అన్వేషించండి

YS Sharmila: ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు

Free Gas Cylinder Scheme | తన సోదరుడు వైఎస్ జగన్ తో ఆస్తి పంపకాలపై పోరాటం చేస్తూనే.. మరోవైపు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు వైఎస్ షర్మిల. ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది..

YS Sharmila criticises AP Govt over Power Tarrif hike | విజయవాడ: ఓ వైపు తన సోదరుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆస్తి పంపకాలపై పోరాటం చేస్తూనే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తాజాగా కూటమి ప్రభుత్వం మొదలుపెట్టిన ఉచిత సిలిండర్ల పథకాన్ని, విద్యుత్ ఛార్జీల పెంపుతో ముడిపెట్టి తనదైన శైలిలో చంద్రబాబు సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఉచిత సిలిండర్లు ఇచ్చామని గప్పాలు కొట్టుకుంటున్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ప్రభుత్వం మరోవైపు రాష్ట్ర ప్రజలకు విద్యుత్ ఛార్జీల వాత పెట్టిందని ఎద్దేవా చేశారు షర్మిల. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో షర్మిల చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.

దీపం పెట్టామని గఫ్ఫాలు

3 సిలిండర్లు ఉచితంగా ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామని గఫ్ఫాలు కొట్టుకుంటున్న టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుతో సామాన్యులకు వాతలు పెడుతోందని షర్మిల విమర్శించారు. "ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే” ఇదే మరి అంటూ చంద్రబాబు ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఉచిత సిలిండర్ల పథకం (Free Gas Cylinder Scheme) కింద ఏడాదికి రూ.2685 కోట్లు ఇస్తే.. అదే సమయంలో రాష్ట్ర ప్రజల వద్ద నుంచి కరెంటు బిల్లుగా ముక్కుపిండి అదనంగా వసూలు చేసేది రూ.6వేల కోట్లు. అంటే రాష్ట్ర ప్రజలపై రూ.3వేల కోట్లు అదనపు భారం పడుతుందని షర్మిల అభిప్రాయపడ్డారు. 

దీపం - 2 కింద పేదవాడి ఇంట్లో మీరు తెచ్చిన వెలుగులు పక్కన పెడితే .. కరెంటు బిల్లుల రూపంలో పేదల కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం నింపేది కారు చీకట్లు. గత వైసిపి ప్రభుత్వమే చేసిన పాపమే ఇదని, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని, బిల్లుల వసూళ్లకు అనుమతి ఇచ్చింది APERC అని.. మేము కాదని, చెప్తున్నవి కుంటి సాకులు అని షర్మిల విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచిందని, తాము అధికారంలోకి వచ్చాక.. ఒక్క రూపాయి కూడా అదనపు భారం మోపమన్నారు. అవసరం అయితే 35 శాతం చార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు హామీలు ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు.

జగన్ కు, చంద్రబాబుకు ఏంటి తేడా?

వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచితే, ఇప్పుడు మీరు కూడా మొదలుపెట్టారు కదా. మీకు వాళ్లకు ఏంటి తేడా ? 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.35 వేల కోట్లు ప్రజలపై భారం మోపారు. ఇప్పుడు మీరు కూడా భారం మోపడం మొదలు పెట్టారని షర్మిల విమర్శించారు. మీకు వాళ్లకు ఏంటి తేడా అని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూ.6వేల కోట్లు ప్రజలపై మోపడం భావ్యం కాదు. బీజేపీ కి మద్దతు ఇస్తున్నారు కదా… సాయం తీసుకవచ్చి... ప్రభుత్వమే ఈ భారం మోయాలని కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలపై సర్దుబాటు చార్జీల భారాన్ని మోపినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నవంబర్ 5 న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిందని’ వైఎస్ షర్మిల తెలిపారు.

Also Read: Andhra Pradesh News: నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
Revanth To Modi: మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
YS Sharmila: ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు
ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు
EID 2025 Releases: రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!
రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్లెబనాన్‌లోని బీరట్‌ సిటీపై దాడులు చేసిన ఇజ్రాయేల్Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
Revanth To Modi: మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
YS Sharmila: ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు
ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు
EID 2025 Releases: రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!
రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!
Telangana Half Day School: తెలంగాణలో ఒంటిపూట బడులు, సమ్మర్ కాకున్నా ఇప్పుడు ఎందుకంటే!
తెలంగాణలో ఒంటిపూట బడులు, సమ్మర్ కాకున్నా ఇప్పుడు ఎందుకంటే!
Andhra Pradesh News: మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
Prashant Kishor: నా ఫీజు వంద కోట్లు - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన !
నా ఫీజు వంద కోట్లు - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన !
Asad Vs BJP: టీటీడీ బోర్డుతో వక్ఫ్ బిల్లును పోల్చిన అసదుద్దీన్ ఓవైసీ - ఘర్ వాపసీకి స్వాగతిస్తామని బీజేపీ కౌంటర్
టీటీడీ బోర్డుతో వక్ఫ్ బిల్లును పోల్చిన అసదుద్దీన్ ఓవైసీ - ఘర్ వాపసీకి స్వాగతిస్తామని బీజేపీ కౌంటర్
Embed widget