అన్వేషించండి

Janasena: వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?

Andhara Praesh: కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన క్యాడర్ రచ్చ రచ్చ చేసుకుంటున్నారు. వైసీపీ నుంచి వచ్చి జనసేనలో చేరిన వారితోనే సమస్యలు వస్తున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

problems with those who came from YCP and joined Jana Sena : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం సాఫీగా సాగిపోతోంది. చంద్రబాబు,పవన్  మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. ఎక్కడా చిన్న వివాదం కూడా రాకుండా ఒకరినొకరు పొగుడుకుంటూ ప్రతి నిర్ణయాన్ని  చర్చించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం జనసేన, టీడీపీ క్యాడర్ తిట్టుకుంటున్నాయి. కొట్టుకుంటున్నాయి. ఇది వివాదాస్పదం అవుతోంది. రెండు పార్టీల హైకమాండ్లు ఇంకా ఆ వివాదాల జోలికి వెళ్లలేదు. దీంతో అంతకంతకూ పెరుగుతున్నాయి. 

జనసేనలో చేరికల వల్ల వచ్చిన  సమస్యలా ? 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు  పెరిగిపోయాయి. పై స్థాయితో పాటు కింది స్థాయిలోనూ చాలా మంది నేతలు జనసేనలో చేరిపోయారు. వీరంతా ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పని చేశారు. అయితే జనసేనలో చేరిన తర్వాత వారు  కొన్ని నియోజకవర్గాల్లో చెలరేగిపోతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.  వారి తీరుతో టీడీపీ నేతలు తీవ్ర అసహనానికి  గురవుతున్నారు. పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనూ ఈ నియోజకవర్గంలోనూ ఈ పరిస్థితి ఉంది.
పిఠాపురంలో వైసీపీ నుంచి జనసేనలో చేరిన వాళ్లు రెచ్చిపోతున్నారని టీడీపీ నేత వర్మ అంటున్నారు.  జెండాల దగ్గర నుంచి రచ్చ చేస్తున్నారుని.. టీడీపీ నేతలు ఎవరైనా  వస్తే..  కండువాలు వేసుకోకపోయినా కావాలన గొడవ చేస్తున్నారని అంటున్నారు.  ఇది టీడీపీ ఇంచార్జ్ వర్మకు సమస్యగా మారుతోంది. వారు చేస్తున్న అల్లరిని నియంత్రించేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు.  ఇవి అంతకంతకూ  పెరిగిపోతున్నాయి. 

'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు

నెల్లిమర్లలో వైసీపీ ఫిరాయింపు నేతలదే ఆధిపత్యం

నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పూర్తిగా వైసీపీ నుంచి వచ్చిన నేతలతోనే రాజకీయం చేస్తున్నారని  టీడీపీ నేతలంటున్నారు.  టీడీపీ ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజుకు   కనీస   గౌరవం కూడా ఇవ్వడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.  జనసేనకు క్యాడర్ లేకపోయినా టీడీపీ నేతలు ప్రాణం పెట్టి ఆమెను గెలిపించారని ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వారితో కలిసి టీడీపీ నేతల్ని వేధిస్తున్నారని వారు మండిపడుతున్నారు.   ఇక దెందులూరులో ప్రతి వైసీపీ నేత తాము జనసేన అంటూ వచ్చి.. పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.  పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా రచ్చ జరిగింది.  టిడిపి, జనసేన మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.  దీనికి కారణం ఇటీవల వైసిపి నుండి జనసేనలోకి చేరిన కార్యకర్తలే అని టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్  ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమిని ఓడించడానికి ప్రయత్నించిన వారే ఇప్పుడు జనసేనలో చేరి పెత్తనం చెలాయించడానికి చూస్తున్నారనీ, ఇలాంటివి తన దగ్గర కుదరవని చింతమనేని  హెచ్చరిస్తున్నారు.

Also Read: YS Sharmila: ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు

వైసీపీ నుంచి వచ్చి చేరేవారితోనే కొన్ని నియోజకవర్గాల్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. వారు కూటమిలో చిచ్చు పెట్టే ఉద్దేశంతోనే వచ్చి చేరుతున్నారా లేకపోతే.. మరో కారణం ఉందా అని విశ్లేషించి ఈ వివాదాలకు ... టీడీపీ, జనసేన చెక్ పెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే ఇవన్నీ మండల స్థాయి వ్యవహారాలే. అందుకే ఇంకా అధినేతల వరకూ వెళ్లలేదని  చెబుతున్నారు. అయితే ఇవి ఇంకా  పెరగకుండా ఉండాలంటే తక్షణం చెక్ పెట్టేందుకు అధినేతలు దృష్టి పెట్టాలని క్యాడర్ కోరుకుంటున్నారు.  

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
Golbal Star Ram Charan : అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
Posani Krishna Murali: సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు - నటుడు పోసాని, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడలపై కేసులు నమోదు
సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు - నటుడు పోసాని, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడలపై కేసులు నమోదు
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Embed widget