శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

ఇరుముడితో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు పౌర విమానయాన శాఖ విమాన ప్రయాణంలో నిబంధనలు సడలించింది.

సెక్యూరిటీ స్కానింగ్ అనంతరం భక్తులు నేరుగా ఇరుముడితో విమానంలోకి వెళ్లి ప్రయాణం చేయవచ్చునని తెలిపారు.

అయ్యప్ప భక్తుల సమస్యను తెలుసుకుని, వారి సౌకర్యార్థం నిబంధనలు సడలించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

అయ్యప్ప మండల దీక్షల నుంచి మకర జ్యోతి దర్శనం టైమ్ జనవరి 20 వరకు సడలింపు ఉంటుంది.

దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువగా అయ్యప్ప మాల ధరించి భక్తులు కేరళకు తరలి వెళ్తుంటారని తెలిసిందే

ఎంతో పవిత్రంగా భావించే ఇరుముడితో అయ్యప్ప భక్తులు విమానంలో ప్రయాణించేలా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు

ఆ సమయంలో అయ్యప్ప భక్తులు సెక్యూరిటీ సిబ్బందికి సహకరించి, ప్రయాణం చేయాలని రామ్మోహన్ నాయుడు సూచించారు

పవిత్ర దీక్షకు భంగం కలగకుండా అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకోవాలని ఆకాంక్షించారు