస్పందిస్తారని హైకమాండ్ ఆలోచనగా ఉంది.ఒకవేళ అలా పార్టీ సూచనలను పట్టించుకోకపోతే వేరే ప్రత్యామ్నాయా లను వెతుక్కోవాలని కూడా వైసీపీ హైకమాండ్ సీరియస్గా నే యోచిస్తోందని అంటున్నారు. ఇలా మూడు ఉమ్మడి జిల్లాలలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో చాలాచోట్ల సరైన అభ్యర్థులు అయితే లేరు అన్న మాట ఉంది. అలాగని సీని యర్లను కాదంటే పార్టీలో వర్గపోరు మొదలవు తుందని ఆలోచిస్తున్నారు. అందువల్ల సీనియర్లు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా పార్టీ కూడా తమదైన నిర్ణయాలు ప్రకటించాలని చూస్తోంది. దీంతో వైసీపీలో అంతటా వేచి చూసే ధోరణి కనిపిస్తోంది. ఆరు నెలల కాలం ముగిసింది. వైసీపీ ప్రజా సమస్యల మీద పోరాటాలకు పిలుపు ఇస్తున్న వేళ..ఉత్తరాంధ్రలో పార్టీని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు సూచిస్తున్నారు